Royal Enfield New Bikes Goan Classic 350 And Scram 440: ప్రముఖ ద్విచక్ర వాహన తయారీ సంస్థ రాయల్ ఎన్‌ఫీల్డ్ దేశీయ మార్కెట్లో మరో బైక్ లాంచ్ చేసింది. ఇప్పటికే టూ వీలర్ విభాగంలో దూసుకెళ్తున్న కంపెనీ ఎప్పటికప్పుడు కొత్త బైకులను పరిచయం చేస్తూనే ఉంది. ఇందులో భాగంగానే ఇప్పుడు తాజాగా ‘గోవాన్ క్లాసిక్ 350’ (Goan Classic 350) లాంచ్ చేసింది. స్క్రామ్ 440 బైకును ఆవిష్కరించింది. ఈ సరికొత్త బైకుల గురించి పూర్తి సమాచారం ఇక్కడ చూసేద్దాం..
ధరలు (Price)
రాయల్ ఎన్‌ఫీల్డ్ లాంచ్ చేసిన కొత్త గోవాన్ క్లాసిక్ 350.. బాబర్ స్టైల్ మోటార్‌సైకిల్. ఇది రెట్రో డిజైన్ పొందుతుంది. ఇది రెండు వేరియంట్లలో లభించనున్నట్లు సమాచారం. కాబట్టి బేస్ వేరియంట్ ధర రూ. 2.35 లక్షలు కాగా.. టాప్ వేరియంట్ ధర రూ. 2.38 లక్షలు (ఎక్స్ షోరూమ్, చెన్నై). కంపెనీ ఈ బైకును 2024 మోటోవర్స్ రైడింగ్ ఫెస్టివల్ (2024 Motoverse Riding Festival)లో లాంచ్ చేసింది.
డిజైన్ (Design)
కొత్త గోవాన్ క్లాసిక్ 350 బైక్.. రౌండ్ ఎల్ఈడీ హెడ్‌లైట్, ఎల్ఈడీ పైలట్ లైట్స్, ఎల్ఈడీ టర్న్ ఇండికేటర్స్ వంటివి పొందుతుంది. ఇది పొడవైన హ్యాంగర్ హ్యాండిల్‌బార్ పొందుతుంది. పిలియన్ కోసం సీటును అమర్చుకోవచ్చు. ఇది పూర్తిగా ఆప్షనల్. అయితే ఈ కొత్త బైక్ పర్పుల్ హేజ్, రేవ్ రెడ్, షాక్ బ్లాక్ మరియు ట్రిప్ టీల్ అనే కలర్ ఆప్షన్లలో లభిస్తుంది.
ఫీచర్స్ (Features)
గోవాన్ క్లాసిక్ 350 యొక్క ఫీచర్స్ విషయానికి వస్తే.. ఇది డిజిటల్ అనలాగ్ కన్సోల్ పొందుతుంది3. ఇది స్పీడో మీటర్, ట్రిప్ మీటర్, ఓడోమీటర్, గేర్ పొజిషన్ ఇండికేటర్ వంటి వాటిని ప్రదర్శిస్తుంది. అయితే ట్రిప్పర్ నావిగేషన్ కోసం సెకండరీ డయల్స్ ఉంటాయి.
ఇంజిన్ (Engine)
రాయల్ ఎన్‌ఫీల్డ్ గోవాన్ క్లాసిక్ 350 బైక్ 350 సీసీ విభాగంలో లాంచ్ అయిన బైక్. కాబట్టి ఇది 349 సీసీ ఇంజిన్ పొందుతుంది. ఇది 20.2 హార్స్ పవర్. 27 న్యూటన్ మీటర్ టార్క్ అందిస్తుంది. ఇంజిన్ 5 స్పీడ్ గేర్‌బాక్స్ పొందుతుంది. సుమారు 197 కేజీల బరువున్న ఈ బైక్ ఫ్యూయెల్ ట్యాంక్ కెపాసిటీ 13 లీటర్లు కావడం గమనార్హం.
జావా 42 బాబర్, జావా పెరాక్ వంటి వాటికి ప్రధాన ప్రత్యర్థిగా ఉన్న రాయల్ ఎన్‌ఫీల్డ్ గోవాల్ క్లాసిక్ 350 బైక్.. టెలిస్కోపిక్ ఫ్రంట్ ఫోర్క్, డ్యూయెల్ రియర్ స్ప్రింగ్ పొందుతుంది. ట్యూబ్‌లెస్ టైర్‌లను కలిగిన ఈ బైక్ యొక్క ముందు భాగంలో 19 ఇంచెస్ వీల్స్, వెనుక 16 ఇంచెస్ వీల్స్ ఉన్నాయి. అయితే రెండు చివర్లలో డిస్క్ ఉంటుంది. ఈ బైక్ గ్రౌండ్ క్లియరెన్స్ 170 మీమీ వరకు ఉంటుంది.
రాయల్ ఎన్‌ఫీల్డ్ స్క్రామ్ 440 (Royal Enfield Scram 440)
కంపెనీ గోవాన్ క్లాసిక్ 350 లాంచ్ చేయడంతో పాటు.. స్క్రామ్ 440 బైకును ఆవిష్కరించింది. ఇది చూడటానికి దాని మునుపటి స్క్రామ్ 411 మాదిగిగా కనిపించినప్పటికీ.. కొన్ని అప్డేటెడ్ ఫీచర్లను చూడవచ్చు. ఈ బైకులో 443 సీసీ ఇంజిన్ ఉంటుంది. ఇది 6500 rpm వద్ద 25.4 హార్స్ పవర్ మరియు 4000 rpm వద్ద 34 ఎన్ఎమ్ టార్క్ అందిస్తుంది. 6 స్పీడ్ గేర్‌బాక్స్ ఆప్షన్ కలిగిన ఈ బైక్ మంచి పనితీరును అందిస్తుందని తెలుస్తోంది.
Also Read: భారత్‌లో ఒకేసారి నాలుగు బైకులు లాంచ్: గన్ లాంటి డిజైన్, రేసుగుర్రం లాంటి స్పీడ్
కంపెనీ ఆవిష్కరించిన ఈ బైక్ 2025 జనవలో అధికారికంగా లాంచ్ అయ్యే అవకాశం ఉంది. అప్పుడే దీని ధరలు కూడా వెల్లడవుతాయి. బహుశా ఈ బైక్ ధర దాని మునుపటి మోడల్ కంటే కొంత ఎక్కువగా ఉండే అవకాశం ఉంది. ఇది కూడా రెండు వేరియంట్లలో లాంచ్ అయ్యే అవకాశం ఉందని సమాచారం. టాప్ ఫోర్స్ మోడల్ అల్లాయ్ వీల్స్ కలిగి.. ట్యూబ్‌లెస్ టైర్లను పొందుతుంది. ట్రైల్ వెర్షన్ స్పోక్ వీల్స్ పొందనున్నట్లు తెలుస్తోంది. అయితే కంపెనీ ఈ బైక్ కోసం బుకింగ్స్ ఎప్పుడు ప్రారంభిస్తుంది. డెలివరీలకు సంబంధించిన చాలా విషయాలను వెల్లడించాల్సి ఉంది.