‘ఇది ప్రారంభం మాత్రమే’: రష్మిక మందన్న మైసా..

పుష్ప 2 సినిమా తరువాత.. నటి రష్మిక మందన్న చాలా బిజీ అయిపోయారు. థామా, ది గర్ల్‌ఫ్రెండ్ అంటూ వరుస సినిమాల్లో నటిస్తున్న ఈమె.. ఇప్పుడు ‘మైసా‘ సినిమాలో నటిస్తోంది. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ కేరళ అడవుల్లో ప్రారంభమైనట్లు.. డైరెక్టర్ రవీంద్ర పుల్లె అధికారికంగా వెల్లడించారు.

ఇది ప్రారంభం మాత్రమే!

నేషనల్ క్రష్ రష్మిక మందన్న ఓవైపు థామా.. విజయంతో ఆనందంగా ఉంది. మరోవైపు సినిమా ఆఫర్స్ వరుసగా వస్తున్నాయి. నేను ఎప్పుడూ మీకు కొత్తదనాన్ని, భిన్నమైనదాన్ని, ఉత్తేజకరమైనదాన్ని అందించడానికి ప్రయత్నిస్తాను. మైసా అనేది అలాంటి కోవకు చెందిందే. ఇంతకు ముందు ఎప్పుడూ నేను ఇలాంటి సినిమా చేయలేదు. ఇలాంటి పాత్ర చేయలేదు. నేను ఎప్పుడూ అడుగుపెట్టని ప్రపంచంలోకి అడుగుపెట్టాను. ఇది భయంకరంగా ఉంది. ఇందులో నేను భయానకంగా.. చాలా ఉత్సాహంగా ఉన్నాను. ఇది ప్రారంభం మాత్రమే అని తన ఎక్స్ ఖాతాలో రష్మిక మందన్న పోస్ట్ చేశారు.

కేరళ అడవుల్లో షూటింగ్!

డైరెక్టర్ రవీంద్ర పుల్లె.. పోస్ట్ చేసిన వీడియోలో ప్రశాంతమైన కేరళ అడవి, సుందమైన జలపాతాలు కనిపిస్తాయి. మొత్తం మీద రష్మిక ఒక డిఫరెంట్ క్యారెక్టర్‌లో కనిపిస్తోందని స్పష్టంగా అర్థమవుతోంది. ఇప్పుడు విడుదలైన ఒక పోస్టర్ చూస్తే.. రష్మిక ఒక ఆయుధాన్ని చేతపట్టుకుని.. కోపంతో కనిపిస్తున్నట్లు చూడవచ్చు. ఈ సినిమా అనుష్క శెట్టి అరుంధతి, భాగమతి వంటి సినిమాల మాదిరిగా ఉంటుందని తెలుస్తోంది. ఈ సినిమా వచ్చే ఏడాది జనవరిలో రిలీజ్ అయ్యే అవకాశం ఉందని సమాచారం. దీనికి సంబంధించిన అధికారిక సమాచారం వెల్లడి కావాల్సి ఉంది.

యాక్షన్ సినిమాలంటే ఇష్టం!

మైస సినిమా కేవలం తెలుగు భాషలో మాత్రమే కాకుండా.. హిందీ, కన్నడ, తమిళం, మలయాళంలలో కూడా రిలీజ్ చేసే అవకాశం ఉంది. కాగా యాక్షన్ సినిమాలంటే తనకు ఇష్టమని రష్మిక మందన్న ఒక ఇంటర్వ్యూలో పేర్కొన్నారు. బహుశా ఈ కారణంగానే మైసా సినిమా చేయడానికి ఒప్పుకున్నట్లు తెలుస్తోంది.

గిరిజన భూముల నేపథ్యం?

నటి రష్మిక మందన్న మైస విషయానికి వస్తే.. ఇది గిరిజన భూముల నేపథ్యంలో నడిచే ఒక ఎమోషనల్ యాక్షన్ థ్రిల్లర్ అని తెలుస్తోంది. ఇది యాక్షన్ సినిమా అయినప్పటికీ.. ఎక్కువ భావోద్వేగాలు కూడా ఉండనున్నట్లు డైరెక్టర్ రవీంద్ర పేర్కొన్నారు. మొత్తానికి రష్మిక మందన్న.. ఇప్పటివరకు కనిపించిన కొత్త పాత్రలో కనిపిస్తుందని మాత్రం స్పష్టం చేశారు. పోస్టర్ కూడా అదే చెబుతోంది. లవ్, రొమాన్స్ వంటి కథనాలతో సినిమా ఇండస్ట్రీలో అడుగుపెట్టిన ఈమె.. హారర్ సినిమాల్లో (థామా) కూడా నటించింది. ఇప్పుడు యాక్షన్ సినిమాకు గ్రీన్ సిగ్నెల్ ఇచ్చేసింది.

రష్మిక మందన్న – ది గర్ల్‌ఫ్రెండ్

చలో సినిమాతో తెలుగు చలనచిత్ర సీమలో అడుగుపెట్టిన రష్మిక మందన్న.. ప్రస్తుతం అత్యధిక పారితోషికం (రెమ్యునరేషన్) తీసుకునే హీరోయిన్స్ జాబితాలో ఒకరుగా ఉన్నారు. థామా మంచి సక్సెస్ సాధించగా.. ఇప్పుడు ది గర్ల్‌ఫ్రెండ్ సినిమాతో తెరమీదకు రానుంది. ఈ సినిమా నవంబర్ 7న థియేటర్లలో రిలీజ్ కానుంది. ఇది కూడా మంచి సక్సెస్ సాదిస్తుందని పలువురు భావిస్తున్నారు.