Royal Enfield Bike in EICMA 2024 Event: మిలాన్‌లో ప్రారంభమైన ప్రతిష్టాత్మక ‘ఈఐసీఎంఏ 2024’ (EICMA 2024) ఈవెంట్‌లో దిగ్గజ కంపెనీలన్నీ కూడా లెక్కకు మించిన బైకులు లాంచ్ చేసి.. చూపరులను కనువిందు చేశాయి. ఈ జాబితాలో ప్రముఖ టూ వీలర్ బ్రాండ్ ‘రాయల్ ఎన్‌ఫీల్డ్’ (Royal Enfield) కూడా ఉంది. ఈ కంపెనీ ఈఐసీఎంఏ వేదికపై లాంచ్ చేసిన బైకుల గురించి మరిన్ని వివరాలు తెలుసుకుందాం.
మార్కెట్లో పాపులర్ ద్విచక్ర వాహన తయారీ సంస్థగా అవతరించిన.. రాయల్ ఎన్‌ఫీల్డ్ కంపెనీ ఈఐసీఎంఏ 2024 వేదికగా.. మూడు కొత్త మోడల్స్ ప్రారంభించింది. అవి బేర్ 650, క్లాసిక్ 650 మరియు ప్లయింగ్ ఫ్లీ సీ6 వంటివి ఉన్నాయి. ప్లయింగ్ ప్లీ సీ6 అనేది బ్రాండ్ యొక్క మొట్ట మొదటి ఎలక్ట్రిక్ బైక్.. కాగా మిగిలిన రెండూ 650 సీసీ విభాగంలో అడుగుపెట్టిన లేటెస్ట్ బైక్స్.
రాయల్ ఎన్‌ఫీల్డ్ ప్లయింగ్ ఫ్లీ సీ6 (Royal Enfield Flying Flea C6)
ఈఐసీఎంఏ వేదికగా రాయల్ ఎన్‌ఫీల్డ్ లాంచ్ చేసిన ఫస్ట్ ఆల్ ఎలక్ట్రిక్ మోటార్‌సైకిల్ ఈ ‘ప్లయింగ్ ఫ్లీ సీ6’. రెండో ప్రపంచ యుద్ధ సమయంలో కంపెనీ లాంచ్ చేసిన బైకు డిజైన్ కలిగిన ప్లయింగ్ ఫ్లీ సీ6.. రెట్రో లుక్, బాబర్ స్టైల్ సీటు, ఫ్రంట్ రేక్ యాంగిల్, గిర్డర్ ఫోర్క్ ఫ్రంట్ సస్పెన్షన్ వంటివి పొందుతుంది.
ప్లయింగ్ ఫ్లీ సీ6 అనే అల్యూమినియం ఫ్రేమ్ పొందుతుంది. ఈ బైక్ ఎల్ఈడీ హెడ్‌లైట్, టచ్‌స్క్రీన్ TFT డ్యాష్‌బోర్డ్, లో రెసిస్టెన్స్ టైర్లు, ఫ్రంట్ అండ్ రియర్ డిస్క్ బ్రేక్స్, రిఫైన్డ్ స్విచ్‌గేర్ వంటి వాటిని పొందుతుంది. ఈఐసీఎంఏ కార్యక్రమంలో కంపెనీ ప్రదర్శించిన బైక్ సింగిల్ సీటును కలిగి ఉంది. ఈ బైక్ మార్కెట్లో అధికారికంగా లాంచ్ అయిన తరువాత పిలియన్ సీటును కూడా అందించే అవకాశం ఉంది.
రాయల్ ఎన్‌ఫీల్డ్ తన మొదటి ఎలక్ట్రిక్ బైక్.. ఎంత సామర్థ్యం కలిగిన బ్యాటరీని పొందుతుంది. రేంజ్ ఎంత ఇస్తుందనే విషయాలను అధికారికంగా వెల్లడించలేదు. అయితే ఈ బైక్ 150 కిమీ నుంచి 200 కిమీ మధ్య రేంజ్ అందిస్తుందని సమాచారం. ఈ బైక్ ధర రూ. 4 లక్షల కంటే ఎక్కువ ఉండవచ్చని సమాచారం. అయితే ధరలకు సంబంధించిన వివరాలు కూడా అధికారికంగా వెల్లడికావాల్సి ఉంది. ఈ బైక్ 2026 ప్రారంభంలో లాంచ్ అయ్యే అవకాశం ఉంది.
ప్లయింగ్ ఫ్లీ ఎస్6 (Royal Enfield Flying Flea S6)
రాయల్ ఎన్‌ఫీల్డ్ ఈఐసీఎంఏ వేదికగా ప్రదర్శించిన మరో ఎలక్ట్రిక్ బైక్ ‘ప్లయింగ్ ఫ్లీ ఎస్6’. ఇది కూడా రెట్రో డిజైన్ కలిగి.. చూడటానికి సీ6 బైక్ మాదిరిగానే ఉంటుంది. ఈ బైక్ యూఎస్డీ ఫోర్క్ వంటివి పొందుతుంది. అంతే కాకుండా ఇది అధిక గ్రౌండ్ క్లియరెన్స్ కలిగి, డ్యూయెల్ స్పోర్ట్ టైర్స్, ప్లాట్ సీటును పొందుతుంది. చైన్ డ్రైవ్ సిస్టం కలిగిన ఈ బైక్ స్పోక్ వీల్స్ పొందుతుంది.
ట్రాక్షన్ కంట్రోల్, కలర్ TFT డిస్‌ప్లే, కార్నరింగ్ ఏబీఎస్ వంటి ఫీచర్స్ కూడా ఈ రాయల్ ఎన్‌ఫీల్డ్ ప్లయింగ్ ఫ్లీ ఎస్6 బైకులో ఉన్నాయి. అయితే కంపెనీ ఈ బైక్ యొక్క బ్యాటరీ మరియు రేంజ్ వంటి వివరాలను అధికారికంగా వెల్లడించలేదు. బహుశా లాంచ్ సమయానికి కంటే ముందు ఈ వివరాలను వెల్లడించే అవకాశం ఉందని సమాచారం. ఈ బైక్ 2027లో లాంచ్ అయ్యే అవకాశం ఉంది.
రాయల్ ఎన్‌ఫీల్డ్ బేర్ 650 (Royal Enfield Bear 650)
ఈఐసీఎంఏ వేదికగా రాయల్ ఎన్‌ఫీల్డ్ కంపెనీ లాంచ్ చేసిన బైక్ ‘బేర్ 650’. రూ.3.39 లక్షల ధర వద్ద లాంచ్ అయిన ఈ బైక్ 650 సీసీ విభాగంలోకి అడుగుపెట్టింది. స్క్రాంబ్లర్ స్టైల్ డిజైన్ కలిగిన ఈ బైక్.. ఇప్పటికే మార్కెట్లో అమ్మకానికి ఉన్న ఇంటర్‌సెప్టర్ 650 ప్లాట్‌ఫామ్ ఆధారంగా రూపొందించబడింది.
648 సీసీ ప్యారలల్ ట్విన్ ఇంజిన్ కలిగిన ఈ బేర్ 650 బైక్.. ఇంటర్‌సెప్టర్ 650 కంటే కూడా ఎక్కువ టార్క్ అందిస్తుంది. ఇది టూ ఇన్ వన్ ఎగ్జాస్ట్ సిస్టం పొందుతుంది. 184 మిమీ గ్రౌండ్ క్లియరెన్స్ కలిగిన ఈ బైక్ 19 ఇంచెస్ ఫ్రంట్ టైర్ మరియు 17 ఇంచెస్ రియర్ టైర్ పొందుతుంది. ఇది హిమాలయన్ బైకులో కనిపించే TFT డాష్‌బోర్డు పొందుతుంది.
రాయల్ ఎన్‌ఫీల్డ్ క్లాసిక్ 650 (Royal Enfield Classic 650)
కంపెనీ ఆవిష్కరించిన మరో బైక్ క్లాసిక్ 650. ఇది ప్యారలల్ ట్విన్ ఇంజిన్ కలిగి 7250 rpm వద్ద 47 హార్స్ పవర్ మరియు 5650 rpm వద్ద 52.3 న్యూటన్ మీటర్ టార్క్ ప్రొడ్యూస్ చేస్తుంది. ఇది 6 స్పీడ్ గేర్‌బాక్స్ కలిగి.. స్లిప్ అండ్ అసిస్ట్ క్లచ్ పొందుతుంది. 243 కేజీల బరువున్న ఈ బైక్ బ్రాండ్ యొక్క అత్యంత బరువైన బైకుగా రికార్డ్ క్రియేట్ చేసింది.
కొత్త రాయల్ ఎన్‌ఫీల్డ్ క్లాసిక్ 650 బైకులోని చాలా పార్ట్స్.. ఇప్పటికే మార్కెట్లో ఉన్న షాట్‌గన్ 650 నుంచి తీసుకున్నట్లు తెలుస్తోంది. సుమారు 14.8 లీటర్ల ఫ్యూయెల్ ట్యాంక్ కలిగిన ఈ బైక్ లాంగ్ రైడ్ చేయడానికి కూడా చాలా అనుకూలంగా ఉంటుంది. ఈ బైకులో ఇన్‌స్ట్రుమెంటేషన్ కోసం డిజిటల్ అనలాగ్ డిస్‌ప్లే ఉంటుంది. గేర్ పొజిషన్ ఇండికేటర్, ట్రిప్పర్ న్యావిగేషన్ పాడ్ వంటివి కూడా ఇందులో చూడవచ్చు. ఈ బైక్ 2025 ఫిబ్రవరిలో లాంచ్ అయ్యే అవకాశం ఉందని సమాచారం.
హిమాలయన్ ఈవీ 2.0 (Royal Enfield Himalayan 2.0)
రాయల్ ఎన్‌ఫీల్డ్ యొక్క అత్యంత ప్రజాదరణ పొందిన అడ్వెంచర్ మోడల్.. హిమాలయన్.. ఎలక్ట్రిక్ రూపంలో లాంచ్ కావడానికి సిద్ధంగా ఉంది. ఈఐసీఎంఏ వేదికగా హిమాలయన్ ఎలక్ట్రిక్ 2.0 ప్రోటోటైప్ చూపరులను చాలా ఆకట్టుకుంది. దీనిని ‘హిమ్ ఈ’ అని కూడా పిలుస్తారు.
Don’t Miss: ఎట్టకేలకు మార్కెట్లో అడుగుపెట్టిన ‘స్కోడా కైలాక్’: రేటు తెలిస్తే.. ఇప్పుడే కొనేస్తారు!
హిమాలయన్ 2.0 ఎలక్ట్రిక్ బైక్ గోల్డ్ కలర్ వైర్ స్పోక్ వీల్స్, దృఢమైన స్వింగార్మ్, ఎల్ఈడీ రౌండ్ హెడ్‌ల్యాంప్, ఇన్‌స్ట్రుమెంట్ కన్సోల్ కోసం అప్డేటెడ్ యూజర్ ఇంటర్‌ఫేస్ మరియు ఎలక్ట్రానిక్ సస్పెన్షన్ వంటివన్నీ పొందుతుంది. కంపెనీ ఇప్పుడు ఈ బైకును కఠినమైన రోడ్లపై కూడా టెస్ట్ చేస్తున్నట్లు సమాచారం. ఈ కారు బ్యాటరీ మరియు రేంజ్ వంటి వివరాలు.. ఇంకా వెలువడలేదు. కాగా ఇవన్నీ లాంచ్ సమయంలో తెలుస్తాయి. మొత్తానికి మార్కెట్లో రాయల్ ఎన్‌ఫీల్డ్ తన హవా చూపించడానికి గట్టిగా ప్రయత్నిస్తున్నట్లు తెలుస్తోంది.