Simple One Gen 1.5 Electric Scooter Launched in India: బెంగళూరుకు చెందిన ప్రముఖ ఎలక్ట్రిక్ టూ వీలర్ తయారీ సంస్థ సింపుల్ ఎనర్జీ (Simple Energy) ఎట్టకేలకు దేశీయ విఫణిలో ‘సింపుల్ వన్ జెన్ 1.5’ (Simple One Gen 1.5) వెర్షన్ లాంచ్ చేసింది. కంపెనీ లాంచ్ చేసిన ఈ ఎలక్ట్రిక్ స్కూటర్‌లో కొన్ని అప్డేట్స్ గమనించవచ్చు. కాబట్టి దీని గురించి మరిన్ని వివరాలు, వివరంగా.. ఈ కథనంలో చూసేద్దాం.
ధర
సింపుల్ వన్ జెన్ 1.5 ఎలక్ట్రిక్ స్కూటర్ లేటెస్ట్ అప్డేట్స్ పొందింది. అయితే ధరలో ఎటువంటి మార్పు లేదు. కాబట్టి దీని ధర స్టాండర్డ్ మోడల్ ధరకు సమానంగా ఉందన్నమాట. అంటే ఈ లేటెస్ట్ స్కూటర్ ధర రూ. 1.66 లక్షలు (ఎక్స్ షోరూమ్, బెంగళూరు) మాత్రమే. ఈ స్కూటర్ ఇప్పుడు కంపెనీ యొక్క అధీకృత డీలర్‌షిప్‌లలో అందుబాటులో ఉంది.
రేంజ్
ఇక్కడ తప్పకుండా తెలుసుకోవాల్సిన విషయం.. రేంజ్. ఎందుకంటే స్టాండర్డ్ సింపుల్ వన్ ఎలక్ట్రిక్ స్కూటర్ ఒక సింగిల్ ఛార్జితో 121 కిమీ రేంజ్ అందిస్తుందని సమాచారం. కానీ అప్డేటెడ్ సింపుల్ వన్ జెన్ 1.5 స్కూటర్ ఏకంగా 248 కిమీ రేంజ్ అందిస్తుందని తెలుస్తోంది. అంటే అప్డేటెడ్ స్కూటర్ స్టాండర్డ్ స్కూటర్ కంటే రెట్టింపు రేంజ్ అందిస్తుందన్నమాట. దీంతో ఈ స్కూటర్ భారతదేశంలో అత్యధిక రేంజ్ అందించే స్కూటర్ల జాబితాలో ఒకటిగా చేరింది.
అప్డేటెడ్ ఫీచర్స్
కొత్త సింపుల్ వన్ జెన్ 1.5 ఎలక్ట్రిక్ స్కూటర్ ఫీచర్స్ విషయానికి వస్తే.. ఇది యాప్ ఇంటిగ్రేషన్, నావిగేషన్, అప్డేటెడ్ రైడింగ్ మోడ్స్, పార్క్ అసిస్ట్, ఓటీఏ అప్డేట్స్, రీజనరేటివ్ బ్రేకింగ్, ట్రిప్ హిస్టరీ మరియు స్టాటిస్టిక్స్ వంటివి పొందుతుంది. ఈ ఫీచర్స్ మాత్రమే కాకుండా ఇందులో ఫైండ్ మై వెహికల్ ఫీచర్, ఆటో బ్రైట్‌నెస్ మరియు సౌండ్ వంటి మల్టిపుల్ సాఫ్ట్‌వేర్స్ ఉన్నాయి. ఫాస్ట్ బ్రేక్, టైర్ ప్రెజర్ మానిటరింగ్ సిస్టం, USB ఛార్జింగ్ పోర్ట్ వంటివి కూడా ఈ అప్డేటెడ్ స్కూటర్‌లో ఉన్నాయి.
కంపెనీ ఇప్పుడు అప్డేటెడ్ సింపుల్ వన్ జెన్ 1.5 స్కూటర్‌ను స్టాండర్డ్ మోడల్ ధర వద్దనే లాంచ్ చేసింది. కాబట్టి ఇప్పటికే స్టాండర్డ్ మోడల్ లేదా సాధారణ సింపుల్ వన్ కొనుగోలు చేసిన కస్టమర్లు లేటెస్ట్ సాఫ్ట్‌వేర్ అప్డేట్స్ కూడా పొందవచ్చు. అయితే ఇక్కడ తెలుసుకోవలసిన మరో విషయం ఏమిటంటే.. కొత్త జెన్ 1.5 సిఎంపీల వన్ కొనుగోలు చేసినవారు 750 వాట్స్ ఛార్జర్ కూడా పొందవచ్చు.
ఇతర వివరాలు
అప్డేటెడ్ సింపుల్ వన్ జెన్ 1.5 స్కూటర్ పార్క్ అసిస్ట్ ఫీచర్ కలిగి ఉండటం వల్ల.. ముందుకు మరియు వెనుకకు వెళ్లగలదు. ఈ స్కూటర్ కేవలం 2.77 సెకన్లలో గంటకు 0 నుంచి 40 కిమీ వరకు వేగవంతం అవుతుంది. అంతే కాకుండా ఇది 30 లీటర్ల అండర్ సీట్ స్టోరేజ్ కూడా పొందుతుంది. కాబట్టి ఎక్కువ అండర్ సీట్ స్టోరేజ్ కావాలనుకునే వారికి సింపుల్ వన్ జెన్ 1.5 మోడల్ ఓ ఉత్తమ ఎంపిక అనే చెప్పాలి.
సింపుల్ ఎనర్జీ కంపెనీకి దేశ వ్యాప్తంగా 10 స్టోర్స్ మాత్రమే ఉన్నాయి. అవి బెంగళూరు, హైదరాబాద్, గోవా, పూణే, వైజాగ్ మరియు కొచ్చి ప్రాంతాల్లో ఉన్నాయి. అయితే సంస్థ 2026 ఆర్ధిక సంవత్సరం నాటికి 150 కొత్త స్టోర్లను మరియు 200 సర్వీస్ సెంటర్లను ప్రారంభించాలని యోచిస్తోంది.
Also Read: ఫిబ్రవరి 17న లాంచ్ కానున్న కొత్త ఎలక్ట్రిక్ కారు ఇదే: ఒక్క ఛార్జ్.. 567 కిమీ రేంజ్ బాసూ!
నిజానికి ఇండియన్ మార్కెట్లో ఎలక్ట్రిక్ వాహనాలను మంచి డిమాండ్ ఉంది. ప్రస్తుతం మార్కెట్లో లెక్కకు మించిన ఎలక్ట్రిక్ బైకులు, స్కూటర్లు మరియు కార్లు ఉన్నాయి. స్కూటర్ల విభాగంలో ఎన్నెన్ని స్కూటర్లు ఉన్నా.. సింపుల్ ఎనర్జీ స్కూటర్లకు మాత్రం ఓ ప్రత్యేకత ఉంది. ఎందుకంటే ఇప్పటి వరకు ఈ బ్రాండ్ స్కూటర్ల మీద ఒక్క కంప్లైంట్ (పిర్యాదు) లేదు. మంచి డిజైన్, అంతకు మించిన ఫీచర్స్ కలిగిన ఈ స్కూటర్.. అద్భుతమైన రైడింగ్ అనుభూతిని అందిస్తుంది. ఈ కారణంగానే చాలామంది దీనిని ఇష్టపడి కొనుగోలు చేస్తున్నారు. పేరు సింపుల్ అయినప్పటికీ.. దీనికున్న ఫ్యాన్స్ మాత్రం చాలా ఎక్కువే అని తెలుస్తోంది.