ఐదేళ్ల ప్రేమ.. ప్రియుణ్ణి పెళ్లిచేసుకోబోతున్న స్మృతి మంధాన

టీమిండియా ఉమెన్స్ టీ20 జట్టు వైస్ కెప్టెన్.. స్టార్ బ్యాటర్ స్మృతి మంధాన త్వరలోనే పెళ్లి పీటలెక్కనున్నారు. ఈ వార్త సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. ఇంతకీ స్మృతి మంధాన పెళ్లిచేసుకోబోయే వ్యక్తి ఎవరు?, ఆయన బ్యాగ్రౌండ్ ఏమిటి?, పెళ్లి ఎప్పుడు అనే ఆసక్తికరమైన విషయాలు ఇక్కడ తెలుసుకుందాం.

మహారాష్ట్రలో పెళ్లి!

క్రికెటర్ స్మృతి మంధాన.. 2025 నవంబర్ నెలలో బాలీవుడ్ సింగర్ పలాష్ ముచ్చల్ను పెళ్లి చేసుకోబోతున్నారు. 2019 నుంచి పలాష్‌తో పరిచయం ఏర్పడినప్పటికీ.. 2024లో తమ బంధం గురించి సోషల్ మీడియా ద్వారా కన్ఫర్మ్ చేశారు. కాగా ఇప్పుడు తాజాగా పెళ్ళికి సంబంధించిన వార్తలు వైరల్ అవుతున్నాయి. వీరి పెళ్లి నవంబర్ 20న జరగనున్నట్లు సమాచారం. పెళ్లికి మహారాష్ట్రలోని సాంగ్లీ వేదిక కానుంది.

2024లో ఇన్‌స్టా పోస్ట్

అద్భుతమైన బ్యాటింగ్‌తో.. అభిమానులను మంత్ర ముగ్దులను చేసే స్మృతి మంధాన పెళ్లి వేడుకలో త్వరలోనే ప్రారంభం కానున్నాయి. కాగా స్మృతి & పలాష్ పెళ్ళికి.. కుటుంబ సభ్యులు, కొంతమంది సన్నిహితులు మాత్రమే హాజరయ్యే అవకాశం ఉంది. 2019లో డేటింగ్ ప్రారంభించిన ఈ జంట.. 2024లో ఇన్‌స్టాగ్రామ్ పోస్ట్ చేస్తూ ఐదవ వార్షికోత్సవం (పరిచయానికి ఐదేళ్లు) అంటూ పేర్కొన్నారు. అంటే ఈ జంట ఐదేళ్లుగా ప్రేమించుకుంటున్నట్లు తెలుస్తోంది.

ఇప్పటికే సోషల్ మీడియాలో స్మృతి మంధనా.. పలాష్ ముచ్చల్ ఫోటోలు తెగ వైరల్ అవుతున్నాయి. ఇప్పటికే తన అనుబంధాన్ని.. పెళ్లి విషయాన్ని పలాష్ ముచ్చల్ వెల్లడించారు. క్రికెటర్ అయిన స్మృతి.. సింగర్ పలాస్ త్వరలోనే ఏడడుగులు వేయనున్నారు. ఈ వార్త అటు క్రికెట్ అభిమానులను, ఇటు మ్యూజిక్ అభిమానులను ఆనందింపజేస్తుంది.

స్మృతి మంధాన గురించి

1996 జులై 18న ముంబైలో జన్మించిన స్మృతి శ్రీనివాస్ మంధాన (స్మృతి మంధాన) 2013లో కేవలం 16 సంవత్సరాల వయసులో టీమిండియా తరపున తొలి అంతర్జాతీయ మ్యాచ్ ఆడింది. 2018, 2021లో ఐసీసీ ఉమెన్స్ క్రికెట్ ఆఫ్ ది ఇయర్ అవార్డును గెలుచుకుంది. భారత మహిళా టీ20 జట్టుకు వైస్ కెప్టెన్ బాధ్యతలను కూడా నిర్వహించింది. కాగా 2023లో జరిగిన ఉమెన్స్ ప్రీమియర్ లీగ్ లో రాయల్ చాలెంజర్స్ బెంగళూరు జట్టుకు కెప్టెన్‌గా కూడా వ్యవహరించారు.

ఎవరీ పలాష్ ముచ్చల్?

పలాష్ ముచ్చల్ గురించి సంగీత ప్రియులకు పెద్దగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు. ఎందుకంటే యితడు బాలీవుడ్ సింగర్. సల్మాన్ ఖాన్, హృతిక్ రోషన్ వంటి దిగ్గజ హీరోల సినిమాల్లో పాటలు పాడి బాగా ఫేమస్ అయ్యాడు. అంతే కాకుండా అభిషేక్ బచ్చన్, దీపికా పదుకునేలతో పాటు అశుతోష్ గోవారికర్ ఖేలీన్ హమ్ జీ జాన్ సేలో ప్రధాన పాత్రలో కనిపించారు. ఈయన టీ-సిరీస్, జీ-మ్యూజిక్ కంపెనీ, పాల్ మ్యూజిక్ కోసం 40 కంటే ఎక్కువ మ్యూజిక్ వీడియోలో చేశారు. రిక్షా అనే వెబ్ సిరీస్‌కు ఇతడు దర్శకత్వం వహించారు. కాగా రాజ్‌పాల్ యాదవ్, రుబీనా డిలైక్ నటించిన ఆర్థ్ అనే సినిమాకు దర్శకత్వం వహిస్తున్నాడు. దీన్ని బట్టి చూస్తే పలాష్ సినిమా రంగంలో తనకంటూ ఒక ప్రత్యేకత సంపాదించుకున్నట్లు స్పష్టమవుతోంది.