30.2 C
Hyderabad
Thursday, April 3, 2025

మొన్న ఆడి.. నేడు క్రెటా.. మరో కొత్త కారు కొన్న ప్రముఖ నటి – ఫోటోలు

Richest Child Actor Riva Arora Buys New Hyundai Creta: ఉరి, మామ్ వంటి సినిమాల్లో బాలనటిగా గుర్తింపు పొందిన ‘రివా అరోరా‘ గురించి చాలామందికి తెలిసే ఉంటుంది. ఈమె ఇటీవల హ్యుందాయ్ కంపెనీకి చెందిన క్రెటా కారును కొనుగోలు చేసింది. దీనికి సంబంధించిన ఫోటోలను తన సోషల్ మీడియా ఖాతాలో పోస్ట్ చేసింది. ఇందులో రివా కొనుగోలు చేసిన కొత్త క్రెటా కారును చూడవచ్చు.

సోషల్ మీడియాలో వెల్లడైన ఫోటోలను గమనిస్తే.. ఇందులో రివ అరోరా తన కుటుంబ సబ్యులతో కలిసి కారును డెలివరీ చేసుకోవడం చూడవచ్చు. అంతే కాకుండా కారుకు పూజ చేయడం, డ్రైవింగ్ సీటులో కూర్చుని స్టీరింగ్ వీల్ పట్టుకుని ఉండటం అన్నీ కూడా ఇక్కడ చూడవచ్చు. ఫోటోలలో గమనిస్తే.. ఈమె తన చేతికి ప్రాక్చర్ స్లింగ్ పర్సు బెల్ట్ ధరించి ఉండటం చూడవచ్చు. బహుశా ఈమె చేతికి ఏదో దెబ్బతగిలి ఉండొచ్చని తెలుస్తోంది.

రివా అరోరా కొనుగోలు చేసిన కారు క్రెటా ఫేస్‌లిఫ్ట్ అని తెలుస్తోంది. ఇది వైట్ క్లాసీ షేడ్‌లో చూడచక్కగా ఉంది. ఇక్కడ కనిపించే కారు క్రెటా టాప్ వేరియంట్ ఎస్ఎక్స్ (ఓ). ఇది పనోరమిక్ సన్‌రూఫ్, లెదర్ అపోల్స్ట్రే, 8 వె పవర్డ్ అడ్జస్టబుల్ డ్రైవర్ సీటు, యాంబియంట్ లైటింగ్ మొదలైన ఫ్రీమియం ఫీచర్స్ పొందుతుంది. అంతే కాకుండా వెంటిలేటెడ్ ఫ్రంట్ సీట్లు, వైర్‌లెస్ ఛార్జర్, డ్రైవ్ అండ్ ట్రాక్షన్ కంట్రోల్ మోడ్స్ వంటివి కూడా ఇందులో ఉన్నాయి.

బోస్ ఆడియో సిస్టం, కూల్డ్ గ్లోవ్ బాక్స్ వంటివి కలిగి ఉన్న హ్యుందాయ్ క్రెటా.. లెవెల్ 2 ఏడీఏఎస్ ఫీచర్స్ కూడా పొందుతుంది. కాబట్టి ఇందులో ఫ్రంట్ అండ్ రియర్ పార్కింగ్ సెన్సార్లు, హిల్ స్టార్ట్ అసిస్ట్, ఎలక్ట్రానిక్ స్టెబిలిటీ కంట్రోల్ వంటి వాటితో పాటు ఆరు ఎయిర్‌బ్యాగ్‌లు ఉన్నాయి. ఇవన్నీ వాహన వినియోగదారుల యొక్క భద్రతకు పెద్ద పీట వేస్తాయి. ప్రమాద సమయంలో ప్రయాణికుల ప్రాణాలను కాపాడటంలో ఇవి ప్రధాన పాత్ర పోషిస్తాయి.

హ్యుందాయ్ క్రెటా ఇంజిన్ వివరాలు

క్రెటా ఫేస్‌లిఫ్ట్ మూడు ఇంజిన్ ఆప్షన్స్ పొందుతుంది. మొదటిది 1.5 లీటర్ న్యాచురల్లీ ఆస్పిరేటెడ్ పెట్రోల్ ఇంజిన్. ఇది 115 Bhp పవర్ అందిస్తుంది. రెండో ఇంజిన్ 1.2 లీటర్ డీజిల్.. ఇది కూడా 115 Bhp పవర్ డెలివరీ చేస్తుంది. ఇవి రెండూ కూడా 6 స్పీడ్ మాన్యువల్ గేర్‌బాక్స్ ఆప్షన్స్ పొందుతాయి. మూడో ఇంజిన్ 1.5 లీటర్ టర్బోఛార్జ్డ్ పెట్రోల్. ఇది 160 బ్రేక్ హార్స్ పవర్ ప్రొడ్యూస్ చేస్తుంది. ఇది 7 స్పీడ్ డ్యూయెల్ క్లచ్ ఆటోమాటిక్ ట్రాన్స్‌మిషన్‌తో జతచేయబడి అత్యుత్తమ పనితీరును అందిస్తుంది.

నటి రివా అరోరా టాప్ వేరియంట్ కొనుగోలు చేసిందనే విషయం తెలిసింది, కానీ ఏ ఇంజిన్ ఆప్షన్స్ ఎంచుకుంది అనేది వెల్లడికాలేదు. అయితే క్రెటా యొక్క అన్ని ఇంజిన్ ఆప్షన్స్ మంచి పనితీరును అందిస్తాయని మాత్రం ఖచ్చితంగా చెప్పవచ్చు. ఇది మంచి డిజైన్ మరియు ఫీచర్స్ కలిగి ఉండటం వల్ల భారతదేశంలో ఎక్కువమంది కొనుగోలు చేస్తున్న ఉత్తమ కారుగా రికార్డ్ క్రియేట్ చేసింది. ఇప్పటికే లెక్కకు మించిన వాహన ప్రేమికులు క్రెటా కారును ఎగబడి మరీ కొనుగోలు చేస్తున్నారు. క్రెటా ఫేస్‌లిఫ్ట్ ప్రారంభ ధర రూ. 11 లక్షలు కాగా.. టాప్ వేరియంట్ ధర రూ. 20 లక్షల (ఎక్స్ షోరూమ్) కంటే ఎక్కువ.

రివా అరోరా ఆడి కారు

నటి రివా అరోరా కారు కొనుగోలు చేయడం ఇదే మొదటిసారి కాదు. ఇప్పటికే ఈమె ‘ఆడి క్యూ3’ (Audi Q3) కొనుగోలు చేసింది. రివా ఇన్‌స్టాగ్రామ్ అకౌంట్ 10 మిలియన్స్ ఫాలోవర్స్ పొందిన సందర్భంగా ఈ కారును కొనుగోలు చేసినట్లు సమాచారం. ఈ కారు ధర రూ. 44 లక్షలు అని తెలుస్తోంది.

రివా అరోరా కొనుగోలు చేసిన ఆడి క్యూ3 కారు ఫొటోలను కూడా తన సోషల్ మీడియా ఖాతాలో పోస్ట్ చేసింది. మంచి డిజైన్.. లేటెస్ట్ ఫీచర్స్ కలిగిన ఈ కారు 2.0 లీటర్ ఫోర్ సిలిండర్ టర్బోఛార్జ్ ఇంజిన్ పొందుతుంది. ఇది 190 పీఎస్ పవర్ మరియు 320 న్యూటన్ మీటర్ టార్క్ అందిస్తుంది. ఇది 7 స్పీడ్ డ్యూయెల్ క్లచ్ ట్రాన్స్‌మిషన్ పొందుతుంది.

admin
adminhttps://marthatelugu.com
I'm Sri, have 6 years experience as a Content Writer in all categories, I always try to give the breaking news to the Internet Users. I'm a certified Journalist and I Worked as a Journalist in one of the famous telugu channel.

సంబంధిత వార్తలు

తాజా వార్తలు