Daily Horoscope in Telugu 8th April 2025 Tuesday: మంగళవారం (08 ఏప్రిల్ 2025). శ్రీ విశ్వావసు నామ సంవత్సరం, ఉత్తరాయణం, వసంత ఋతువు, చైత్ర మాసం, శుక్లపక్షం. రాహుకాలం మధ్యాహ్నం 3:00 నుంచి 4:30 వరకు. యమగండం ఉదయం 9:00 నుంచి 10:30 వరకు. దుర్ముహూర్తం ఉదయం 8:24 నుంచి 9:12 వరకు. బ్రహ్మ ముహూర్తం తెల్లవారు జాము 4:30 నుంచి 5:17 వరకు. రాశిఫలాలు విషయానికి వస్తే..
మేషం
ఆరోగ్య సమస్యలున్నాయి. అవసరానికి మించిన ఖర్చులు. సమయానికి చేతికి అందాల్సిన డబ్బు అందదు. సన్నిహితులతో కలహాలు. దూరప్రయాణములు చేస్తారు. ఉద్యోగంలో గందరగోళ వాతావరణం. సహనం చాలా అవసరం. దైవానుగ్రహంతో కొన్ని ముఖ్యమైన పనులు పూర్తవుతాయి. ప్రయత్నం విరమించవద్దు.
వృషభం
ఆర్ధిక పరిస్థితి మందగిస్తుంది. రుణదాతల నుంచి ఒత్తిడి పెరుగుతుంది. ముఖ్యమైన పనులు వాయిదా పడతాయి. ఉద్యోగులకు అదనపు బాధ్యతలు, అధికారుల నుంచి ఒత్తిడి పెరుగుతుంది. వ్యాపారాలు మందకొడిగా సాగుతాయి, ఆసించిన లాభాలు ఉండవు. కీలకమైన వ్యవహారాలలో ఆచితూచి అడుగులు వేయాలి.
మిథునం
సంఘంలో గౌరవం పెరుగుతుంది. కుటుంబంలో సంతోషకరమైన వాతావరణం. ప్రముఖుల నుంచి ఆహ్వానాలు లభిస్తాయి. ఉద్యోగ, వ్యాపారాలు ఆశాజనకంగానే ఉంటాయి. ఆర్ధిక పరిస్థితి అనుకూలంగా ఉంటుంది. కీలకమైన వ్యవహారాలు సజావుగా ముందుకు సాగుతాయి. పుణ్యక్షేత్రాలను దర్శించుకుంటారు.
కర్కాటకం
సన్నిహితులతో ఆనందంగా కాలం గడుపుతారు. విలువైన వస్తువులను కొనుగోలు చేస్తారు. ఉద్యోగులకు అధికారుల నుంచి ప్రసంశలు అందుతాయి. చేపట్టిన పనులలో కార్యసిద్ధి. మీపై విశ్వసాన్ని ఎప్పుడూ కోల్పోవద్దు. అవసరానికి కావలసిన ధనం చేతికి అందుతుంది.
సింహం
ఆరోగ్య సమస్యల వల్ల చికాకులు. ముఖ్యమైన పనులకు ఆటంకాలు ఎదురవుతాయి. శ్రమకు తగిన ఫలితం లభించదు. నిరుద్యోగులకు నిరాశ తప్పదు. సన్నిహితులతో వివాదాలు తలెత్తుతాయి. వ్యాపారాలు ఆశించిన స్థాయిలో ముందుకు సాగవు. ఉద్యోగానికి సంబంధించిన విషయంలో తొందరపాటు నిర్ణయాలు పనికిరావు.
కన్య
ఇంటాబయట అధికమైన శ్రమ. కుటుంబ సభ్యుల ప్రవర్తన కొంత గందరగోళంగా ఉంటుంది. ముఖ్యమైన పనులు వాయిదా పడతాయి. ఖర్చులు పెరుగుతాయి. పుణ్యక్షేత్రాలను దర్శించుకుంటారు. ఉద్యోగంలో పని ఒత్తిడి. అధికారులతో కొంత జాగ్రత్తగా ఉండాలి.
తుల
దూరపు బంధువుల నుంచి ఆహ్వానాలు లభిస్తాయి. సన్నిహితులతో ఆనందంగా కాలం గడుపుతారు. నూతన వాహన యోగం, దీర్ఘకాల సమస్యలు సమసిపోతాయి. విద్యార్థులకు శుభయోగం. పోటీ పరీక్షల్లో విజయం సాధిస్తారు. ఆర్ధిక పరిస్థితి మునుపటికంటే మెరుగ్గా ఉంటుంది.
వృశ్చికం
అనారోగ్య సమస్యలు మిమ్మల్ని బాధిస్తాయి. ఆర్ధిక సమస్యలు ఎదురవుతాయి. ఉద్యోగంలో అదనపు బాధ్యతలు నిర్వహిస్తారు. అధికారుల నుంచి ప్రశంసలు లభిస్తాయి. దైవ చింతన పెరుగుతుంది. కుటుంబలో చికాకులు ఉన్నాయి. మౌనం వహించడం ఉత్తమం. అనవసరమైన విషయాల్లో జోక్యం చేసుకోకపోవడం మంచిది.
ధనుస్సు
విందు వినోదాల్లో పాల్గొంటారు. పెద్దల ఆదరణ లభిస్తుంది. నిరుద్యోగులు శుభవార్తలు వింటారు. శ్రమకు తగిన ఫలితం లభిస్తుంది. నూతన వ్యాపార విస్తరణకు సంబంధించిన ప్రయత్నాలు విజయవంతం అవుతాయి. వృత్తి, వ్యాపారాలు లాభసాటిగా ఉంటాయి.
మకరం
ఆధ్యాత్మిక చింతన పెరుగుతుంది. మానసిక సమస్యలు పెరుగుతాయి. దూరప్రయాణాలు వాయిదా పడతాయి. కొన్ని వార్తలు మీ మనసును బాధిస్తాయి. వ్యాపారాలు మందకొడిగా సాగుతాయి. ఉద్యోగంలో కూడా చికాకులు, ఉన్నతాధికారులతో జాగ్రత్తగా వ్యవహరించాలి.
కుంభం
విలువైన వస్తువులు కొనుగోలు చేస్తారు. చిన్ననాటి స్నేహితులను కలుసుకుంటారు. బంధువుల నుంచి శుభవార్తలు వింటారు. ఆర్ధిక పరిస్థితి కొంత మెరుగుపడుతుంది. ఉద్యోగంలో అనుకూల వాతావరణం, అధికారుల నుంచి ప్రశంసలు లభిస్తాయి. వ్యాపారాలు సజావుగా ముందుకు సాగుతాయి.
మీనం
శ్రమకు తగిన ఫలితం లభిస్తుంది. ముఖ్యమైన పనులు విజయవంతంగా పూర్తవుతాయి. చిన్ననాటి స్నేహితులను కలుసుకుంటారు. వ్యాపారాలు లాభసాటిగా ఉంటాయి. ఆదాయం పెరుగుతుంది. వ్యాపారంలో నూతనోత్సాహం. కార్య సిద్ది ఉంది. దైవ చింతన పెరుగుతుంది.
గమనించండి: రాశిఫలాలు అవగాహన కోసం మాత్రమే. ఇక్కడ చెప్పినవన్నీ జరుగుతాయని లేదా జరగవని పూర్తగా విశ్వసించకూడదు. గ్రహాల స్థితిగతులను బట్టి ఫలితాలు మారే అవకాశం ఉంటుంది. కాబట్టి ఈ విషయాన్ని పాఠకులు తప్పకుండా దృష్టిలో ఉంచుకోవాలి.