థామా కోసం ‘రష్మిక మందన్న’ రెమ్యునరేషన్ ఎంతో తెలుసా?

ఛలో సినిమాతో తెలుగు సినిమా పరిశ్రమలో అడుగుపెట్టిన రష్మిక మందన్న.. అగ్రస్థాయి కథానాయకిల జాబితాలోకి అడుగుపెట్టడమే కాకుండా.. అత్యధిక పారితోషికం తీసుకునే హీరోయిన్లలో కూడా ఒకరుగా నిలిచారు. అయితే ఇప్పుడు ఈమె నటించిన తాజా సినిమా థామా సినిమాలో నటించారు. ఈ సినిమా దీపావళి సందర్భంగా థియేటర్లలో రిలీజ్ కానుంది. అయితే ఈ కథనంలో ఈ సినిమా కోసం వెచ్చించిన బడ్జెట్ ఎంత? అనే విషయాలను తెలుసుకుందాం.

థామా సినిమా బడ్జెట్

ఆయుష్మాన్ ఖురానా, రష్మిక మందన్న జంటగా నటించిన హారర్ కామెడీ చిత్ర థామా.. అక్టోబర్ 21న రిలీజ్ అవుతుంది. అయితే ఇప్పటివరకు రిలీజ్ అయిన హారర్ సినిమాల్లో థామా బడ్జెట్ కొంత ఎక్కువనే తెలుస్తుంది. దీనికోసం నిర్మాతలు రూ. 125 కోట్లు ఖర్చు చేసినట్లు.. ప్రమోషన్స్ వంటివాటికోసం మరో రూ. 20 కోట్లు ఖర్చు పెట్టినట్లు (మొత్తం రూ. 145 కోట్లు) బాలీవుడ్ హంగామా వెల్లడించింది. అయితే ఈ విషయాన్ని చిత్రబృందం అధికారికంగా వెల్లడించలేదు. ఈ సినిమా ‘వీఎఫ్ఎక్స్’తో కూడుకున్నది కావడంతో బడ్జెట్ ఎక్కువగానే అయి ఉంటుందని నిపుణులు కూడా చెబుతున్నారు.

స్త్రీ 2 కంటే ఎక్కువే!

థామా బడ్జెట్.. రాజ్ కుమార్ రావు, శ్రద్దా కపూర్, ఆయుష్మాన్ ఖురానా, పంకజ్ త్రిపాఠీ, అభిషేక్ బెనర్జీ నటించిన ‘స్త్రీ 2’ బడ్జెట్ కంటే కూడా ఎక్కువని తెలుస్తోంది. ఈ సినిమా (స్త్రీ 2) కోసం నిర్మాతలు రూ. 125 కోట్లు ఖర్చు పెట్టినట్లు సమాచారం. అయితే థామా సినిమా.. మంచి కలెక్షన్స్ రాబడుతుందని సంబంధిత వర్గాలు చెబుతున్నాయి. అయితే ఈ వివరాలు కచ్చితంగా తెలియాలంటే.. సినిమా విడుదలయ్యే వరకు వేచి చూడాల్సిందే.

రష్మిక మందన్న థామా గురించి

నటి రష్మిక మందన్న హారర్ సినిమాలో నటించడం బహుశా ఇదే మొదటిసారి. ఇప్పటికే రిలీజ్ అయిన ఈ సినిమాకు సంబంధించిన ట్రైలర్ ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకుంది. ఒకవైపు హారర్ సీన్లు.. మరోవైపు కామెడీ సీన్లు బాగున్నాయని ప్రేక్షకులు చెబుతున్నారు. దీన్నిబట్టి చూస్తుంటే.. ఈ సినిమా మంచి విజయం సాధిస్తుందని తెలుస్తోంది.

థామా సినిమాలో కేవలం రష్మిక మందన్న, ఆయుష్మాన్ ఖురానా మాత్రమే కాకుండా.. పరేష్ రావల్, సత్యరాజ్, ఫైజల్ మాలిక్, వరుణ్ ధావన్, నోరా ఫతేహి, మలైకా అరోరా, అమర్ కౌశిక్ కూడా నటిస్తున్నారు. ఆదిత్య సర్పోత్దార్ దర్శకత్వం వహించిన ఈ సినిమాకు.. దినేష్ విజన్, అమర్ కౌశిక్ నిర్మించారు. ఈ సినిమా షూటింగ్ చాలా వరకు ఢిల్లీ, ముంబై, ఊటీలలో జరిగినట్లు తెలుస్తోంది.షూటింగ్ 2024 మధ్యలో ప్రారంభమై.. 2025 మధ్య వరకు జరిగింది. ఆ తరువాత సినిమాను ప్రమోషన్ చేయడంలో చిత్ర బృందం బిజీ అయిపోయింది.

రెమ్యునరేషన్ వివరాలు

సుమారు రూ. 140 కోట్లు ఖర్చు పెట్టి తెరకెక్కిస్తున్న థామా సినిమాలో నటించిన నటీనటులకు కూడా చిత్ర బృందం భారీ పారితోషకాలను ఇచ్చినట్లు తెలుస్తోంది. ఆయుష్మాన్ ఖురానాకు రూ. 8 కోట్ల నుంచి రూ. 10 కోట్లు, రష్మిక మందన్నకు రూ. 5 కోట్ల నుంచి రూ. 7 కోట్లు, నవాజుద్దీన్ సిద్దిఖీకు రూ. 3 కోట్ల నుంచి రూ. 4 కోట్లు, పరేష్ రావల్ రూ. 2 కోట్ల నుంచి రూ. 3 కోట్లు తీసుకున్నట్లు, మలైకా అరోరా ఒక పాటకు డ్యాన్స్ వేసినందుకుగానూ రూ. 2 కోట్లు పారితోషికం తీసుకున్నట్లు సమాచారం. రెమ్యునరేషన్ అనేది కేవలం ఒక అంచనా మాత్రమే. ఈ విషయాలను చిత్ర నిర్మాణ సంస్థ అధికారికంగా వెల్లడించలేదు.