Daily Horoscope in Telugu 15th April 2025 Tuesday: మంగళవారం (15 ఏప్రిల్ 2025). శ్రీ విశ్వావసు నామ సంవత్సరం, ఉత్తరాయణం, వసంతఋతువు, చైత్ర మాసం, కృష్ణ పక్షం. రాహుకాలం మధ్యాహ్నం 3:00 నుంచి 4:30 వరకు. యమగండం ఉదయం 9:00 నుంచి 10:30 వరకు. దుర్ముహూర్తం ఉదయం 8:24 నుంచి 9:12 వరకు. నేటి రాశిఫలాల విషయానికి వస్తే..
మేషం
ముఖ్యమైన కార్యక్రమాలు ఓ కొలిక్కి వస్తాయి. వృత్తి, వ్యాపారాలు అనుకూలంగా ఉంటాయి. సంఘంలో గౌరవం పెరుగుతుంది. ఇంటాబయట అనుకూల వాతావరణం, నిరుద్యోగుల శ్రమకు తగిన ఫలితం లభిస్తుంది. నూతన కార్యక్రమాలు ప్రారభించడానికి మొగ్గు చూపుతారు. అనుకున్నవన్నీ సజావుగా జరుగుతాయి.
వృషభం
ఆర్ధిక పరిస్థితి ప్రతికూలంగా ఉంటుంది. అవసరానికి కావలసిన డబ్బు చేతికి అందదు. కీలక వ్యవహారాలు వాయిదా పడతాయి. దూరప్రయాణాలు వాయిదా వేసుకోవడం మంచిది. వ్యాపారంలో లాభాలు కూడా అంతంత మాత్రంగానే ఉంటాయి. దైవ చింతన పెరుగుతుంటుంది.
మిథునం
ముఖ్యంగా ఆర్ధిక సమస్యలు తొలగిపోతాయి. దీర్ఘకాలిక సమస్యలు కూడా ఓ కొలిక్కి వస్తాయి. మానసిక ప్రశాంతత కలుగుతుంది. కీలకమైన వ్యవహారాల్లో అవరోధాలు ఉన్నప్పటికీ.. పట్టు వదలకుండా ప్రయత్నిస్తే విజయవంతంగా పూర్తి చేయవచ్చు. ఉద్యోగులకు శుభయోగం.
కర్కాటకం
మీరు తీసుకునే నిర్ణయాలే భవిష్యత్తును నిర్ణయిస్తాయి. వివాదాలకు దూరంగా ఉండటం మంచిది. వృత్తి, ఉద్యోగాల్లో అధికారుల మన్నన పొందుతారు. నిరుద్యోగులు శుభవార్తలు వింటారు. వచ్చిన అవకాశాన్ని జారవిడవకుండా చూసుకోవాలి. సంఘంలో మీ విలువ పెరుగుతుంది.
సింహం
దైవ చింతన పెరుగుతుంది. వ్యాపారాల్లో లాభాలను పొందుతారు. కుటుంబంలో పెద్దల సహకారం అందుతుంది. ఆర్ధిక పరిస్థితి ఆశాజనకంగా ఉంటుంది. ముఖ్యమైన కార్యక్రమాలు అనుకున్న సమయానికి పూర్తవుతాయి. ఉద్యోగంలో అనుకూల వాతావరణం. కొన్ని విషయాల్లో తొందరపాటు నిర్ణయాలు పనికిరావు.
కన్య
మానసిక ప్రశాంతత లోపిస్తుంది. అయినవాళ్లే మిమ్మల్ని అవమానిస్తారు. దూరప్రయాణాలు చేయడం, విలువైన వస్తువుల కొనుగోలుకు ఇది సరైన సమయం కాదు. ఉద్యోగంలో ప్రతికూల ప్రభావాలు. వ్యాపారంలో లాభాలు అంతంత మాత్రంగానే ఉంటాయి. ఆర్ధిక విషయాల్లో కొంత జాగ్రత్తగా వ్యవహరించాల్సి ఉంటుంది.
తుల
ముఖ్యమైన పనులు సరైన సమయానికి పూర్తవుతాయి. జీవిత భాగస్వామి నుంచి సహాయ సహకారాలు అందుతాయి. శుభవార్తలు వింటారు. వ్యారల్లో లాభాలను ఆర్జిస్తారు. కుటుంబ సభ్యులతో సంతోషంగా కాలం గడుపుతారు. విలువైన వస్తువులను కొనుగోలు చేస్తారు.
వృశ్చికం
అవసరానికి కావలసిన డబ్బు చేతికి అందుతుంది. స్థిరాస్తి వివాదాల నుంచి బయటపడతారు. ముఖ్యమైన పనులలో విజయం సాధిస్తారు. నూతన కార్యక్రమాలు చేపడతారు. వృత్తి, వ్యాపారాల్లో అనుకూల వాతావరణం. ఉద్యోగుల శ్రమకు తగిన ఫలితం, పదోన్నతులు పొందే అవకాశం ఉంది.
ధనుస్సు
ఇంటాబయట ప్రతికూల వాతావరణం. మానసిక సమస్యలు ఎక్కువవుతాయి. స్థిరత్వం లేని ఆలోచనలు, వ్యాపారంలో నష్టాలను చవిచూస్తారు. విలువైన వస్తువుల కొనుగోలు విషయంలో జాగ్రత్త వహించాలి. వృధా ఖర్చులు ఎక్కువ చేయడం మంచిది కాదు. దైవ చింతన పెరుగుతుంది.
మకరం
ముఖ్యమైన కార్యక్రమాల్లో అవరోధాలు ఎదురైనప్పటికీ.. ధైర్య సాహసాలతో ముందుకు సాగితే ఉత్తమ ఫలితాలను పొందవచ్చు. ఆదాయ మార్గాలు పెరుగుతాయి. సంఘంలో మీ గౌరవం పెరుగుతుంది. ఇంటాబయట ప్రతికూల వాతావరణం. దైవ చింతన పెరుగుతుంది. తొందరపాటు నిర్ణయాలు ప్రమాదాన్ని తీసుకు వస్తాయి.
కుంభం
ఉద్యోగంలో అదనపు బాధ్యతలు పెరుగుతాయి. అధికారుల నుంచి కొంత ఒత్తిడి ఉంటుంది. అయితే మీ శ్రమకు తగిన ప్రతిఫలం ఉంటుంది. ఆర్ధిక ఇబ్బందులు తొలగిపోతాయి. ఆకస్మిక ధనప్రాప్తి ఉంటుంది. ఆర్ధిక సమస్యలు తొలగిపోతాయి. నిరుద్యోగులకు శుభయోగం, ఉద్యోగం కోసం చేసే ప్రయత్నాలు ఫలిస్తాయి.
మీనం
ప్రతికూల ప్రభావాలను ఎదుర్కోవాల్సి ఉంటుంది. దూరప్రయాణాలు చేసే అవకాశం ఉంది. కుటుంబ సభ్యులతో కొంత విభేదాలు. ఆరోగ్య సమస్యలు ఉన్నాయి. వ్యాపారంలో ఆశించిన లాభాలు ఉండవు. ఖర్చులు పెరుగుతాయి. ఆర్ధిక విషయాల్లో మరింత ఆలోచించాల్సి ఉంటుంది. దైవ చింతన పెరుగుతుంది.
గమనించండి: రాశిఫలాలు కేవలం పాఠకుల అవగాహన కోసం మాత్రమే. పాఠకులు దీనిని తప్పకుండా దృష్టిలో ఉంచుకోవాలి. రాశిఫలాలు ఎలాంటి శాస్త్రీయమైన ఆధారాలు లేదు. అంతే కాకుండా గ్రహాల స్థితిగతుల ఆధారంగా కూడా రాశిఫలాలు మారుతూ ఉండే అవకాశం ఉంది.