Daily Horoscope in Telugu 2025 March 27 Thursday: గురువారం (27 మార్చి 2025). శ్రీ క్రోధి నామ సంవత్సరం, ఉత్తరాయణం, శిశిర ఋతువు, ఫాల్గుణ మాసం, కృష్ణ పక్షం. రాహుకాలం మధ్యాహ్నం 1:30 నుంచి 3:00 వరకు. యమగండం ఉదయం 6:00 నుంచి 7:30 వరకు. దుర్ముహూర్తం ఉదయం 10:00 నుంచి 10:48 వరకు. అమృత గడియలు ఉదయం 4:37 నుంచి 5:24 వరకు. ఈ రోజు రాశిఫలాలు ఎలా ఉన్నాయో వివరంగా కింద చూసేద్దాం..
మేషం
శ్రమకు తగిన ఫలితం లభించదు. ఉద్యోగంలో ఒత్తిడి, విలువైన వస్తువుల విషయంలో జాగ్రత్త వహించడం అవసరం. దూర ప్రయాణాలు కూడా కలిసిరావు. ఆర్ధిక పరిస్థితి అంతంత మాత్రంగానే ఉంటుంది. ఇంటాబయట గందరగోళమైన వాతావరణం. దైవ దర్శనం కొంత మనశ్శాంతిని ఇస్తుంది.
వృషభం
కీలకమైన వ్యవహారాలు కొలిక్కి వస్తాయి. ముఖ్యమైన పనులలో విజయం లభిస్తుంది. పెద్దల సలహాలు మరింత కలిసివస్తాయి. సంఘంలో గౌరవం పెరుగుతుంది. విలువైన వస్తువులను కొనుగోలు చేస్తారు. ఆర్ధిక సమస్యలు తొలగిపోతాయి. వ్యాపారం మరియు ఉద్యోగంలో నూతన అవకాశాలు లభిస్తాయి.
మిథునం
ఆర్ధిక సమస్యల వల్ల.. కొన్ని ముఖ్యమైన పనులు వాయిదా పడతాయి. ఆకస్మిక ప్రయాణ సూచనలు ఉన్నాయి. ఉద్యోగులకు అదనపు పనిభారం. వ్యాపారాలు నెమ్మదిస్తాయి. వృధా ఖర్చులు అధికంగా ఉంటాయి. దైవ చింతన పెరుగుతుంది.
కర్కాటకం
కార్యసిద్ది కలుగుతుంది. మీ ప్రతిభ వెలుగులోకి వస్తుంది. వ్యాపార మరియు ఉద్యోగాలలో సమస్యలు పరిష్కారమవుతాయి. విందు వినోదాలలలో పాల్గొంటారు. చిన్ననాటి మిత్రులతో కాలం గడుపుతారు. కుటుంబంలో ఆనందంగా సమయం గడుపుతారు. అవసరానికి కావలసిన ధనం లభిస్తుంది.
సింహం
సన్నిహితులతో మాటపట్టింపులు ఉన్నాయి. ముఖ్యమైన వ్యవహారాల్లో ఆటంకాలు ఎదురవుతాయి. నూతన వ్యాపార ప్రయత్నాలు చేస్తారు. శ్రమ అధికమవుతుంది. ఆర్ధిక పరిస్థితి మునుపటి కంటే కొంత మందగిస్తుంది. తొందరపాటు నిర్ణయాలు తీసుకోవద్దు.
కన్య
వ్యాపారాల్లో సొంత నిర్ణయాలే లాభాలను కలిగిస్తాయి. కొత్త వ్యక్తుల పరిచయం నూతనోత్సాహాన్ని కలిగిస్తుంది. చేపట్టిన పనులు సకాలంలో పూర్తవుతాయి. ఉద్యోగులకు అనుకూలమైన కాలం. నిరుద్యోగుల ఉద్యోగ ప్రయత్నాలు ఫలిస్తాయి. దైవ చింతన పెరుగుతుంది.
తుల
శుభవార్తలు వింటారు. చిన్ననాటి స్నేహితులను కలుసుకుంటారు. నిరుద్యోగులకు నూత ఉద్యోగావకాశాలు లభిస్తాయి. విందువినోదాల్లో పాల్గొంటారు. ఆర్ధిక పరిస్థితి మెరుగ్గా ఉంటుంది. ఆకస్మిక ధనలాభం ఉంది. తొందపడి నిర్ణయాలు తీసుకోవద్దు. ముఖ్యమైన వ్యవహారాల కోసం పెద్దల సలహాలు తీసుకోవడం మంచిది.
వృశ్చికం
ఆరోగ్యం పట్ల జాగ్రత్త అవసరం, దైవ చింతన పెరుగుతుంది. ముఖ్యమైన వ్యవహారాల్లో అవాంతరాలు ఎదురవుతాయి. సన్నిహితులతో అకారణ వివాదాలు తలెత్తుతాయి. ఉద్యోగంలో చికాకులు కలుగుతాయి. నూతన కార్యక్రమాలు చేపడతారు. దూర ప్రయాణాలు వాయిదా వేసుకోవడం మంచిది.
ధనుస్సు
దూరప్రయాణాలు చేస్తారు. మిత్రులతో మాటపట్టింపులు ఉన్నాయి. ఉద్యోగంలో పని ఒత్తిడి పెరుగుతుంది. ఆరోగ్యం విషయంలో కొంత జాగ్రత్త అవసరం. పనులు నెమ్మదిగా పూర్తవుతాయి. సన్నిహితులతో విభేదాలు తలెత్తుతాయి. ఆలయాలు దర్శించుకుంటారు.
మకరం
కొన్ని ఆశ్చర్యకరమైన వార్తలు వినిపిస్తాయి. సంతోషంగా ఉంటారు. మీ ప్రతిభ వెలుగులోకి వస్తుంది. సంతాన విషయంలో కొన్ని ముఖ్యమైన నిర్ణయాలు తీసుకోవాలి. వ్యాపార విస్తరణకు సంబంధించిన ప్రయత్నాలు ఫలిస్తాయి. ఉద్యోగులకు పని ఒత్తిడి ఎక్కువవుతుంది.
కుంభం
సంఘంలో గౌరవం పెరుగుతుంది. సన్నితుల నుంచి ఆహ్వానాలు లభిస్తాయి. ముఖ్యమైన వివాదాలు పరిష్కారమవుతాయి. వ్యాపారాలు, ఉద్యోగులకు అనుకూలమైన కాలం నడుస్తోంది. పెద్దల సహకారంతో కొన్ని పనులు పూర్తవుతాయి. ఆర్ధిక పరిస్థితి మునుపటి కంటే మెరుగ్గా ఉంటుంది.
మీనం
వివాదాలకు దూరంగా ఉండాలి. ఆకస్మిక ప్రయాణ సూచనలు ఉన్నాయి. ఆర్ధిక పరిస్థితి మందగిస్తుంది. ఆరోగ్యం విషయంలో జాగ్రత్త అవసరం. ఉద్యోగాలలో ఊహించని సమస్యలు ఎదురవుతాయి. తొందరపడి నిర్ణయాలు తీసుకోకూడదు. విద్యార్థులకు శుభయోగం నడుస్తోంది. దైవ చింతన పెరుగుతుంది.
గమనించండి: రాశిఫలాలు కేవలం పాఠకుల అవగాహనా కోసం మాత్రమే. కాబట్టి ఇక్కడ చెప్పిందే జరుగుతుందని నిర్దారించలేము. అంతే కాకుండా రాశిఫలాలకు శాస్త్రీయమైన లేదా సాంకేతికమైన ఆధారాలు లేదు. అయితే రాశిఫలాల ఫలితాలు గ్రహాల స్థితిగతులను బట్టి మారవచ్చు.