ఈ రోజు గ్లోబల్ స్టార్‌గా ఎదిగిన రామ్ చరణ్ గురించి అందరికి తెలుసు. అయితే ఒకప్పుడు యాక్టింగ్ ఇన్స్టిట్యూట్లో ఉన్న.. డైలాగ్స్ చెప్పడంలో ఇబ్బంది పడిన రామ్ చరణ్ గురించి బహుశా ఎవరికీ తెలియకపోవచ్చు. అయితే దీనికి సంబంధించిన వీడియోను సదరు ఆ యాక్టింగ్ స్కూల్ యాజమాన్యం రిలీజ్ చేసింది.
శ్రియాతో లవ్ సీన్!
నిజం చెప్పాలంటే.. మెగాస్టార్ చిరంజీవి కుమారుడు రామ్ చరణ్ తేజ్ 2007లో చిరుత సినిమాలో తెరమీదకు వచ్చారు. అంతకంటే ముందు.. సినిమాల్లోకి అడుగుపెట్టడానికి.. యాక్టింగ్ బాగా నేర్చుకోవడానికి ముంబైలోని కిషోర్ నమిత్ కపూర్ యాక్టింగ్ ఇన్స్టిట్యూట్లో జాయిన్ అయ్యారు. ఇక్కడ చాలామంది బాలీవుడ్ ప్రముఖులు కూడా యాక్టింగ్ నేర్చుకున్నారు. అయితే ఆ యాక్టింగ్ ఇన్స్టిట్యూట్లో ఉన్నప్పుడు.. నటి శ్రియాతో ఒక లవ్ సీన్ చేయాల్సి వచ్చింది. ఆ సమయంలో రామ్ చరణ్ చాలా కొంత ఇబ్బందిపడినట్లు.. ఇన్స్టిట్యూట్ కోచ్ పేర్కొన్నారు. దీనికి కారణం చరణ్ కెమెరా ముందు నటించడం అదే మొదటిసారి.
వీడియోలో నటి శ్రియ కూడా కనిపించారు. ఆమెలో ఎలాంటి బిడియం లేదు. ఎందుకంటే అప్పటికే ఆమె సౌత్ ఇండియన్ పాపులర్ హీరోయిన్లలో ఒకరుగా ఉన్నారు. ఈమె 2001లోనే ఇష్టం అనే సినిమాతో సినిమా అరంగేట్రం చేసింది. అయినప్పటికీ యాక్టింగ్ఇంకా మెరుగుపరచుకోవాలనే ఉద్దేశ్యంతో శ్రియ కూడా యాక్టింగ్ స్కూల్లో చేరారు. అలాంటి సమయంలో శ్రియ, రామ్ చరణ్ మధ్య ఈ సన్నివేశం చిత్రీకరించారు.
హార్స్ రైడింగ్ & డ్యాన్స్
ఇకపోతే రామ్ చరణ్ కేవలం యాక్టింగ్ మాత్రమే కాకుండా.. హార్స్ రైడింగ్, డ్యాన్స్ వంటి వాటిలో కూడా ప్రత్యేక శిక్షణ పొందారు. ఇవన్నీ కూడా తన సినిమా కెరియర్లో చాలా ఉపయోగపడ్డాయి. మొదటి సినిమా తరువాత చాలామంది.. రామ్ చరణ్ సినిమా ఇండస్ట్రీలో నిలదొక్కుకోగలడా అని అనుమానాలు వ్యక్తం చేశారు. అయితే ఈ రోజు గ్లోబల్ స్టార్ అయ్యాడు. ఎన్నో ప్రతిష్టాత్మక అవార్డులను కూడా సొంతం చేసుకున్నారు. కష్టపడితే.. తప్పకుండా గుర్తింపు వస్తుంది అని చెప్పడానికి రామ్ చరణ్ నిదర్శనం.
రామ్ చరణ్ సినిమా ప్రయాణం
నటుడు రామ్ చరణ్.. చిరుత సినిమాతో తెరమీదకు వచ్చినప్పటికీ, మగధీర సినిమాతో తన జీవితంలోనే అతిపెద్ద సక్సెస్ చూసేసారు. ఆ తరువాత వచ్చిన సినిమాల్లో కూడా తనదైన రీతిలో నటించి ప్రేక్షకులను మెప్పించారు. కాగా ఆర్ఆర్ఆర్ సినిమాతో మరింత క్రేజ్ తెచ్చుకున్నారు. ప్రస్తుతం పెద్ది సినిమా కోసం చాలా కష్టపడుతున్నారు. దీనికి సంబంధించిన కొన్ని ఫోటోలు, గ్లిమ్స్ కూడా సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి.
రామ్ చరణ్, శ్రియ జంటగా నటించిన సినిమాలు లేదు, కానీ ఆర్ఆర్ఆర్ సినిమాలో మాత్రం చరణ్ తల్లిగా నటించారు. యాక్టింగ్ నేర్చుకుంటున్న సమయంలో చరణ్ జుట్టు పెంచి ఉండటం, గెడ్డం స్టైల్ అంత ఎలా ఉందో.. వీడియోలో చూడవచ్చు. అయితే ప్రస్తుతం సినిమాల్లో నటిస్తూ.. తండ్రికి తగ్గ తనయుడిగా ఎదిగారు. ఉపాసనను పెళ్లి చేసుకున్నారు. ఈ జంటకు క్లింకార అనే పాప కూడా ఉంది.