ఇదిగో మీటియోర్ ఆరంజ్ ఎడిషన్: ఇది చాలా స్పెషల్ తెలుసా?

రాయల్ ఎన్‌ఫీల్డ్ ఎప్పటికప్పుడు తన ఉనికిని విస్తరిస్తూనే ఉంది. ఇందులో భాగంగానే హిమాలయన్ మన బ్లాక్ ఎడిషన్ లాంచ్ చేసింది. అంతే కాకుండా.. గోవాలో జరిగిన మోటోవర్స్ 2025 కార్యక్రమంలో మీటియోర్ 350 సన్‌డౌనర్ ఆరెంజ్ స్పెషల్ ఎడిషన్ లాంచ్ చేసింది. ఇది సాధారణ మీటియోర్ 350 మాదిరిగా ఉన్నప్పటికీ.. సరికొత్త రంగులో చాలా ఆకట్టుకునే విధంగా ఉంది. ఈ బైక్ ధర, ఇతర కాస్మొటిక్ అప్డేట్స్ వంటివి ఈ కథనంలో తెలుసుకుందాం.

రూ.2.18 లక్షల ధర!

కంపెనీ లాంచ్ చేసిన 2025 మీటియోర్ 350 సన్‌డౌనర్ స్పెషల్ ఎడిషన్ ధర రూ. 2.18 లక్షలు (ఎక్స్ షోరూమ్, చెన్నై). ప్రపంచ వ్యాప్తంగా ఐదు లక్షల మీటియోర్ సేల్స్ మైలురాయిని చేరుకున్న సందర్భంగా రాయల్ ఎన్‌ఫీల్డ్.. ఈ స్పెషల్ ఎడిషన్ లాంచ్ చేసింది. సంస్థ ఈ బైకుకు సూర్యస్తమయాన్ని తలపించే రంగును అందించడం జరిగింది. కాబట్టి ఇది చూడటానికి చాలా అద్భుతంగా ఉంది.

కొత్తగా ఉన్నవి ఇవే!

ఈ స్పెషల్ క్రూయిజర్ బైక్.. డీలక్స్ టూరింగ్ సీటు, ఫ్లైస్క్రీన్, ప్యాసింజర్ బ్యాక్‌రెస్ట్, ట్రిప్పర్ న్యావిగేషన్ పాడ్ వంటివి పొందుతుంది. దీనికి తోడు ఇది అల్యూమినియం ట్యూబ్‌లెస్ స్పోక్ వీల్స్, స్లిప్ అండ్ అసిస్ట్ క్లచ్, అడ్జస్టబుల్ బ్రేక్, క్లచ్ లివర్, ఎల్ఈడీ హెడ్‌ల్యాంప్, యూఎస్బీ టైప్-సీ ఛార్జింగ్ ఫోర్ట్ వంటివి కూడా పొందుతుంది. మొత్తం మీద ఆకట్టుకునే డిజైన్, అప్డేటెడ్ ఫీచర్స్ వంటి వాటితి సౌకర్యం, భద్రత వంటి వాటిని కూడా అందిస్తుంది. కాబట్టి ఇది డైలీ యూజ్ లేదా లాంగ్ రైడ్ చేయడానికి అనుకూలంగా ఉంటుంది.

అదే ఇంజిన్ & సేమ్ పర్ఫామెన్స్!

అప్డేటెడ్ కలర్ ఆప్షన్ పొందినప్పటికీ.. ఈ రాయల్ ఎన్‌ఫీల్డ్ మీటియోర్ 350 సన్‌డౌనర్ ఆరంజ్ స్పెషల్ ఎడిషన్ యాంత్రికంగా ఎలాంటి అప్డేట్ పొందలేదు. కాబట్టి ఇందులో అదే 349 సీసీ సింగిల్ సిలిండర్ ఇంజిన్ ఉంటుంది. ఇది 20.2 బీహెచ్పీ పవర్, 27 ఎన్ఎమ్ టార్క్ అందిస్తుంది. ఇంజిన్ 5 స్పీడ్ గేర్‌బాక్స్ ఎంపికను పొందుతుంది. కాబట్టి పనితీరు అనేది సాధారణ మీటియోర్ మాదిరిగానే ఉంటుందని తెలుస్తోంది.

పెద్ద అప్డేట్స్ ఏమిటంటే?

కొత్త మీటియోర్ 350 సన్‌డౌనర్ ఆరంజ్ ఎడిషన్.. అదే ఛాసిస్, సస్పెన్షన్, బ్రేకింగ్ సిస్టం వంటివి పొందుతుంది. దీనిని స్పెషల్ ఎడిషన్ బైకుగా చూపించడానికి కంపెనీ ఇందులో కొన్ని బ్యాడ్జ్‌లను అందించింది. కాబట్టి స్పెషల్ ఎడిషన్ అయినప్పటికీ.. ఇందులో పెద్ద పెద్ద అప్డేట్స్ ఏమీ జరగలేదని స్పష్టమైంది.

బుకింగ్స్ ఎప్పుడంటే?

సరికొత్త రాయల్ ఎన్‌ఫీల్డ్ మీటియోర్ 350 సన్‌డౌనర్ ఆరంజ్ ఎడిషన్.. కోసం కంపెనీ ఈ రోజు (నవంబర్ 22) నుంచే బుకింగ్స్ స్వీకరించడం మొదలు పెట్టింది. దీని బుకింగ్ కోసం కంపెనీ అధికారిక డీలర్‌షిప్‌లను సందర్శించి బుక్ చేసుకోవచ్చు. డెలివరీలు త్వరలోనే ప్రారంభమవుతాయి. కొత్త కలర్ మీటియోర్ బైక్ కావాలనుకునే వారికి ఈ సన్‌డౌనర్ ఆరంజ్ ఎడిషన్ ఓ మంచి ఎంపిక అవుతుంది. కాగా ప్రస్తుతం ఇండియన్ మార్కెట్లో కంపెనీకి చెందిన హిమాలయన్ మన బ్లాక్ ఎడిషన్ కూడా అందుబాటులో ఉంది. దీని ఎక్స్-షోరూమ్ ధర రూ. 3.37 లక్షలు. ఇది సాధారణ హిమాలయన్ కంటే కొంత భిన్నంగా ఉంటుంది.