Daily Horoscope in Telugu 2025 March 16th Sunday: ఆదివారం (2025 మార్చి 16), శ్రీ క్రోధి నామ సంవత్సరం, ఉత్తరాయణం, శిశిర ఋతువు, ఫాల్గుణ మాసం, కృష్ణ పక్షం. రాహుకాలం సాయంత్రం 4:30 నుంచి 6:00 గంటల వరకు. యమగండం మధ్యాహ్నం 12:00 నుంచి 1:30 వరకు, దుర్ముహూర్తం సాయంత్రం 4:25 నుంచి 5:13 వరకు.
మేషం
మీ ప్రతిభ వెలుగులోకి వస్తుంది. చిన్ననాటి మిత్రులను కలుసుకుంటారు. వ్యాపారాల్లో లాభాలు, నూతనావకాశాలు లభిస్తాయి. సంఘంలో గౌరవ మర్యాదలు పెరుగుతాయి. దీర్ఘకాలిక ఋణాల నుంచి విముక్తి లభిస్తుంది. ఉద్యోగులకు.. ఉన్నతాధికారుల నుంచి ప్రశంసలు లభిస్తాయి. ఆర్ధిక పరిస్థితి బాగుంటుంది.
వృషభం
సన్నితులతో తగాదాలు, వృత్తి ఉద్యోగాలలో కొంత ఒత్తిడి వాతావరణం. ముఖ్యమైన పనులు కొంత నెమ్మదిస్తాయి. అలోచించి తీసుకున్న నిర్ణయాలే శుభం కలిగిస్తాయి. తొందరపాటు వద్దు. ఆరోగ్యం పట్ల జాగ్రత్త వహించాలి. ఆర్ధిక పరిస్థితి కొంత ప్రతికూలంగా ఉంటుంది. దైవ దర్శనాలు చేస్తారు.
మిథునం
ఇంటా బయట సమస్యలు, ఆర్ధిక పరిస్థితి మందగిస్తుంది. అవసరానికి డబ్బు అందదు. ముఖ్యమైన కార్యక్రమాలు ముందుకు సాగవు. సన్నితులతో కలహాలు ఏర్పడతాయి. శ్రమకు తగిన ఫలితం ఉండదు. దూర ప్రయాణాలు చేస్తారు. దైవ ప్రార్థన శుభం కలిగిస్తుంది.
కర్కాటకం
శుభయోగం నడుస్తోంది. ముఖ్యమైన పనులు సకాలంలో పూర్తవుతాయి. చిన్నపాటి ఆరోగ్య సమస్యలు బాధిస్తాయి. ఉద్యోగులు అధికారుల అగ్రహాలకు గురవుతారు. కుటుంబంలో చిన్నపాటి సమస్యలు. వృధా ఖర్చులు ఉన్నాయి. అవసరానికి కావలసిన ధనం అందదు. వ్యాపారాలు కూడా మందగిస్తాయి.
సింహం
విలువైన వస్తువులు కొంటారు. సమాజంలో కీర్తి ప్రతిష్టలు పెరుగుతాయి. ఆర్ధిక పరిస్థితి మెరుగ్గా ఉంటుంది. బంధు మిత్రులతో సమయం గడుపుతారు. పుణ్యక్షేత్రలు దర్శిస్తారు. నూతన వాహన యోగం ఉంది. తొందరపాటు నిర్ణయాలు వద్దు, అలోచించి తీసుకున్న నిర్ణయాలు మంచి ఫలితాలను ఇస్తాయి.
కన్య
నిరుద్యోగ ప్రయత్నాలు సఫలీకృతమవుతాయి. వ్యాపారాల్లో లాభాలు ఉన్నాయి. బంధు మిత్రుల సహకారం ఉంటుంది. ఆరోగ్యంపై శ్రద్ద వహించాలి. వృత్తి, ఉద్యోగాలలో ప్రసంశలు లభిస్తాయి. ఆకస్మిక ధన లాభం ఉంది. అనవసర ఖర్చుల విషయంలో కొంత జాగ్రత్త అవసరం.
తుల
చేపట్టిన పనులు సజావుగా ముందుకు సాగుతాయి. కొందరి ప్రవర్తన మిమ్మల్ని బాధిస్తుంది. కుటుంబ వ్యవహారాలకు సంబంధించిన విషయాల్లో స్థిరత్వం ఉండదు. విలువైన వస్తువుల కొనుగోలుకు సంబంధించిన విషయంలో జాగ్రత్త అవసరం. తొందరపాటు నిర్ణయాలు కలిసిరావు. జాగ్రత్త అవసరం.
వృశ్చికం
వృధా ఖర్చులు ఉన్నాయి. బంధు మిత్రులతో మాట పట్టింపులు. చేపట్టిన పనులు మందకొడిగా సాగుతాయి. వృత్తి వ్యాపారంలో కూడా కొన్ని సమస్యలు ఎదురవుతాయి. ఆరోగ్య విషయంలో జాగ్రత్త అవసరం. ముఖ్యమైన కార్యక్రమాలు కూడా అనుకున్న విధంగా సాగవు. నూతన వాహన కొనుగోలు ప్రయత్నాలు కూడా మందగిస్తాయి.
ధనుస్సు
ఇంటా బయట అనుకూల వాతావరణం, ముఖ్యమైన పనులలో మనో ధైర్యం అవసరం. నూతన వస్త్ర, ఆభరణ కొనుగోలు. అవసరానికి కావలసిన ధనం అందుతుంది. అలోచించి తీసుకున్న నిర్ణయాలు లాభసాటిగా ఉంటాయి. నిరుద్యోగులకు శుభయోగం, ఉద్యోగావకాశాలు లభిస్తాయి.
మకరం
ఆర్ధిక పరిస్థితి ప్రతికూలంగా ఉంటుంది. బంధు మిత్రులతో మాటపట్టింపులు ఉన్నాయి. విలువైన వస్తువులు కొనుగోలు చేస్తారు. ఇతరుల నుంచి ఊహించని విమర్శలు ఎదుర్కుంటారు. అలోచించి తీసుకున్న నిర్ణయాలు లాభదాయకంగా ఉంటాయి. పుణ్యక్షేత్రాలను దర్శించుకుంటారు.
కుంభం
సంఘంలో గౌరవ మర్యాదలు పెరుగుతాయి. సన్నిహితుల నుంచి విలువైన బహుమతులు స్వీకరిస్తారు. నిరుద్యోగులకు.. ఉద్యోగ ప్రాప్తి ఉంది. సంతానం విద్యా విషయాలు సంతృప్తినిస్తాయి. విందు వినోదాల్లో పాల్గొంటారు. సంతోషంగా గడుపుతారు. అవసరానికి తగిన ధనం అందుతుంది.
మీనం
ఇంటా బయట అనుకూల వాతావరణం, కొన్ని కీలక వ్యవహారాల్లో జాగ్రత్త అవసరం. ఉద్యోగులకు స్దాన చలనం ఉంది. వివాదాలకు దూరంగా ఉండటం మంచిది. ప్రయాణాలలో అవరోధాలు ఏర్పడతాయి. ఆర్ధిక వ్యవహారాలు మందకొడిగా సాగుతాయి. తొందరపాటు నిర్ణయాలు నష్టాలను తెస్తాయి.
గమనించండి: పైన పేర్కొన్న రాశిఫలాల ఫలితాలు కేవలం సూచనప్రాయం మాత్రమే. గ్రహాల స్థితిగతుల ఆధారంగా నిర్ణయించడం జరిగింది. గ్రహాల స్దాన చలనం వల్ల ఫలితాలలో మార్పులు ఏర్పడవచ్చు. అప్పుడు అనుకూల ఫలితాలు, ప్రతికూలం అవ్వొచ్చు. ప్రతికూల ఫలితాలు అనుకూలంగా మారొచ్చు. ఏది ఎలా ఉన్నా.. దైవ దర్శనం శుభాలను కలుగజేస్తుంది.