Rs.1.6 Lakh Discount On Mahindra Thar This Festive Season: భారతదేశంలో ఎక్కువమంది వాహన ప్రేమికులు ఇష్టపడి కొనుగోలు చేసే కార్ల జాబితాలో చెప్పుకోదగ్గది మహీంద్రా కంపెనీ యొక్క థార్. ఇప్పటికే 1.86 లక్షల యూనిట్లు అమ్ముడైనట్లు సమాచారం. అయితే ఈ కారుపైన కంపెనీ ఇప్పుడు అద్భుతమైన డిస్కౌంట్ అందిస్తోంది. దసరా, దీపావళి సందర్భంగా థార్ కొనుగోలు చేయాలనుకునేవారికి ఇది గొప్ప అవకాశం.
మహీంద్రా థార్ కొనుగోలుపై డిస్కౌంట్స్
థార్ కొనుగోలుపైన గరిష్టంగా రూ. 1.60 లక్షల డిస్కౌంట్ పొందవచ్చు. థార్ 3 డోర్ వెర్షన్ (లోయర్ వేరియంట్) మీద రూ. 1.25 లక్షలు, థార్ ఎర్త్ ఎడిషన్ మీద రూ. 1.60 లక్షలు, ఇతర వేరియంట్ల మీద రూ. 1.30 లక్షల తగ్గింపు లభిస్తుంది.
మహీంద్రా కంపెనీ ఇటీవల దేశీయ విఫణిలో థార్ రోక్స్ లాంచ్ చేసిన తరువాత చాలామంది ఈ కారునే కొనుగోలు చేయడానికి ఆసక్తి చూపుతున్నారు. దీంతో 3 డోర్ మోడల్ అమ్మకాలు గణనీయంగా తగ్గుముఖం పట్టాయి. కాబట్టి సంస్థ ఈ పండుగ సీజన్‌లో తన అమ్మకాలను పెంపొందించుకోవడానికి ఈ అద్భుతమైన తగ్గింపులు ప్రకటించడం జరిగింది. కాగా కంపెనీ అన్ని వేరియంట్‌ల మీద 25000 రూపాయల విలువైన మహీంద్రా యాక్ససరీస్ కిట్‌ను కూడా ఉచితంగా అందిస్తుంది.
థార్ కొనుగోలుపైన డిస్కౌంట్ అనేది మీరు ఎంచుకునే వేరియంట్ మీద కూడా ఆధారపడి ఉంటుంది. అయితే థార్ ఎర్త్ ఎడిషన్ మీద ఎక్కువ డిస్కౌంట్ (రూ. 1.60 లక్షలు) డిస్కౌంట్ లభిస్తుంది.
మహీంద్రా థార్ ఎర్త్ ఎడిషన్
థార్ ఎర్త్ ఎడిషన్ 4డబ్ల్యుడీ స్టాండర్డ్‌తో వస్తుంది. ఇది పెట్రోల్ మరియు డీజిల్ ఇంజిన్ ఆప్షన్స్ పొందుతుంది. ఇంజిన్ మాన్యువల్ లేదా ఆటోమాటిక్ ట్రాన్స్‌మిషన్ ఆప్షన్స్ పొందుతుంది. ఈ ఎర్త్ ఎడిషన్ ఒక ప్రత్యేకమైన మాట్టే షేడ్‌లో లభిస్తుంది. దీనిని కంపెనీ డెసర్ట్ ప్యూరీ అని పిలుస్తుంది. ఈ కారు యొక్క బీ-పిల్లర్స్ మరియు వెనుక పెండర్ల మీద స్పెషల్ ఎర్త్ ఎడిషన్ బ్యాడ్జ్ పొందుతుంది.
చూడటానికి స్టాండర్డ్ మోడల్ మాదిరిగా కనిపించే థార్ ఎర్త్ ఎడిషన్ లేత గోధుమఱంగు మరియు నలుపు రంగు ఇంటీరియర్ లెథెరెట్ అపోల్స్ట్రే పొందుతుంది. స్టీరింగ్ వీల్ మీద బ్రాండ్ లోగో, కప్ హోల్డర్స్, గేర్ నాబ్, గేర్ కన్సోల్ వంటి ఎలిమెంట్స్ మీద క్రోమ్ ఫినిషింగ్ కూడా చూడవచ్చు. ఇది కూడా స్టాండర్డ్ మోడల్ మాదిరిగానే మంచి డిజైన్ మరియు ఫీచర్స్ పొందుతుంది.
థార్ వెయిటింగ్ పీరియడ్
నివేదికల ప్రకారం.. మహీంద్రా థార్ 3 డోర్ చాలా అవుట్‌లెట్‌లలో దాదాపు వెయిటింగ్ పీరియడ్ లేకుండానే అందుబాటులో ఉంది. అయితే 2డబ్ల్యుడీ పెట్రోల్ మరియు ఎంట్రీ లెవెల్ 2డబ్ల్యుడీ ఎల్ఎక్స్ డీజిల్ వంటి వాటికి మాత్రం డిమాండ్ కొంత అధికంగానే ఉంది. ఈ డిమాండ్ కూడా కొన్ని ప్రదేశాల్లో ఉన్నట్లు సమాచారం. కాబట్టి ఈ కారును బుక్ చేసుకుంటే త్వరగానే డెలివరీలు పొందువచ్చు.
మహీంద్రా థార్ దేశీయ మార్కెట్లో అడుగుపెట్టినప్పటి నుంచి ఇప్పటి వరకు కూడా గొప్ప అమ్మకాలతో దూసుకెల్తూనే ఉంది. ప్రారంభంలో ఈ కారు డెలివరీలు కొంత ఆలస్యంగా జరిగినా.. ప్రస్తుతం మాత్రం డెలివరీలో ఆలస్యం లేదనే తెలుస్తోంది. కాబట్టి థార్ బుక్ చేసుకుంటే త్వరగానే డెలివరీలు పొందవచ్చు.
Don’t Miss: మారుతి కార్లపై గొప్ప డిస్కౌంట్స్: పండుగ సీజన్‌లో ఇదే సువర్ణావకాశం!
మొదలైన థార్ రోక్స్ బుకింగ్స్
మహీంద్రా లాంచ్ చేసిన థార్ రోక్స్.. కోసం కంపెనీ బుకింగ్స్ స్వీకరించడం ప్రారంభించింది. బుకింగ్స్ ప్రారంభించిన కేవలం ఒక గంటలోనే లక్ష కంటే ఎక్కువ బుకింగ్స్ పొందింది. దీన్ని బట్టి చూస్తే థార్ రోక్స్ మోడల్ కోసం కస్టమర్లు ఎంతగా ఎదురుచూస్తున్నారో స్పష్టంగా అర్థమవుతోంది. థార్ రోస్ డెలివరీలు ఈ నెల చివరి నాటికి ప్రారంభమయ్యే అవకాశం ఉంది. థార్ రోక్స్ టర్బో పెట్రోల్ మరియు డీజిల్ ఇంజిన్స్ పొందుతుంది. ఇవి రెండూ కూడా అత్యుత్తమ పనితీరును అందిస్తాయి. డిజైన్ మరియు ఫీచర్స్ పరంగా అద్భుతంగా ఉన్న ఈ కారు పరిమాణం పరంగా 3 డోర్ మోడల్ కంటే కూడా పెద్దదిగా ఉంటుంది. కాబట్టి ఇది వాహన వినియోగదారులకు చాలా అనుకూలంగా ఉంటుంది.