25.1 C
Hyderabad
Thursday, April 3, 2025

పుష్ప 2 విడుదలకు ముందే.. లగ్జరీ కారు కొనేసిన శ్రీలీల: దీని రేటెంతో తెలుసా?

Pushpa 2 Actor Sreeleela Buys New Range Rover: శ్రీలీల.. చిత్రసీమలో ఈ పేరుకు ప్రత్యేకంగా పరిచయమే అవకాశం లేదు. ఎందుకంటే చిత్రాంగద సినిమాలో చైల్డ్ ఆర్టిస్ట్‌గా కనిపించిన ఈ అమ్మడు, ఆ తరువాత కన్నడ సినిమాల్లో కూడా నటించింది. పెళ్లి సందడి సినిమాతో టాలీవుడ్‌లో హీరోయిన్‌గా అడుగుపెట్టి.. ఆ తరువాత ధమాకా, స్కంద, భగవంత్ కేసరి మరియు గుంటూరు కారం వంటి సినిమాల్లో నటించి బాగా పాపులర్ అయింది. ప్రస్తుతం ఐకాన్ స్టార్ అల్లు అర్జున సినిమా పుష్ప-2లో ఐటం సాంగ్‌లో కనిపించనుంది. ఈ సినిమా డిసెంబర్ 4న విడుదల కానుంది.

పుష్ప 2 సినిమా విడుదలకు ముందే నటి శ్రీలీల ఓ ఖరీదైన లగ్జరీ కారును కొనుగోలు చేసినట్లు సమాచారం. దీని ధర ఏకంగా రూ. 3 కోట్లు కావడం గమనార్హం. ఇటీవల ఈ కారుతో శ్రీలీల హైదరాబద్ విమానాశ్రయంలో కనిపించింది. ఈ కారు గురించి పూర్తి వివరాలు ఇక్కడ చూసేద్దాం..

రేంజ్ రోవర్

నటి శ్రీలీల కొనుగోలు చేసిన కారు ల్యాండ్ రోవర్ కంపెనీకి చెందిన ‘రేంజ్ రోవర్ ఎల్‌డబ్ల్యుబీ’ (Range Rover LWB) అని తెలుస్తోంది. దీనికి సంబంధించిన వీడియోలు కూడా నెట్టింట్లో వైరల్ అవుతోంది. ఈ కారు బోరాస్కో గ్రే కలర్ ఆప్షన్‌లో ఉంది. ఈ రంగు చూడటానికి చాలా ఆకర్షనీయంగా ఉండటం గమనించవచ్చు.

రేంజ్ రోవర్ విభిన్న వేరియంట్లలో అందుబాటులో ఉంది. ఇప్పటికే చాలామంది సెలబ్రిటీలు తమ గ్యారేజిలో ల్యాండ్ రోవర్ కార్లను చేర్చారు. ఈ జాబితాలోకి ఇప్పుడు శ్రీలీల కూడా చేరింది. రేంజ్ రోవర్ ప్రారంభ ధరలు రూ. 2.36 కోట్లు (ఎక్స్ షోరూమ్) అని తెలుస్తోంది.

భారతదేశంలో అందుబాటులో ఉన్న రేంజ్ రోవర్ మూడు పవర్‌ట్రెయిన్ ఎంపికలలో అందుబాటులో ఉంది. అవి పెట్రోల్, డీజిల్ మరియు ప్లగ్ ఇన్ హైబ్రిడ్. పెట్రోల్ వెర్షన్ 3.0 లీటర్ 6 సిలిండర్ ఇంజిన్ పొందుతుంది. ఇది 510 బీహెచ్‌పీ పవర్, 700 న్యూటన్ మీటర్ టార్క్ ప్రొడ్యూస్ చేస్తుంది. డీజిల్ మరియు ప్లగ్ ఇన్ హైబ్రిడ్ వెర్షన్స్ కూడా ఉత్తమ పనితీరును అందిస్తాయి.

Also Read: ‘పుష్ప 2’ సినిమాలో అల్లు అర్జున్ వాడిన కారు ఇదే.. దీని గురించి తెలుసా?

మంచి డిజైన్ మరియు లేటెస్ట్ ఫీచర్స్ కలిగిన రేంజ్ రోవర్ ఎల్‌డబ్ల్యుబీ.. అత్యుత్తమ సేఫ్టీ ఫీచర్స్ పొందుతుంది. ఇందులో ఆరు ఎయిర్‌బ్యాగ్‌లు, లేన్ డిపార్చర్ వార్ణింగ్, ఫార్వార్డ్ కొలీషియన్ బ్రేక్, ఆటోమాటిక్ ఎమర్జెన్సీ బ్రేకింగ్, హై బీమ్ అసిస్ట్, బ్లైండ్ స్పాట్ డిటెక్షన్, చైల్డ్ సీట్ యాంకర్ పాయింట్స్ మరియు సీట్ బెల్ట్ వార్ణింగ్ వంటి మరెన్నో ఫీచర్స్ ఉన్నాయి.

శ్రీలీల గ్యారేజిలోని ఇతర కార్లు

నటి శ్రీలీల రేంజ్ రోవర్ కారును మాత్రమే కాకుండా.. హోండా సిటీ కారును కూడా కలిగి ఉంది. అంతకంటే ముందు ఈమె మారుతి ఎస్-ప్రెస్సో కారును ఉపయోగించేది. అయితే వీటన్నింటిలో కంటే.. ఇటీవల కొనుగోలు చేసిన రేంజ్ రోవర్ ఖరీదు చాలా ఎక్కువ. మొత్తానికి ఈమె కోట్ల రూపాయల విలువైన కారును కొనుగోలు చేసేసింది.

రేంజ్ రోవర్ కార్లను కలిగి ఉన్న సెలబ్రిటీలు

ల్యాండ్ రోవర్ రేంజ్ రోవర్ కార్లను కలిగి ఉన్న సెలబ్రిటీల జాబితాలో రష్మిక మందన్నా, శృతి హాసన్, అనుష్క శర్మ, కత్రినా కైఫ్, మలైకా అరోరా, అక్షయ్ కుమార్, అర్జున్ కపూర్, సల్మాన్ ఖాన్, అలియా భట్, పూజ హెగ్డే, అమితాబ్ బచ్చన్, రణబీర్ కపూర్, సంజయ్ దత్, షారుఖ్ ఖాన్, సైఫ్ అలీ ఖాన్ మరియు పృద్విరాజ్ మొదలైన వారు ఉన్నారు.

శ్రీలీల ప్రస్తుతం చేస్తున్న సినిమాలు & రెమ్యునరేషన్

ప్రస్తుతం నటి శ్రీలీల మాస్ జాతర, రాబిన్‌హుడ్ వంటి చిత్రాలతో పాటు ఉస్తాద్ భగత్ సింగ్ సినిమాలో కూడా కనిపించనుంది. ఇక పోతే డిసెంబర్ 4న తెరపైకి రానున్న పుష్ప 2 సినిమాలో కిస్సిక్ అనే పాటకు చిందులేస్తూ కనిపించనుంది. శ్రీలీల రెమ్యునరేషన్ విషయానికి వస్తే.. ఈమె ఒక సినిమాలో నటించడానికి సుమారు రూ. 2 కోట్లు వరకు రెమ్యునరేషన్ తీసుకుంటుందని సమాచారం. అయితే పుష్ప సినిమాలో ఒక్క పాటకు మాత్రమే రూ. 2 కోట్లు రెమ్యునరేషన్ తీసుకున్నట్లు తెలుస్తోంది.

admin
adminhttps://marthatelugu.com
I'm Sri, have 6 years experience as a Content Writer in all categories, I always try to give the breaking news to the Internet Users. I'm a certified Journalist and I Worked as a Journalist in one of the famous telugu channel.

సంబంధిత వార్తలు

తాజా వార్తలు