Simple and Natural Tips For Get Rid Of Pimple: ఎప్పుడూ యువతను (అమ్మాయిలు, అబ్బాయిలు) వేదించే సమస్య మొటిమలే. ఈ ఎండాకాలమైతే.. సమస్య వర్ణనాతీతం అవుతుంది. అందంగా కానించాల్సిన మొహం మీద ఎర్రని మొటిమలు మనకు ఇబ్బందిని కలిగిస్తుంటే.. చూసేవారికి కూడా కొంత వెగటు కలిగిస్తాయి. కొంతమంది మొటిమలను పోగొట్టుకోవడానికి అనేక క్రీములు, టాబ్లెట్స్ వాడేస్తుంటారు. వీటివల్ల సమస్య తీరకపోగా.. కొన్నిసార్లు సైడ్ ఎఫెక్ట్స్ కూడా కనిపిస్తుంటాయి. అలంటి ఇబ్బందులకు చెక్ పెట్టడానికి.. ఇంట్లో దొరికే వస్తువులతోనే, మొటిమలను ఎలా మాయం చేయొచ్చో ఈ కథనంలో చూసేద్దాం..
టమాటోతో ఇలా
నిజానికి టమాటో వంట రుచిని పెంచడానికే కాదు, ముఖాన్ని కాంతివంతం చేయడంలో కూడా.. ఉపయోగపడుతుంది. టమాటో గుజ్జులో.. నిమ్మ రసం కలిపి ముఖానికి అప్లై చేయాలి. అప్లై చేసిన తరువాత 15 నుంచి 20 నిమిషాల పాటు ఆరనివ్వాలి. ఆ తరువాత చల్లని నీటితో శుభ్రం చేసుకోవాలి. ఇలా రోజూ చేస్తూ ఉంటే మొటిమల నుంచి ఉపశమనం లభించడమే కాకుండా.. ముఖం మరింత కాంతివంతంగా మారిపోతుంది. రోజూ చేస్తూ ఉంటే తేడా మీకే కనిపిస్తుంది. టమాటోలో ఉండే కూలింగ్ మరియు యాస్ట్రింజెంట్ గుణాలు మొటిమలను తగ్గించడానికి ఉపయోగపడతాయి.
ఆలివ్ ఆయిల్
మొటిమలను తగ్గించడానికి ఆలివ్ ఆయిల్ ఔషధంగా పనిచేస్తుంది. ఈ నూనెతో ప్రతి రోజూ ఉదయం, రాత్రి మర్దన చేసుకుంటే.. మంచి ఫలితం ఉంటుంది. చర్మ కణాలు కూడా చాలా ఆరోగ్యాంగా ఉంటాయి. కాబట్టి మొటిమల సమస్య దూరమవుతుంది. రోజూ మర్దన చేస్తూ ఉంటే.. మొటిమల వల్ల వచ్చిన మచ్చలు కూడా మాయమవుతాయి.
నిమ్మ రసం & వేపాకు
చర్మ రక్షణలో వేపాకుది ప్రత్యేకమైన పాత్ర ఉంది. హిందువులు శక్తి రూపంగా భావించే వేపలో ఔషధ గుణాలు కోకొల్లలుగా ఉంటాయి. కాబట్టి మొటిమలను మాయం చేసే శక్తి వేపాకుకు ఉంది. వేపాకును మెత్తని పేస్ట్ మాదిరిగా చేసుకుని అందులో కొంచెం నిమ్మ రసం, కొంచెం పసుపు కలుపుకుని ముఖానికి అప్లై చేసుకోవాలి. ఇలా చేసుకుని.. ఓ 20 నిముషాలు బాగా ఆరనివ్వాలి. ఆ తరువాత గోరువెచ్చని నీటితో ముఖం కడుక్కోవాలి. ఇలా వారానికి రెండు లేదా మూడు సార్లు చేస్తే ఫలితం మీకే కనిపిస్తుంది.
శనగపిండి
వంటకాలు చేసుకోవడానికే కాదు.. శనగపిండి శరీరాన్ని కాంతివంతం చేయడానికి కూడా ఉపయోగపడుతుంది. శనగపిండిలో కొంచెం చందనం పొడి కలుపుకుని.. అందులో పాలు లేదా నీళ్లు వేసి మిక్స్ చేసి ముఖానికి అప్లై చేసుకోవాలి. ఇలా చేసుకున్న తరువాత 10 నుంచి 20 నిముషాలు బాగా ఆరనివ్వాలి. ఆరిన తరువాత నీటితో కడుక్కోవాలి. వారానికి రెండు, మూడు సార్లు ఇలా శనగపిండి అప్లై చేస్తూ ఉంటే.. మొటిమలు, మొటిమల వల్ల వచ్చిన మచ్చలు పోతాయి.
Also Read: దేవర భామ ‘జాన్వీ కపూర్’ కొత్త కారు ఇదే!.. ధర తెలిస్తే షాకవుతారు
పుదీనా
మనం రోజూ చూసే పుదీనాలో కూడా ఔషధ గుణాలు చాలానే ఉన్నాయి. ఇవి మొటిమలను పోగొట్టడంలో పాత్ర పోషిస్తాయి. పుదీనా ఆకులను మెత్తని పేస్టులా చేసుకుని, అందులో కీరదోస రసం, కొంచెం తేనె కలిపి.. ఆ మిశ్రమాన్ని ముఖానికి అప్లై చేసుకోవాలి. అప్లై చేసుకుని 15 నుంచి 20 నిముషాలు ఆరనిచ్చిన తరువాత చల్లని నీటితో కడుక్కోవాలి. ఇలా తరచూ చేస్తూ ఉంటే మొటిమలు మాయమవుతాయి.
గమనిక: మొటిమలతో ఇబ్బందిపడేవారికి ఉపశమనం కలిగించడానికి, మేము ఆరోగ్య నిపుణులు, కొన్ని అధ్యయనాల నుంచి సేకరించిన సమాచారాన్ని కథనం రూపంలో అందించాము. మొటిమలు ఈ కారణం చేత వస్తాయో ఖచ్చితంగా నిర్దారించలేము. కాబట్టి మొటిమల నివారణకు.. ఉత్తమ చర్మ వైద్య నిపుణులను సంప్రదించడం ఉత్తమం.