Star Heroes and Directors Ask To Commitment Anasuya Comments: అనుసూయ భరద్వాజ్ (Anasuya Bharadwaj).. ఈ పేరుకు ప్రత్యేకంగా పరిచయం అవసరమే లేదు. ఎందుకంటే బుల్లితెర నటి నుంచి వెండితెర నటిగా ఎదిగిన ఈమె.. ప్రస్తుతం పాన్ ఇండియా సినిమాల్లో సైతం ప్రముఖ పాత్రలలో నటిస్తూ, ఎంతోమంది అభిమానుల మనసు దోచేస్తోంది. అయితే ఇటీవల ఓ ఇంటర్వ్యూలో చాలా ఆసక్తికరమైన విషయాలను వెల్లడించింది. దీనికి సంబంధించి మరిన్ని వివరాలు ఇక్కడ తెలుసుకుందాం.
ఒకప్పుడు సాక్షి టీవీలో పని చేసిన అనసూయ.. తరువాత జబర్దస్త్ కామెడీ షో ద్వారా బాగా పాపులర్ అయ్యింది. ప్రస్తుతం జబర్దస్త్ కామెడీ షో నుంచి బయటకు వచ్చి.. తన ఫోకస్ మొత్తాన్ని సినిమాల మీదనే ఉంచేసింది. అయితే ఈమె అప్పుడప్పుడు చేసే కొన్ని వ్యాఖ్యలు.. సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్నాయి. కొంతమంది ట్రోలర్లు కూడా ఈమెను చాలా ట్రోల్స్ చేస్తూ ఉంటారు.
శృంగారం.. బేసిక్ నీడ్
ఇటీవల ఒక ఇంటర్వ్యూలో.. ప్రస్తుత సినీ రంగంలో ఉన్న పరిస్థితుల గురించి వెల్లడించింది. ఇంటర్వ్యూ చేసే వ్యక్తి ’20 లేదా 25 ఏళ్ళ యువకులు 35 ఏళ్ల మహిళలను ఇష్టపడుతున్నట్లు ఓ సర్వేలో వెల్లడైంది’ అని చెప్పాడు. దానికి స్పందిస్తూ.. అందులో తప్పేముంది. తిండి, నిద్ర మాదిరిగానే శృంగారం కూడా ప్రాధమిక అవసరం అని అనసూయ చెప్పింది. అయితే శృంగారమనేది బహిరంగం కాదని కూడా స్పష్టం చేసింది.
ఇక తన డ్రెస్ కోడ్ గురించి మాట్లాడుతూ.. తనకు నచ్చిన డ్రెస్ వేసుకుంటా అని, మా వాళ్లకు లేని ఇబ్బంది ఇతరులకు ఎందుకు అని చెప్పించి. ఇద్దరు పిల్లల తల్లి ఇలాంటి డ్రెస్ వేసుకుందేంటి? అంటుంటారు. నేను బికినీ వేసుకుంటా.. లేకుంటే బట్టలిప్పుకు తిరుగుతా? అది నా ఇష్టం. అయితే చూసేవాళ్ల దృష్టిని తప్పుబట్టరు, నన్ను ఎందుకు తప్పుపడతారు అని అనసూయ వెల్లడించింది. నా పని నేను చేసుకుంటూ పోతా? ఎవరికో సమాధానం చెప్పాల్సిన అవసరం నాకు లేదని క్లారిటీ ఇచ్చింది.
కమిట్మెంట్ అడిగారు
సినిమా ఇండస్ట్రీలో చాలామంది హీరోలు, డైరెక్టర్లు తనను కమిట్మెంట్ అడిగారని.. వారికి నో చెప్పడం వల్ల చాలా అవకాశాలు కోల్పోయానని అనసూయ ఇంటర్వ్యూలో చెప్పింది. సినిమా అనేది రంగుల ప్రపంచం.. అక్కడున్నవారు చాలా అందంగా తయారవుతారు. దీంతో ఎదుటివారికి ఆకర్షణ ఎక్కువ. తనకు 9వ తరగతి నుంచే ప్రపోజల్స్ స్టార్ అయ్యాయని చెప్పింది. అప్పటి నుంచే ఎదుటివారికి ఎలా నో చెప్పాలో నేను నేర్చుకున్నాను. ఇప్పుడు కూడా ఎవరైనా అడిగితే.. సున్నితంగా నాకు అలాంటి భావన లేదని చెప్పేస్తాను అని కూడా అనసూయ వెల్లడించింది.
పుష్ప సినిమాలో తన నెగెటివ్ క్యారెక్టర్ గురించి చెబుతూ.. తాను ఎలాంటి పాత్రకైనా న్యాయం చేస్తానని చెప్పింది. అంతే కాకుండా పుష్ప 2 సంధ్య థియేటర్ ఘటన గురించి చెబుతూ.. అది ఎవరూ కావాలని చేయలేదని చెప్పింది. సినిమా చూడటానికి వెళ్లారు, అనుకోకుండా ఆ ఘటన జరిగింది. అది ఎంతోమందిని బాధకు గురి చేసిందని కూడా చెప్పింది.
ఆడి కారు గిఫ్ట్?
ఇండస్ట్రీలో చాలా రూమర్స్ వస్తుంటాయి. నాకు ఎవరో ఆడి కారు గిఫ్ట్ ఇచ్చినట్లు నేను కూడా చూసాను. కానీ నాకు అది ఎవరూ గిఫ్ట్ ఇవ్వలేదు. నేను, మా ఆయన కాస్తపై ఈఎంఐ కట్టి దానిని కొనుగోలు చేసాము. కరోనా ముందే ఈఎంఐ పూర్తి చేసాము. నేను ఎవరి దగ్గరా ఏమి ఆశించను, నా డబ్బు ఒక్క రూపాయి కూడా వదిలిపెట్టను అని అనసూయ చెప్పింది. ఇక పుష్ప 2 సినిమా తరువాత, ఇంకా రెండు తమిళ సినిమాల్లో నటిస్తున్నట్లు చెప్పింది. అయితే మొత్తం మీద అనసూయ వరుస సినిమాలు చేస్తూ.. చాలా బిజీ అయిపోయింది.
Also Read: పెళ్లి గురించి చెప్పిన జాన్వీ కపూర్.. నాకు కూడా అక్కడే అంటున్న ఖుషి
ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గురించి మాట్లాడుతూ.. చాలా గొప్ప వ్యక్తి అని, సినిమా షూటింగ్ సమయంలో కూడా బుక్స్ చదువుతుంటారని చెప్పింది. ఇప్పుడు రాజకీయాల్లో అదనపు బాధ్యతలు చేపట్టి ప్రజలకు సేవ చేస్తున్నారని అనసూయ చెప్పింది. మొత్తం మీద ఇటీవల ఇంటర్వ్యూలో తన మనసులోని మాటలన్నీ అనసూయ బయటకు చెప్పేసింది.
View this post on Instagram