Salman Khan Reveals His Dad First Bike: ప్రముఖ సినీ నటుడు ‘సల్మాన్ ఖాన్’ (Salman Khan) గురించి దాదాపు అందరికి తెలుసు. సినిమాల్లో నటిస్తూ.. ఎంతోమంది అభిమానుల మనసు దోచిన ఈ సల్లూభాయ్ తన సోషల్ మీడియా ఖాతాలో తన తండ్రి బైక్‌కు సంబంధించిన ఫోటోలను షేర్ చేశారు. ప్రస్తుతం నెట్టింట్లో వైరల్ అవుతున్న ఈ ఫోటోలలో కనిపించే బైక్ ఏది? దాని వివరాలు ఏంటి? అనేది ఇక్కడ తెలుసుకుందాం.
తండ్రితో మంచి అనుబందం కలిగి ఉన్న సల్మాన్ ఖాన్.. తన తండ్రితో తన ప్రేమ, జీవిత ప్రయాణానికి సంబంధించి ‘యాంగ్రీ యంగ్ మెన్’ అనే డాక్యుమెంటరీ కూడా రిలీజ్ చేశారు. ఇదిలా ఉండగా.. తాజాగా సల్మాన్ ఖాన్ తన తండ్రి మొదటి బైక్ ‘ట్రయంఫ్ టైగర్ 100’ (Triumph Tiger 100) ఫోటోలు సోషల్ మీడియాలో షేర్ చేశారు. ఇది 1956 నాటి బైక్ అయినప్పటికీ.. మంచి కండీషన్‌లో ఉంది.
ట్రయంఫ్ టైగర్ 100
సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న ఫోటోలను గమనిస్తే.. ఒక ఫొటోలో బైకు మీద సల్మాన్ ఖాన్ తండ్రి కూర్చుని ఉన్నారు. మరో ఫొటోలో సల్మాన్ ఖాన్ కూర్చుని ఉండటం చూడవచ్చు. ఈ ఫోటోలు అభిమానులను తెగ ఫిదా చేసేస్తున్నాయి. లెక్కకు మించిన వీక్షణలు పొందిన ఈ ఫోటోలపై.. అభిమానులు తమదైన రీతిలో కామెంట్స్ చేస్తున్నారు.
ప్రస్తుతం మార్కెట్లో కూడా ట్రయంఫ్ కంపెనీ బైకులు ఉన్నాయి. కానీ ఈ బ్రాండ్ యొక్క టైగర్ 100 బైకులు ఉత్పత్తి దశలో లేదు. అయితే కొంతమంది ఆటోమొబైల్ ఔత్సాహికులు వీటిని ఇప్పటికీ ఉపయోగిస్తున్నారు. కాబట్టి అప్పుడప్పుడు రోడ్ల మీద కనిపిస్తూ ఉంటాయి. ఇది చూడటానికి చాలా గంభీరంగా, శక్తివంతంగా ఉన్నట్లు తెలుస్తోంది. ఇది అడ్వెంచర్ బైకుగా కూడా పనికొస్తుంది.
ట్రయంఫ్ టైగర్ 100 బైక్ 1939 – 1940 మరియు 1946 – 1973 మధ్య బాగా ఫేమస్ అయ్యింది. కఠినమైన భూభాగాల్లో కూడా రైడ్ చేయడానికి టైగర్ 100 అద్భుతంగా ఉంటుంది. ఈ బైక్ టాప్ స్పీడ్ 100 మైల్స్ / గం. అప్పట్లో గొప్ప సక్సెస్ సాధించిన ఈ బైక్ ఎంతోమంది వాహన ప్రేమికులను ఆకర్శించింది. అప్పట్లో ఈ బైక్ ధర రూ. 9,500 నుంచో రూ. 10,500 మధ్య ఉండేదని సమాచారం.
ప్రస్తుతం మార్కెట్లో ట్రయంఫ్ టైగర్ 100 బైక్ లేదు.. కానీ దీని స్థానంలో టైగర్ టీ100 వచ్చింది. ఈ బైక్ ఉత్పత్తి కూడా ప్రస్తుతం లేదు. ఎందుకంటే యుద్ధ సమయంలో జర్మన్లు ట్రయంఫ్ ఫ్యాక్టరీని ధ్వంసం చేశారు. అయితే టైగర్ 100 బైక్ రియర్ స్వింగ్ ఆర్మ్ సెటప్ పొందింది.
సల్మాన్ ఖాన్ కార్ అండ్ బైక్ కలెక్షన్స్
నటుడు సల్మాన్ అత్యంత ఖరీదైన లగ్జరీ కార్లు ఉన్నాయి. ఇందులో 2023 రేంజ్ రోవర్ ఎస్‍వీ ఎల్‌డబ్ల్యుబీ 3.0 (రూ. 4.4 కోట్లు), బుల్లెట్ ఫ్రూఫ్ నిస్సాన్ పెట్రోల్ (రూ. 2 కోట్లు), బుల్లెట్ ఫ్రూఫ్ ల్యాండ్ రోవర్ క్రూయిజర్ ఎల్‌సీ200 (రూ. 2.10 కోట్లు), రేంజ్ రోవర్ వోగ్ బయోగ్రఫీ (రూ. 1.82 కోట్లు), ఓల్డ్ జనరేషన్ రేంజ్ రోవర్ (రూ. 20 లక్షలు), ఆడి ఆర్ఎస్7 (రూ. 2.24 కోట్లు), మెర్సిడెస్ బెంజ్ జీఎల్ క్లాస్ (రూ. 77.68 లక్షలు), మెర్సిడెస్ బెంజ్ జీఎల్ఈ 43 ఏఎంజీ కూపే (రూ. 1.12 కోట్లు), మెర్సిడెస్ బెంజ్ ఎస్ క్లాస్ (రూ. 1.86 కోట్లు), బీఎండబ్ల్యూ ఎక్స్6 (రూ. 1.04 కోట్లు), లెక్సస్ ఎల్ఎక్స్ (రూ. 2.82 కోట్లు), సుజుకి ఇంట్రూడర్ ఎం1800ఆర్ (రూ. 15 లక్షలు) మరియు సుజుకి హయబుసా (రూ. 15.1 లక్షలు).
Also Read: భారత్‌లో ఒకేసారి నాలుగు బైకులు లాంచ్: గన్ లాంటి డిజైన్, రేసుగుర్రం లాంటి స్పీడ్
సల్మాన్ ఖాన్ పూర్తి పేరు ‘అబ్దుల్ రషీద్ సలీం సల్మాన్ ఖాన్’. ఈయన 1965 డిసెంబర్ 25న మధ్యప్రదేశ్ రాష్ట్రంలో జన్మించారు. 1988లో బీవీ హో తో ఐసీ సినిమాతో సల్మాన్ ఖాన్ సినీరంగ ప్రవేశం చేశారు. ఆ తరువాత కాలంలో అనేక సినిమాల్లో నటించి పాపులర్ అయ్యారు. ఈయన రెండు జాతీయ చలనచిత్ర అవార్డులు, రెండు ఫిల్మ్‌ఫేర్ అవార్డులు సైతం కైవసం చేసుకుంది.