ఏదైనా ఒకరంగంలో సుదీర్ఘ కాలం మనగలగడం అంటే.. అది సాధారణ విషయం కాదు. అలాంటిది సినిమా రంగంలో ఐదు దశాబ్దాలు (50 ఏళ్లు) పూర్తి చేసుకున్న నటులుగా సూపర్ స్టార్ రజినీకాంత్, నటసింహ నందమూరి బాలకృష్ణ రికార్డ్ క్రియేట్ చేశారు. దీనికి గాను.. గోవాలో జరగనున్న ఇంటర్నేషనల్ ఫిల్మ్ ఆఫ్ ఇండియా 2025 (ఐఎఫ్ఎఫ్ఐ 2025) కార్యక్రమంలో వీరిని ఘనంగా సత్కరించనున్నారు. ఈ విషయాన్ని కేంద్ర సమాచార, ప్రసార శాఖ సహాయకమంత్రి డాక్టర్ ఎల్ మురుగన్.. గోవా సీఎం ప్రమోద్ సావంత్ సమక్షంలో వెల్లడించారు.
2025 నవంబర్ 20న ప్రారంభం కానున్న ఐఎఫ్ఎఫ్ఐ కార్యక్రమం నవంబర్ 28న ముగుస్తుంది. కార్యక్రమం ముగింపు రోజు రజనీకాంత్, బాలకృష్ణలకు సన్మానం చేయనున్నారు. భారతీయ చలనచిత్ర రంగంలో శాశ్వత ముద్ర వేసిన ఈ ఇరువురిని ఇక్కడ గౌరవించనున్నారు. ఈ వేడుకలు డాక్టర్ శ్యామ్ ప్రసాద్ ముఖర్జీ స్టేడియంలో జరుగుతుంది. అయితే ఈ కార్యక్రమంలో డీబీ బందోద్కర్ రాదు వెంబడి గల్లా ఫ్లోట్ పరేడ్‌లో ప్రారంభమవుతుందని సమాచారం.
ఐఎఫ్ఎఫ్ఐ కార్యక్రమం గురించి
గోవాలో ప్రారంభం కానున్న ఐఎఫ్ఎఫ్ఐ కార్యక్రమంలో.. 84 వేర్వేరు దేశాల నుంచి 270 చిత్రాలను ప్రదర్శించనున్నారు. ఇందులో సుమారు 7500 మంది ప్రతినిధులు పాల్గొనే అవకాశం ఉందని మంత్రి మురుగన్ పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో భారతీయులు మాత్రమే కాకుండా.. స్పెయిన్, జపాన్, ఆస్ట్రేలియా వంటి దేశాలు కూడా పాల్గొంటాయి. ఇక్కడ కేన్స్, బెర్లినేల్, వెనిస్ మరియు ఇతర అంతర్జాతీయ చలన చిత్రాల నుంచి అవార్డులు గెలుచుకున్న చిత్రాలను ప్రదర్శిస్తారు.
రజినీకాంత్
తమిళ నటుడు అయినప్పటికీ.. రజనీకాంత్ తెలుగువారికి కూడా సుపరిచయమే. ఈయన 1975లో అపూర్వ రాగంగల్ సినిమాతో సినిమా పరిశ్రమలోకి అడుగుపెట్టాడు. ప్రారంభంలో అనేక నెగిటివ్ పాత్రలను పోషించిన ఈయన.. ఆ తరువాత మంచి మంచి సినిమాల్లో నటించి ఎనలేని అభిమాన గణాన్ని సొంతం చేసుకున్నారు. 70 సంవత్సరాల వయసు దాటినప్పటికీ.. రజినీ కాంత ఇప్పటికి కూడా తనదైన రీతిలో సినిమాల్లో నటిస్తూ.. ప్రేక్షకులను ఆకట్టుకుంటున్నారు. సినిమా రంగానికి ఈయన చేసిన సేవకుగాను.. ఇప్పటికే ఎనలేని గొప్ప అవార్డులు కూడా రజినీకాంత్ సొంతం అయ్యాయి. ఎంత పెద్ద స్టార్ అయినా.. చాలా సాదాసీదాగా గడిపే మహామనిషి ఈయనే అని చెప్పడంలో ఎలాంటి సందేహం లేదు.
నందమూరి బాలకృష్ణ
రామారావు కుమారుడు.. నందమూరి బాలకృష్ణ చిన్నప్పటి నుంచి సినిమాల్లో నటించడం ప్రారంభించారు. దీంతో ఈయన నటించిన మొత్తం సినిమాల సంఖ్య ఏకంగా 100 దాటేసింది. సమరసింహా రెడ్డి, సింహా, ముద్దుల మావయ్య వంటి ఎన్ని సినిమాల్లో నటించిన ఈయన రాజకీయ ప్రవేశం కూడా చేశారు. తెలుగుదేశం పార్టీ తరపున ఎమ్మెల్యేగా కూడా గెలుపొందారు. ఇప్పుడు అఖండ 2 సినిమాతో త్వరలోనే మరో సినిమాతో తెరమీద కనిపించనున్నారు. 65 సంవత్సరాల వయసులో కూడా.. కుర్ర హీరోలకు కూడా గట్టి పోటీ ఇస్తున్న ఈయన.. నటన అనిర్వచనీయం అనే చెప్పాలి. అటు సినిమా రంగంలో, ఇటు రాజకీయాల్లో బిజీగా ఉండే బాలకృష్ణ అనేక ప్రతిష్టాత్మక అవార్డులను సొంతం చేసుకున్నారు. ఈ మధ్య కాలంలోనే ఈయనకు భారత ప్రభుత్వం పద్మభూషణ్ అవార్డుతో సత్కరించింది.
ఉమశ్రీ చీఫ్ ఎడిటర్‌గా పనిచేస్తున్నారు. ట్రెండింగ్ అంశాలు, వివిధ విభాగాలపై ప్రత్యేక కథనాలను రాస్తారు. ఆయన తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, జాతీయ, అంతర్జాతీయ వార్తలు, సైన్స్ & టెక్నాలజీ, కేంద్ర ప్రభుత్వ పథకాలు, మౌలిక సదుపాయాల కల్పన, పాలిటిక్స్ తదితర రంగాలకు సంబంధించిన విశ్లేషణాత్మక కథనాలు అందిస్తున్నారు. జర్నలిజం రంగంలో ఆయనకు 8 సంవత్సరాలకు పైగా అనుభవం ఉంది.