Revolt RV1 Launched in India: ఇండియన్ మార్కెట్లో ఎలక్ట్రిక్ వాహన శకం నడుస్తోంది. ఎక్కువమంది వాహన ప్రేమికులు ఎలక్ట్రిక్ వెహికల్స్ కొనుగోలు చేయడానికి ఆసక్తి చూపుతుండటంతో వాహన తయారీ సంస్థలు కూడా ఈ బాటలోనే పరుగులు పెడుతున్నాయి. ఈ తరుణంలో ప్రముఖ ఎలక్ట్రిక్ టూ బైక్ తయారీ సంస్థ ‘రివోల్ట్ మోటార్స్’ (Revolt Motors) కంపెనీ తన మూడవ ఎలక్ట్రిక్ మోటార్‌సైకిల్ ‘ఆర్‌వీ1’ (RV1) లాంచ్ చేసింది. ఈ బైక్ ధర ఎంత, కలర్ ఆప్షన్స్, డిజైన్, బ్యాటరీ మరియు రేంజ్ వంటి వివరాలు ఈ కథనంలో తెలుసుకుందాం.
ధర (Price)
ఎలక్ట్రిక్ మోటార్‌సైకిల్ విభాగంలో తన పోర్ట్‌ఫోలియోను మరింత విస్తరించుకునే క్రమంలో రివోల్ట్ మోటార్ కంపెనీ ఆర్‌వీ1 బైకును రెండు వేరియంట్లలో లాంచ్ చేసింది. బేస్ వేరియంట్ ఆర్‌వీ1 ధర రూ.84990 కాగా.. ఆర్‌వీ1 ప్లస్ ధర రూ. 99990 (ధరలు ఎక్స్ షోరూమ్). ఇప్పటికే ఆర్‌వీ400 మరియు ఆర్‌వీ400 బీఆర్జెడ్ బైకులను కలిగి ఉన్న కంపెనీ ముచ్చటగా మూడో బైకును ఆర్‌వీ1 పేరుతో లాంచ్ చేసింది.
కలర్ ఆప్షన్స్ అండ్ బుకింగ్స్ (Colour Options and Bookings)
కంపెనీ లాంచ్ చేసిన కొత్త రివోల్ట్ ఆర్‌వీ1 మొత్తం నాలుగు కలర్ ఆప్షన్లలో లభిస్తుంది. కంపెనీ ఈ బైక్ కోసం బుకింగ్స్ స్వీకరించడం ప్రారంభించింది. కాబట్టి ఆసక్తి కలిగిన కష్టమర్లు కేవలం రూ. 499 మాత్రమే చెల్లించి బుక్ చేసుకోవచ్చు. డెలివరీలు త్వరలోనే ప్రారంభమవుతాయి.
డిజైన్ (Design)
చూడటానికి ఒక సింపుల్ స్ట్రీట్ బైక్ మాదిరిగా ఉండే రివోల్ట్స్ ఆర్‌వీ1 బైక్ వాహనం వినియోగదారులకు చాలా మంది రైడింగ్ అనుభూతిని అందించేలా డిజైన్ చేశారు3. ఈ బైక్ స్మోక్డ్ విండ్‌స్క్రీన్ కలిగి రౌండ్ ఎల్ఈడీ హెడ్‌ల్యాంప్ పొందుతుంది. ఫ్యూయెల్ ట్యాంక్ మీద బ్రాండ్ లోగోస్, గ్రాబ్ రైల్, సింగిల్ పీస్ సీటు వంటివి ఇందులో ఉన్నాయి.
ఫీచర్స్ (Features)
కొత్త రివోల్ట్ ఆర్‌వీ1 బైక్ సింపుల్ డిజైన్ కలిగి ఉన్నప్పటికీ.. లేటెస్ట్ ఫీచర్స్ పొందుతుంది. ఇంధ్యులో 6 ఇంచెస్ డిజిటల్ ఎల్‌సీడీ డిస్‌ప్లే ఉంటుంది. ఇందులో ఛార్జింగ్ స్టేటస్, స్పీడ్ వంటివన్నీ కూడా చూడవచ్చు. ఈ బైక్ యొక్క పేలోడ్ కెపాసిటీ 250 కేజీల వరకు ఉంది. ఛార్జింగ్ ఆప్షన్ కూడా చాలా అనుకూలంగా ఉంటుంది.
బ్యాటరీ అండ్ రేంజ్ (Battery and Range)
కొత్త రివోల్ట్ ఆర్‌వీ1 బైక్ యొక్క బేస్ వేరియంట్ లేదా ఆర్‌వీ1.. 2.2 కిలోవాట్ బ్యాటరీ ప్యాక్ పొందుతుంది. ఇది ఒక ఫుల్ చార్జితో 100 కిమీ రేంజ్ అందిస్తుంది. ఇక ఆర్‌వీ1 ప్లస్ వేరియంట్ 3.24 కిలోవాట్ బ్యాటరీ పొందుతుంది. ఇది సింగిల్ చార్జితో 160 కిమీ రేంజ్ అందిస్తుంది. ఈ రెండు బ్యాటరీలు 2.8 కేడబ్ల్యు ఎలక్ట్రిక్ మోటార్ ద్వారా శక్తిని పొందుతాయి. పవర్ అనేది బెల్ట్ డ్రైవ్ మాదిరిగా కాకుండా.. చైన్ డ్రైవ్ ద్వారా పంపిస్తుంది.
రివోల్ట్ ఆర్‌వీ1 ప్లస్ బైక్ ఫాస్ట్ ఛార్జింగ్‌కు కూడా సపోర్ట్ చేస్తుంది. ఇది కేవలం 1.5 గంటల్లో ఫుల్ ఛార్జ్ అవుతుంది. ఈ బైక్ రివర్స్ మోడ్ కూడా పొందుతుంది. ఇందులో టెలిస్కోపిక్ ఫోర్క్, ట్విన్ షాక్ అబ్జార్బర్ సెటప్ ఉంటుంది. రెండు చివర్లలో డిస్క్ బ్రేక్స్ ఉంటాయి.
కంపెనీ ఈ బైకును లాంచ్ చేసిన సందర్భంగా.. రట్టన్ఇండియా ఎంటర్‌ప్రైజెస్ లిమిటెడ్ చైర్ పర్సన్ శ్రీమతి అంజలి రట్టన మాట్లాడుతూ.. తక్కువ ధరలోనే మంచి నాణ్యమైన బైక్ అందించాలనే తపన ఈ బైకును లాంచ్ చేసేలా చేసింది. కంపెనీ బైకును డైజిన్ చేసేటప్పుడు నాణ్యతలో గానీ.. ఫీచర్స్ విషయంలో గానీ.. భద్రత విషయంలో గానే ఏ మాత్రం రాజీ పడలేదని పేర్కొన్నారు. మంచి స్టైల్.. ప్రాక్టికాలిటీ అందించే ఈ బైక్ తప్పకుండా బైక్ ప్రేమికులను ఆకర్షిస్తుందని ఆమె అన్నారు.
Don’t Miss: భారత్‌లో ‘రెనాల్ట్ నైట్ అండ్ డే ఎడిషన్స్’ లాంచ్: వీటి స్పెషాలిటీ ఏంటో తెలుసా?
ఇప్పటికే రివోల్ట్ కంపెనీ రెండు బైకులను భారతీయ మార్కెట్లో లాంచ్ చేసి అత్యుత్తమ అమ్మకాలను పొందుతోంది. కస్టమర్లకు చేరుగా ఉండేందుకు దేశంలోని అనేక ప్రధాన నగరాల్లో డీలర్షిప్లను ప్రారంభించి.. వీటి ద్వారా బ్రాండ్ బైకులను విక్రయిస్తోంది. దేశంలో మొత్తం 163 రివోల్ట్ డీలర్షిప్స్ ఉన్నట్లు సమాచారం. ఈ సంఖ్య రాబోయే రోజుల్లో మరింత పెరుగుతుందని భావిస్తున్నాము.