Raghava Lawrence Gift MG Hector To His Brother: ఆధునిక కాలంలో సెలబ్రిటీలు కొత్త కార్లను కొనుగోలు చేయడం లేదా కావలసిన వారికి గిఫ్ట్స్ ఇవ్వడం సర్వ సాధారణం అయిపోయింది. గతంలో ఇలాంటి సంఘటనలు కోకొల్లలుగా వెలుగులోకి వచ్చాయి. మళ్ళీ ఇలాంటి ఘటనే తెరమీదకు వచ్చింది. ఇటీవల ప్రముఖ కొరియోగ్రాఫర్ మరియు నటుడు ‘రాఘవ లారెన్స్’ (Raghava Lawrence) తన తమ్ముడికి ఖరీదైన కారును గిఫ్ట్ ఇచ్చాడు. రాఘవ గిఫ్ట్ ఇచ్చిన కారు ఏది? దాని ధర ఎంత? అనే మరిన్ని వివరాలు వివరంగా ఈ కథనంలో తెలుసుకుందాం.
రాఘవ లారెన్స్ గిఫ్ట్
నటుడు రాఘవ లారెన్స్ తన తమ్ముడు ‘ఎల్విన్’కు గిఫ్ట్ ఇచ్చిన కారు ‘ఎంజీ మోటార్’ కంపెనీకి చెందిన ‘హెక్టర్’ (Hector). దీనికి సంబంధించిన ఫోటోలను రాఘవ తన సోషల్ మీడియాలో షేర్ చేశారు. ఇందులో నా తమ్ముడి తొలి చిత్రం ‘బుల్లెట్’లో నటనకు ఫిదా అయ్యాను. అతని నటన నన్ను గర్వపడేలా చేసింది. అందుకే నా తమ్ముడికి కారును గిఫ్ట్ ఇస్తున్నాను. అతనికి మీ అందరి ఆశీస్సులు కావాలని పేర్కొన్నారు.
నిజానికి సినిమాల్లో మాత్రమే కాకుండా ఎప్పటికప్పుడు అనాధలకు.. ఎంతోమంది శరణార్థులకు రాఘవ తన వంతు సాయం చేస్తుంటారు. మంచి మనసున్న రాఘవ తన తమ్ముడికి మొదటి సారి ఓ కారును గిఫ్ట్ ఇచ్చారు. దీనికి సంబంధించిన ఫోటోలు నెట్టింట్లో తెగ వైరల్ అవుతోంది. ఎల్విన్ నటించిన బులెట్ సినిమా త్వరలోనే విడుదల కానుంది.
ఎంజీ హెక్టర్
ఇక ఎంజీ హెక్టర్ విషయానికి వస్తే.. దేశీయ మార్కెట్లో అతి తక్కువ కాలంలో అత్యంత ప్రజాదరణ పొందిన చైనా కార్ల తయారీ సంస్థ ఎంజీ మోటార్ ఇప్పటికే అనేక కార్లను లాంచ్ చేస్తూ మంచి అమ్మకాలను పొందుతూ ఉంది. ఇందులో ఒకటి ఎంజీ హెక్టర్. ఇది మంచి డిజైన్ మరియు ఫీచర్స్ పొందుతుంది. పనితీరు పరంగా కూడా ఇది చాలా అద్భుతంగా ఉంటుంది.
రాఘవ లారెన్స్ గిఫ్ట్ ఇచ్చిన ఎంజీ హెక్టర్ నలుపు రంగులో చాలా ఆకర్షణీయంగా ఉండటం చూడవచ్చు. కారుతో రాఘవ, అయన తమ్ముడు ఎల్విన్ ఉండటం చూడవచ్చు. ఇందులో రాఘవ తన తమ్ముడికి ప్రేమతో ముద్దివ్వడం కూడా చూడవచ్చు. ప్రస్తుతం ఈ ఫోటోలు అభిమానులను ఫిదా చేస్తున్నాయి.
భారతదేశంలో ఎంజీ హెక్టర్ ధర రూ. 20 నుంచి రూ. 25 లక్షల మధ్య ఉంది. అయితే రాఘవ ఏ వేరియంట్ కొనుగోలు చేశారు అనేది తెలియాల్సి ఉంది. ఎందుకంటే ఇది మార్కెట్లో మల్టిపుల్ వేరియంట్లలో లభిస్తోంది. ఇందులో ఎల్ఈడీ హెడ్‌లైట్, ఫాగ్‌లైట్, డీఆర్ఎల్ వంటివి ఉన్నాయి. ఇవన్నీ కారుని అద్భుతంగా కనిపించేలా చేస్తాయి.
ఇంటీరియర్ విషయానికి వస్తే.. టచ్‌స్క్రీన్ ఇన్ఫోటైన్‌మెంట్ సిస్టం, ఆండ్రాయిడ్ ఆటో, ఆపిల్ కార్‌ప్లే, ఏసీ వెంట్స్, కప్ హోల్డర్స్, USB సాకేట్ మొదలైనవన్నీ ఉన్నాయి. సీటింగ్ పొజిషన్ కూడా చాలా అద్భుతంగా ఉంది. కాబట్టి లాంగ్ డ్రైవ్ చేయడానికి కూడా ఇవి అనుకూలంగా ఉన్నాయి. మొత్తం మీద ఇందులోని ఫీచర్స్ అన్నీ కూడా వాహన వినియోగదారులకు మంచి డ్రైవింగ్ అనుభూతిని అందిస్తాయి.
ఎంజీ హెక్టర్ పెట్రోల్ మరియు డీజిల్ ఇంజిన్ ఎంపికలతో లభిస్తుంది. ఈ రెండూ కూడా మంచి పనితీరుని అందిస్తాయి. కాబట్టి సాధారణ ప్రజలు మాత్రమే కాకుండా ఎక్కువ మంది సెలబ్రిటీలు కూడా ఈ కారును ఇష్టపడి మరీ కొనుగోలు చేస్తుంటారు. ఈ కారు మంచి డిజైన్ మరియు ఫీచర్స్ మాత్రమే కాకుండా అత్యాధునిక సేఫ్టీ ఫీచర్స్ కూడా ఉన్నాయి. ఇవన్నీ వాహన వినియోగదారుల యొక్క భద్రతను నిర్దేశిస్తాయి.
Don’t Miss: కోట్లు కొల్లగొట్టిన సినిమాలో స్టార్ హీరో చిన్నప్పటి పాత్రలో కనిపించాడు.. ఎవరో తెలుసా?
కార్లను గిఫ్ట్‌గా ఇవ్వడం ఇదే మొదటిసారి కాదు!
నిజానికి గతంలో చాలామంది సెలబ్రిటీలు ఖరీదైన కార్లను వారి సన్నిహితులకు గిఫ్ట్స్ ఇచ్చిన సందర్భాలు కోకొల్లలుగా ఉన్నాయి. డార్లింగ్ ప్రభాస్ తన ఫిట్‌నెస్ ట్రైనర్ లక్ష్మణ్ రెడ్డికి రేంజ్ రోవర్ కారును గిఫ్ట్ ఇచ్చారు. హీరో నితిన్ కూడా.. డైరెక్టర్ వెంకీ కుడుములకు రేంజ్ రోవర్ కారును గిఫ్ట్ ఇచ్చారు. చలో సినిమా గొప్ప విజయం సాధించిన తరువాత హీరో నాగసౌర్య తల్లి.. అతనికి పోర్స్చే కారును గిఫ్ట్ ఇచ్చింది. హీరో మహేష్ బాబు బర్త్‌డేకు.. నమ్రత రేంజ్ రోవర్ కారును గిఫ్ట్ ఇచ్చింది. రామ్ చరణ్ కూడా తన తండ్రి చిరంజీవికి ల్యాండ్ క్రూయిజర్ కారును గిఫ్ట్ ఇచ్చారు.