సౌండ్ చేయని.. రాయల్ ఎన్‌ఫీల్డ్ వచ్చేస్తోంది: లాంచ్ ఎప్పుడంటే?

రాయల్ ఎన్‌ఫీల్డ్.. ఎలక్ట్రిక్ వాహన విభాగంలోకి తన హవాను కొనసాగించడానికి సిద్ధమైంది. ఇప్పటికే ఒక ఎలక్ట్రిక్ బైక్ లాంచ్ చేసిన కంపెనీ.. రెండో మోడల్ ప్లయింగ్ ప్లీ సీ6ను విడుదల చేయడానికి సన్నద్ధమైంది. ఈ బైకును సంస్థ ఈఐసీఎంఏ 2025 కార్యక్రమంలో ఆవిష్కరించింది. దీనిని సంస్థ 2026లో దేశీయ విఫణిలో లాంచ్ చేస్తుందని సమాచారం.

యూరప్ మార్కెట్లో లాంచ్!

2026లో మార్కెట్లో రాయల్ ఎన్‌ఫీల్డ్ ప్లయింగ్ ప్లీ సీ6 అడుగుపెట్టనున్నట్లు.. ఐషర్ మోటార్స్ లిమిటెడ్ మేనేజింగ్ డైరెక్టర్ అండ్ రాయల్ ఎన్‌ఫీల్డ్ సీఈఓ బీ. గోవిందరాజన్ పేర్కొన్నారు. కాగా ఈ బైకును మార్కెట్లో లాంచ్ చేసున్నా తరువాత ఎస్6’ను లాంచ్ చేయనున్నట్లు ప్రకటించారు. కాగా ఈ బైకును ముందు యూరప్ మార్కెట్లో లాంచ్ చేసిన తరువాత.. భారతదేశంలో లాంచ్ అవుతుంది.

కంపెనీ లాంచ్ చేయనున్న.. రాయల్ ఎన్‌ఫీల్డ్ ఎలక్ట్రిక్ బైక్, సాధారణ ఎలక్ట్రిక్ స్కూటర్ మాదిరిగా కాకుండా, నగర ప్రయాణానానికి అనుకూలంగా ఉండేలా తయారవుతుంది. ఇది పొడవైన స్టాన్స్, వెడల్పుగా ఉన్న హ్యాండిల్ బార్లు, లాంగ్ ట్రావెల్ సస్పెన్షన్ వంటివి పొందుతుంది. ఈ బైక్.. 19 ఇంచెస్ ఫ్రంట్ వీల్, వెనుక 18 ఇంచెస్ వీల్ పొందుతుంది. కాబట్టి రైడింగ్ చేయడానికి ఇది చాలా అనుకూలంగా ఉంటుంది.

బ్యాటరీ వివరాలు

రాయల్ ఎన్‌ఫీల్డ్ తన ప్లయింగ్ ప్లీ సీ6 ఎలక్ట్రిక్ బైకులో.. బ్యాటరీ కేసింగ్ బరువును తగ్గిస్తుంది. డిజైన్ కూడా కొంత భిన్నంగా ఉంటుందని తెలుస్తోంది. సాధారణంగా రాయల్ ఎన్‌ఫీల్డ్ గంభీరంగా ఉంటుంది. కానీ ఎలక్ట్రిక్ వెర్షన్ మాత్రం అంత హుందాగా అనిపించడం లేదు. కానీ చూడటానికి ఒక రేసింగ్ బైక్ మాదిరిగా ఉంటుంది. సింగిల్ పీస్ సీటు కలిగిన ఈ సీటు.. రైడర్, పిలియన్ ఇద్దరికీ చాలా ఉపయోగకరంగా ఉంటుందని తెలుస్తోంది.

ఫీచర్స్ ఎలా ఉన్నాయంటే?

రాయల్ ఎన్‌ఫీల్డ్.. ఎలక్ట్రిక్ బైక్ ఫుల్లీ డిజిటల్ ఇన్‌స్ట్రుమెంట్ పాడ్ పొందుతుంది. ఇది టచ్‌స్క్రీన్ వెర్షన్. ఇంటిగ్రేటెడ్ న్యావిగేషన్, కనెక్టివిటీ ఫీచర్లు, రియల్ టైమ్ వెహికల్ మానిటరింగ్ వంటివన్నీ ఇందులో చూడవచ్చు. అంతే కాకుండా.. ఈ బైకులో ఆఫ్ రోడ్ మోడ్, స్విచబుల్ డ్యూయెల్ ఛానల్ ఏబీఎస్, ట్రాక్షన్ కంట్రోల్, లీన్ యాంగిల్ సెన్సింగ్ బ్రేకింగ్ సిస్టం కూడా ఉన్నాయి.

ఎలక్ట్రిక్ వెర్షన్ రాయల్ ఎన్‌ఫీల్డ్ బైక్

నిజానికి ఇండియన్ మార్కెట్లో ఎలక్ట్రిక్ కార్లకు, స్కూటర్లకు డిమాండ్ ఉందన్నమాట నిజమే. కానీ బైకులకు మాత్రం చెప్పుకోదగ్గ డిమాండ్ లేదు. దీనికి కారణం బైక్ అంటే.. సౌండ్ అనే అనాదిగా వస్తున్న భావన అనే చెప్పాలి. ఇక ప్రత్యేకించి రాయల్ ఎన్‌ఫీల్డ్ అంటే.. డుగ్, డుగ్ సౌండ్ ఇష్టపడతారు. ఇది ఎలక్ట్రిక్ రూపంలో వస్తే.. ఆ సౌండ్ వచ్చే అవకాశం లేదు. అయితే అందరూ సౌండ్ ఇష్టపడతారు అని ఖచ్చితంగా చెప్పలేము. సైలెంట్ రాయల్ ఎన్‌ఫీల్డ్ బైక్ అంటే ఇష్టపడేవాళ్లు కూడా ఉంటారు. కాబట్టి ఇది ఎలాంటి అమ్మకాలు పొందుతుందో.. ఇప్పుడే మనం అంచనా వేయలేము. బహుశా.. గొప్ప అమ్మకాలను పొందినప్పటికీ.. ఆశ్చర్యపడాల్సిన అవసరం లేదు.