బాలీవుడ్ నటి, బీజేపీ నాయకురాలు హేమ మాలిని ఎంజీ ఎం9 కొనుగోలు చేసిన తరువాత.. ప్రముఖ సంగీత విద్వాంసుడు శంకర్ మహదేవన్ అదే మోడల్ కారును కొనుగోలు చేశారు. ఇంతకీ ఆ కారు ధర ఎంత?, దాని వివరాలు ఏమిటి?, వీరిరువురూ కాకుండా.. ఇంకెవరైనా కొనుగోలు చేశారా అనే విషయాలను ఈ కథనంలో క్షుణ్ణంగా తెలుసుకుందాం.
ఎంజీ ఎం9 ఎలక్టిక్ కారు
శంకర్ మహదేవన్ కొనుగోలు చేసిన ఎంజీ ఎం9 ఎలక్ట్రిక్ కారు ప్రారంభ ధర ఇండియన్ మార్కెట్లో రూ. 69.90 లక్షలు (ఎక్స్ షోరూమ్). ఇది 7 సీటర్ కారు. కియా మోటార్స్ ఈ కారును ఈ మధ్యలో భారతదేశంలో విక్రయించడం మొదలుపెట్టింది. శంకర్ మహదేవన్ కారు కొనుగోలు చేయడానికి సంబంధించిన ఫోటోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఇందులో ఆయన కుటుంబాన్ని కూడా చూడవచ్చు.
బ్లాక్ కలర్ ఎంజీ ఎం9
కొత్త కారును కొనుగోలు చేసిన తరువాత.. హిందూ సంప్రదాయం ప్రకారం, పూజాది కార్యక్రమాలు చేసిన తరువాత.. శంకర్ మహదేవన్ & ఆయన భార్య రెండవ వరుసలో కూర్చున్నారు. ముందువైపు ఆయన కుమారు కూర్చున్నారు. విలాసవంతమైన క్యాబిన్, కారు డిజైన్ అన్నీ కూడా వారిని ఎంతగానో ఆకట్టుకున్నట్లు స్పష్టంగా అర్థమవుతోంది. వీరు మెటల్ బ్లాక్ కలర్ కారును కొనుగోలు చేశారు. కాగా కంపెనీ ఈ కారును బ్లాక్ రూఫ్.. పెర్ల్ వైట్ & బ్లాక్ రూఫ్ కాంక్రీట్ గ్రే అనే రంగులలో కూడా విక్రయిస్తోంది.
డిజైన్ & ఇంటీరియర్ ఫీచర్స్
కియా ఎంజీ ఎం9 ఎలక్ట్రిక్ కారు.. బోల్డ్ ఫ్రంట్ ఎండ్‌తో, బోల్డ్ డిజైన్ పొందుతుంది. ట్రాపెజోయిడల్ మెష్ గ్రిల్ కూడా ఇందులో చూడవచ్చు. స్ప్లిట్ ఎల్ఈడీ హెడ్‌లైట్స్, కనెక్టెడ్ డేటైమ్ రన్నింగ్ లైట్స్ కూడా ఇందులో కనిపిస్తాయి. మొత్తం మీద డిజైన్ చాలా అద్భుతంగా ఉందని తెలుస్తోంది. ఈ కారు డిజైన్ చూపరులను ఒక్క చూపుతోనే ఆకట్టుకుంటోంది.
ఇక ఇంటీరియర్ విషయానికి వస్తే.. విశాలమైన & విలాసవంతమైన ఇంటీరియర్ ప్రయాణికులకు లేదా వాహన వినియోగదారులకు చాలా అనుకూలంగా ఉంటుంది. అడ్జస్టబుల్ సీటింగ్, మసాజ్ ఫంక్షన్స్, వెంటిలేషన్ అన్నీ కూడా గొప్పగా ఉన్నాయి. యాచ్ స్టైల్ డ్యూయెల్ సన్‌రూఫ్, 64 కలర్ యాంబియంట్ లైటింగ్, 13 స్పీకర్ ఆడియో సిస్టం, సబ్ వూఫర్స్, యాంప్లిఫైయర్ కూడా ఈ కారులో ఉన్నాయి.
వైర్‌లెస్ ఆపిల్ కార్‌ప్లే, ఆండ్రాయిడ్ ఆటో వంటి వాటికి సపోర్ట్ చేసే 12.3 ఇంచెస్ సెంట్రల్ టచ్‌స్క్రీన్ ఇన్ఫోటైన్‌మెంట్ సిస్టం. 7 ఇంచెస్ డిజిటల్ డ్రైవర్ డిస్ప్లే, ఈ సిమ్ బేస్డ్ టెక్నాలజీ వంటి.. కార్ కనెక్టెడ్ టెక్నాలజీ, ముందు.. వెనుక వరుసలో ఆర్మ్‌రెస్ట్‌లు, 360 డిగ్రీ కెమెరా, పవర్ స్లైడింగ్ డోర్స్ మొదలైనవన్నీ ఈ కారులో ఉన్నాయి. సేఫ్టీ విషయానికి వస్తే.. ఈ కారులో 7 ఎయిర్‌బ్యాగులు, ఎలక్ట్రానిక్ స్టెబిలిటీ ప్రోగ్రామ్, టైర్ ప్రెజర్ మానిటరింగ్ సిస్టం వంటివి ఉన్నాయి.
బ్యాటరీ & రేంజ్
శంకర్ మహదేవన్ కొనుగోలు చేసిన కొత్త ఎంజీ ఎం9 ఎలక్ట్రిక్ కారు 90 కిలోవాట్ బ్యాటరీ పొందుతుంది. ఇందులోని ఎలక్ట్రిక్ మోటారు 245 హార్స్ పవర్, 350 ఎన్ఎమ్ టార్క్ ప్రొడ్యూస్ చేస్తుంది. ఈ కారు ఒక ఫుల్ ఛార్జితో 548 కిమీ రేంజ్ అందిస్తుంది. కాగా కంపెనీ ఈ కారు కోసం 11 కేడబ్ల్యు వాల్ బాక్స్ ఛార్జర్‌తో పాటు.. 3.3 కేడబ్ల్యు ఫోర్టబుల్ ఛార్జర్‌ను అందిస్తుంది. కాబట్టి ఛార్జింగ్ పరంగా కూడా ఎలాంటి ఇబ్బంది ఎదుర్కోవాల్సిన అవసరం లేదు.