మెగా పవర్ స్టార్ రామ్ చరణ్, జాన్వీ కపూర్ జంటగా నటిస్తున్న చిత్రం పెద్ది. ఈ సినిమా టీమ్ మూవీ కొత్త అప్డేట్ అయితే ఇచ్చేసింది. బుచ్చిబాబు ఈ సినిమకు దర్శకత్వం వహిస్తున్నాడు. వృద్ధి ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ బ్యానర్‌పైన వెంకట సతీష్ కిలరు నిర్మాతగా వ్యవహరిస్తున్నారు. ఇందుకు మైత్రి మూవీ మేకర్స్ మరియు సుకుమార్ రైటింగ్స్ సంస్థలు కూడా నిర్మాణంలో బాగమయ్యాయి. ఏఆర్. రెహమాన్ ఈ సినిమాకు మ్యూజిక్ అందిస్తున్నారు. రత్నవేలు కెమెరామెన్‌గా పనిచేస్తున్నారు. 2026 మార్చి 27న ఈ సినిమాను విడుదల చేయడానికి ప్రయత్నాలు జరుగుతున్నాయి.
చికిరి చికిరి సాంగ్
పెద్ది చిత్రం నుంచి ఒక మంచి అప్డేట్ ఇచ్చేశారు. చికిరి చికిరి అనే పేరుతో ఒక మెలోడీ వీడియో సాంగ్ విడుదల చేశారు. ఇది ఏఆర్. రెహమాన్ సంగీత దర్శకత్వంలో వచ్చిన అద్భుతమైన గీతంగా మ్యూజిక్ లవర్స్ భావిస్తున్నారు. మోహిత్ చౌహాన్ ఈ పాటను ఆలపించారు. రెహమాన్ బాణికి బాలాజీ సాహిత్యాన్ని అందించాడు. జానీ మాస్టర్ కొరియోగ్రఫి చేశాడు. చికిరి పాట విడుదలైన కొన్ని గంటల్లోనే.. ఒక తెలుగు వీడియో మాత్రమే దాదాపు ఒక కోటి మందికి పైగా వీక్షించారు. ఇంకా మిగిలిన భాషల్లో కూడా కలుపుకుంటే ఇంకా ఎక్కువే ఉంటారు. ప్యాన్ ఇండియా లెవెల్ (తెలుగు, తమిళం, కన్నడ, మలయాళం, హిందీ) బాషలలో సాంగ్ రిలీజ్ అయి ఓ రేంజ్‌లో ప్రేక్షకుల్లోకి దూసుకెల్తోంది. బుచ్చిబాబుకు ఇష్టమైన మ్యూజిక్ డైరెక్టర్లలో ఏఆర్. రెహమాన్ ఒక్కరంట అందుకే ఈ సినిమాకు ఆయనతో వర్క్ చేస్తున్నాడట.
రామ్ చరణ్ డ్యాన్స్ హైలెట్
వీడియో సాంగ్‌లో రామ్ చరణ్ డ్యాన్స్ హైలెట్ అనే చెప్పాలి. పల్లెటూరులో క్రికెట్ బ్యాట్ పట్టుకుని వేసే స్టెప్స్ కొత్తగా ఉన్నాయి. తన మొదటి సినిమా చిరుత గుర్తుకొస్తున్నదని.. డ్యాన్స్‌లో ఆ గ్రేస్ కనిపిస్తుందని అభిమానులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. జానీ మాస్టర్ కొరియోగ్రఫీతో రామ్ చరణ్ అభిమానులకు ఫుల్ స్టఫ్ ఇచ్చాడని చెప్పొచ్చు. జాన్వీ కపూర్ సిటీ అమ్మాయిగా కనిపిస్తోంది. వీడియోలో మ్యూజిక్ డైరెక్టర్ రెహమాన్ పియానోతో, మూవీ డైరెక్టర్ బుచ్చి బాబు పాటని ఆస్వాదిస్తూ, సింగర్ మోహిత్ చౌహాన్ లిరిక్స్ పేపర్ పట్టుకుని కనిపించి మంచి అట్రాక్షన్ క్రియేట్ చేశారు.
పెద్ది విజయం సాధిస్తుందా?
హీరో లొకేషన్స్ ఎక్కువగా అడవి ప్రాంతంలో, మారుమూల పల్లెటూరులో, హీరోయిన్ పాత్ర సిటీ ఏరియాలో షూటింగ్ చేసినట్టు వీడియోలో కనిపిస్తోంది. ఆ క్యారెక్టర్లకు తగినట్టు ఎంపిక చేసిన ప్రదేశాలు అన్నీ కూడా చూడటానికి అత్యంత అద్భుతంగా కనిపిస్తున్నాయి. రామ్ చరణ్ మాస్ కుర్రాడి పాత్రలో బాగున్నాడు. 1980ల్లో క్రికెట్ చుట్టూ తిరిగే కథ అని ప్రచారంలో ఉన్నది. రామ్ చరణ్ గేమ్ ఛేంజర్ నిరాశపరిచినప్పటికి.. పెద్ది సినిమా మాత్రం ఖచ్చితంగా ఒక గొప్ప విజయాన్ని అందిస్తుందని ఈ చికిరి చికిరి పాట చూస్తే అర్థమైపోతోంది. ఇప్పటికే విడుదలైన గ్లింప్స్, పోస్టర్లలో గడ్డం, పొడుగు జుట్టు, ముక్కుకు పోగు పెట్టుకుని సినిమా పట్ల హైప్ తీసుకొచ్చారు. జగపతిబాబు, శివరాజ్ కుమార్, దివ్వయేందు శర్మ లాంటి వారు ఇందులో కీలక పాత్రల్లో నటిస్తున్నారు.