మార్కెట్లో ఎంతోమందికి ఇష్టమైన, తక్కువ ధరలో లభించే.. రెనాల్డ్ క్విడ్ ఎలక్ట్రిక్ రూపంలో కనిపించింది. కంపెనీ ఈ కారును బ్రెజిల్‌లో ఆవిష్కరించింది. దఈ ఎలక్ట్రిక్ వెర్షన్ క్విడ్ ఈ-టెక్ పేరుతో అమ్మకానికి రానున్నట్లు సమాచారం. ఈ లేటెస్ట్ ఎలక్ట్రిక్ కారుకు సంబంధించిన వివరాలతో పాటు.. ఇది ఇండియన్ మార్కెట్లో ఎప్పుడు లాంచ్ అవుతుందనే విషయాలు కూడా తెలుసుకుందాం.
డాసియా స్ప్రింగ్ ఈవీ మాదిరిగా నిర్మించబడిన ఈ మోడల్.. చూడటానికి సాధారణ క్విడ్ కంటే కూడా భిన్నంగా ఉంటుంది. కాగా ఈ ఎలక్ట్రిక్ కారుకు సంబంధించిన టెస్ట్ మ్యూల్స్ భారతదేశంలో చాలాసార్లు టెస్టింగ్ సమయంలో కనిపించింది. కాబట్టి ఇది త్వరలోనే.. ఇండియన్ మార్కెట్లో లాంచ్ అయ్యే అవకాశం ఉందని సమాచారం. అయితే దీనికి సంబంధించిన అధికారిక ప్రకటన వెలువడలేదు.
ఇండియన్ మార్కెట్లో.. రెనాల్ట్ క్విడ్ ఈవీ లాంచ్ అయిన తరువాత, ఇప్పటికే అమ్ముడవుతున్న సిట్రోయెన్ ఈ-సీ3, టాటా టియాగో ఈవీ వంటి వాటికి ప్రధాన ప్రత్యర్థిగా ఉండే అవకాశం ఉంది. కాగా ఈ ఎలక్ట్రిక్ కారు ఎప్పుడు లాంచ్ అవుతుందనే.. విషయాలు తెలియాల్సి ఉంది.
సరికొత్త డిజైన్
కొత్త రానాల్ట్ క్విడ్ ఈవీ.. డాసియా సంతతి నుంచి ప్రేరణ పొందినట్లు తెలుస్తోంది. ఈ కారు ముందు భాగంలో క్లోజ్డ్ ఆప్ గ్రిల్ పొందుతుంది. వర్టికల్ స్లాట్ చంకీ లుక్ ఇస్తాయి. ప్రొజెక్టర్ హెడ్‌లైట్స్ ముందుభాగంలో.. బంపర్‌కు ఇరువైపులా అమర్చబడి ఉన్నాయి. బ్లాక్ వీల్ ఆర్చ్ క్లాడింగ్, ఓఆర్వీఎమ్ మౌంటెడ్ ఇండికేటర్ లైట్స్, బ్లాక్ సైడ్ క్లాడింగ్, 14 ఇంచెస్ డ్యూయెల్ టోన్ అల్లాయ్ వీల్స్ వంటివన్నీ ఇందులో కనిపిస్తాయి. వెనుక భాగంలో హాలోజన్ బేస్డ్ రివర్స్ లైట్‌లతో వై షేప్ ఎల్ఈడీ డీఆర్ఎల్ ఉంటుంది. మొత్తం మీద ఇది ఫ్యూయెల్ క్విడ్ కంటే కూడా భిన్నంగా ఉన్నట్లు స్పష్టమవుతోంది.
ఇంటీరియర్ డిజైన్ & ఫీచర్స్
రెనాల్ట్ క్విడ్ ఈవీ.. మంచి క్యాబిన్ కలిగి, సరికొత్త టెక్నాలజీలతో నిండి ఉంది. ఇందులో 10.1 ఇంచెస్ టచ్‌స్క్రీన్ ఇన్ఫోటైన్‌మెంట్ సిస్టం, వైర్‌లెస్ ఆండ్రాయిడ్ ఆటో, ఆపిల్ కార్‌ప్లే ఉంటుంది. అంతే కాకుండా 7 ఇంచెస్ డిజిటల్ ఇన్‌స్ట్రుమెంట్ క్లస్టర్, రెండు యూఎస్బీ పోర్టులు ఉన్నాయి. హైట్ అడ్జస్టబుల్ స్టీరింగ్ వీల్ కూడా ఇందులో లభిస్తుంది.
సేఫ్టీ విషయానికి వస్తే.. కొత్త క్విడ్ ఎలక్ట్రిక్ కారు 6 ఎయిర్‌బ్యాగులు, ఏబీఎస్, ఎలక్ట్రానిక్ స్టెబిలిటీ ప్రోగ్రామ్, రియర్ కెమెరా, టైర్ ప్రెజర్ మానిటరింగ్ సిస్టం, సీట్‌బెల్ట్ రిమైండర్, ఐసోఫిక్స్ చైల్డ్ సీట్స్ మొదలైనవి ఉన్నాయి. ఇవన్నీ వాహన వినియోగదారులకు రక్షణ కల్పించడంలో సహాయపడతాయి.
బ్యాటరీ అండ్ రేంజ్ వివరాలు
ఎలక్ట్రిక్ కారు అనగానే.. బ్యాటరీ గురించి తెలుసుకోవాలి. కాబట్టి రెనాల్ట్ క్విడ్ ఎలక్ట్రిక్ కారు 26.8 కిలోవాట్ లిథియం అయాన్ బ్యాటరీ ప్యాక్ పొందుతుంది. ఇది ఒకసారి ఫుల్ ఛార్జ్ అయితే.. 250 కిమీ వరకు ప్రయాణించగలదని సమాచారం. అయితే కచ్చితమైన రేంజ్ గణాంకాలు.. లాంచ్ తరువాత, టెస్ట్ చేస్తేనే తెలుస్తుంది. కాగా ఇందులోని ఎలక్ట్రిక్ మోటారు 65 హార్స్ పవర్ ప్రొడ్యూస్ చేస్తుందని సమాచారం. కాగా.. కంపెనీ ఈ కారు ధరలను అధికారికంగా వెల్లడించలేదు. ధరలు లాంచ్ సమయంలో కంపెనీ వెల్లడిస్తుంది.