26.7 C
Hyderabad
Sunday, April 6, 2025

సలార్ నటుడి కొత్త కారు.. వారెవ్వా కారంటే ఇలా ఉండాలంటున్న నెటిజన్లు

Prithviraj Sukumaran Buys New Porsche 911 GT3: సెలబ్రిటీలు తమకు నచ్చిన కార్లను కొనుగోలు చేయడం కొత్తేమీ కాదు. గతంలో కూడా ప్రముఖ సినీతాలు కొనుగోలు చేసిన ఖరీదైన కార్లను గురించి తెలుసుకున్నాం. ఇప్పుడు తాజాగా నటుడు ‘పృథ్వీరాజ్ సుకుమారన్’ (Prithviraj Sukumaran) ఓ ఖరీదైన కారును కొనుగోలు చేశారు. ఇంతకీ నటుడు కొనుగోలు చేసిన కారు ఏది? దాని ధర ఎంత? అనే మరిన్ని వివరాలు ఈ కథనంలో తెలుసుకుందాం.

నటుడు పృథ్వీరాజ్ సుకుమారన్ కొనుగోలు చేసిన కారు ‘పోర్స్చే’ (Porsche) కంపెనీకి చెందిన ‘911 జీటీ3’ (911 GT3). దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఇందులో పోర్స్చే యాజమాన్యం కారును నటుడికి ఇంటివద్దే డెలివరీ చేయడం చూడవచ్చు. డెలివరీ చేసిన తరువాత కారును డ్రైవ్ చేసుకుంటూ వెళ్లారు. ఈ కారు ధర రూ. 3కోట్లు వరకు ఉంటుందని సమాచారం.

డిజైన్ మరియు ఫీచర్స్

చూడగానే ఆకర్షించబడే డిజైన్ కలిగిన పోర్స్చే 911 జీటీ3 కారు ఎల్ఈడీ హెడ్‌ల్యాంప్, ఫ్రంట్ అండ్ రియర్ ఫాగ్లాంప్ వంటివి పొందుతుంది. ముందు భాగంలో బ్రాండ్ లోగో, వెనుక భాగంలో పోర్స్చే అనే అక్షరాలు కనిపిస్తారు. టర్న్ ఇంకేటర్స్ ఇక్కడ గమనించవచ్చు. మొత్తం మీద డిజైన్ చాలా సింపుల్‌గా.. అద్భుతంగా ఉండటం చూడవచ్చు.

ఫీచర్స్ విషయానికి వస్తే.. ఇందులో టచ్‌స్క్రీన్ ఇన్ఫోటైన్‌మెంట్ సిస్టం, డ్రైవర్ ఇన్ఫర్మేషన్ డిస్‌ప్లే మరియు ఏసీ వెంట్స్, స్టీరింగ్ కంట్రోల్స్ మొదలైన ఫీచర్స్ అన్నీ ఇందులో ఉంటాయి. ఇవన్నీ వాహన వినియోగదారులకు అద్భుతమైన డ్రైవింగ్ అనుభూతిని అందిస్తాయి.

ఇంజిన్

ఉత్తమ డిజైన్ మరియు ఫీచర్స్ కలిగిన పోర్స్చే 911 జీటీ3 కారు 3996 సీసీ 6 సిలిండర్ ఇంజిన్ పొందుతుంది. ఇది 8400 rpm వద్ద 493 bhp పవర్ మరియు 6100 rpm వద్ద 470 న్యూటన్ మీటర్ టార్క్ ప్రొడ్యూస్ చేస్తుంది. ఈ కారు రియర్ వీల్ డ్రైవ్ సిస్టం (RWD) పొందుతుంది. ఇది కేవలం 3.4 సెకన్లలో గంటకు 0 నుంచి 100 కిమీ వరకు వేగవంతమౌతుంది. దీని టాప్ స్పీడ్ 318 కిమీ/గం. ఈ కారు 12.70 కిమీ / లీటర్ మైలేజ్ అందిస్తుంది. మొత్తం మీద పనితీరు కూడా చాలా ఉత్తమంగా ఉంటుందని సమాచారం.

రెండు డోర్స్ కలిగిన పోర్స్చే 911 జీటీ3 కారు పరిమాణం పరంగా కూడా చాలా ఉత్తమంగా ఉంటుంది. దీని పొడవు 4562 మిమీ, వెడల్పు 1852 మిమీ, ఎత్తు 1271 మిమీ, వీల్‌బేస్ 2457 మిమీ, గ్రౌండ్ క్లియరెన్స్ 105 మిమీ మరియు బూట్ స్పేస్ 125 లీటర్లు ఉంది. కాబట్టి ఈ కారు అన్ని విధాలా వాహన వినియోగదారులకు చాలా అనుకూలంగా ఉంటుంది.

సేఫ్టీ ఫీచర్స్

పోర్స్చే 911 జీటీ3 కారులో మల్టిపుల్ ఎయిర్‌బ్యాగ్స్, ఏబీఎస్ విత్ ఈబీడీ, ఎలక్ట్రానిక్ స్టెబిలిటీ ప్రోగ్రామ్, పవర్ డోర్ లాక్, రెయిన్ సెన్సింగ్ వైపర్స్, చైల్డ్ సేఫ్టీ లాక్, బ్రేక్ అసిస్ట్, ట్రాక్షన్ కంట్రోల్ మరియు సెంట్రల్ లాకింగ్ వంటి మరెన్నో ఫీచర్స్ ఉంటాయి. ఇవన్నీ వాహన వినియోగదారుల యొక్క భద్రతను నిర్దారిసంచడానికి సహాయపడతాయి. తద్వారా ప్రమాదం సమయంలో ఇవి ప్రయాణికుల ప్రాణాలను కాపాడంలో తోడ్పడతాయి.

Don’t Miss: పెళ్లి తరువాత జహీర్ ఇచ్చిన మొదటి గిఫ్ట్ ఇదే.. సోనాక్షి సిన్హా దిల్ ఖుష్

కారు డెలివరీ చేసిన సమయంలో.. పోర్స్చే ఇండియా అధికారులు నటుడు పృథ్వీరాజ్ సుకుమార‌న్‌కు శుభాకాంక్షలు తెలిపారు. డెలివరీకి సంబంధించిన వీడియోలో పోర్స్చే యొక్క అధికారిక ఇన్‌స్టాగ్రామ్ ఖాతాలో పోస్ట్ చేశారు. ఇందులో పృథ్వీరాజ్ ఫ్యామిలీ మరింత చిరునవ్వులతో కూడా ప్రయాణం ఆస్వాదిస్తున్నట్లు పేర్కొన్నారు.

పృథ్వీరాజ్ సుకుమారన్ గ్యారేజిలోని ఇతర కార్లు

నటుడు పృథ్వీరాజ్ యొక్క గ్యారేజిలో పోర్స్చే 911 జీటీ3 కారు మాత్రమే కాకుండా.. లంబోర్ఘిని ఉరుస్, పోర్స్చే కయెన్, టాటా సఫారీ మరియు మినీ కూపర్ జేసీడబ్ల్యు ఖరీదైన అన్యదేశ్య కార్లకు కలిగి ఉన్నారు. వీటి ధరలు దాదాపు కోట్ల రూపాయల వరకు ఉంటాయని తెలుస్తోంది. దీన్ని బట్టి చూస్తే పృథ్వీరాజ్ సుకుమార‌న్‌కు కార్ల మీద ఎంత ఆసక్తి ఉందో స్పష్టంగా తెలుస్తోంది.

admin
adminhttps://marthatelugu.com
I'm Sri, have 6 years experience as a Content Writer in all categories, I always try to give the breaking news to the Internet Users. I'm a certified Journalist and I Worked as a Journalist in one of the famous telugu channel.

సంబంధిత వార్తలు

తాజా వార్తలు