గోట్ మూవీ ట్రైలర్ లాంచ్.. హీరో సుధీర్ లేకుండానే ఈవెంట్!

సుడిగాలి సుధీర్, దివ్య భారతి జంటగా నటించిన సినిమా గోట్ (గ్రేటెస్ట్ ఆఫ్ ఆల్ టైమ్). మహాతేజ క్రియేషన్స్ మరియు జైష్ణవ్ ప్రొడక్షన్స్ బ్యానర్‌లపై చంద్రశేఖర్ రెడ్డి, బెక్కం వేణుగోపాల్ సంయుక్తంగా నిర్మించారు. లియోన్ జేమ్స్ సంగీతం అందించారు. ఇందులో బ్రహ్మాజీ, తాగుబోతు రమేష్, చమ్మక్ చంద్ర లాంటి వాళ్లు నటించారు. సినిమా ఎప్పుడు రిలీజ్ అవుతుందనేది స్పష్టత లేదు. 2026లో రిలీజ్ అయ్యే అవకాశం ఉందని ఊహగానాలు వినిపిస్తున్నాయి. అయితే ఈ చిత్రానికి సంబంధించిన ట్రైలర్ లాంచ్ ఈవెంట్‌ను మూవీ టీమ్ హైదరాబాద్‌లో నిర్వహించడం జరిగింది.

ఎనర్జెటిక్‌గా సుధీర్!

ట్రైలర్‌లో సుధీర్.. ఫన్ అండ్ ఎనర్జెటిక్‌గా కనిపించాడు. హీరో, హీరోయిన్ మధ్యలో కెమిస్ట్రీ బాగా కుదిరింది. సినిమాలో కావాల్సినంత వినోదం ఉందని ఒక్క ట్రైలర్‌తోనే నిరూపించేశారు. క్రికెట్ నేపథ్యంలో సాగే సీన్స్ యువతని ఆకట్టుకుంటున్నాయి. లియోన్ జేమ్స్ మ్యూజిక్ చిత్రానికి బాగా కలిసోచ్చే అంశంగా చెప్పొచ్చు. దివ్య భారతికి డెబ్యూ పరఫార్మెన్స్ మంచి సక్సెస్ అందించేలా ఉంది.

వాయిదాలు.. వివాదాలు

గోట్ చిత్ర దర్శకుడితో హీరోయిన్‌కు, నిర్మాతకు ఉన్న కొన్ని మనస్ఫర్థల కారణంగా పలుమార్లు షూటింగ్ వాయిదపడుతూ వచ్చింది. సినిమా చిత్రీకరణ సమయంలో డైరెక్టర్ హీరోయిన్‌ను తప్పుగా ఏదో అన్నారని, అప్పుడు సుధీర్ కూడా ఏమి మాట్లాడకుండా నిశ్శబ్దంగా ఉన్నారని హీరోయిన్ బహిరంగంగానే సోషల్ మీడియాలో వ్యక్తపరచడం చర్చనీయాంశం అయింది. దాని తర్వాత అనేకసార్లు ఈ అంశం వారి చిత్రాన్ని ఇబ్బందులకు గురి చేసింది. ఆ తర్వాత డైరెక్టర్‌ను సినిమా నుంచి తప్పించడం.. ఆ స్థానంలో నిర్మాతల పేర్లు వేసుకోవడం కూడా జరిగింది. దాంతో ఈ సినిమాకు దర్శకుడే లేకుండా ప్రమోషన్ చేశారు. అంతే కాకుండా డైరెక్టర్ కొన్ని సీన్స్ బయటకు లీక్ చేశారని కూడా ఆరోపణలు ఉన్నాయి. దీనిపై కేసులు నడుస్తున్నట్టుగా కూడా సమాచారం.

లాంచ్ ఈవెంట్‌లో కనిపించని హీరో

సినిమాకు సంబంధించినంత వరకు సుధీర్ లీడ్ రోల్ చేశారు. కాబట్టి తన సినిమాని తాను ఎంత వీలైతే అంత ఎక్కువ ప్రమోట్ చేసుకోవడానికి చూడాలి. మాములుగా అయితే ఎవరైనా అదే చేస్తారు. కానీ విచిత్రంగా ఇక్కడ సినిమా హీరోనే ట్రైలర్ లాంచ్ ఈవెంట్ రాకపోవడం గమనార్హం. అందరూ కూడా.. ఆశ్చర్యపోవడంతో పాటు, కార్యక్రమంలో ప్రశ్నలన్నీ కూడా ఎక్కువ శాతం ఈ విషయం మీదనే అడగటం మూవీ ప్రమోషన్ కంటే సమస్యలే ఎక్కువ ప్రచారం అయ్యాయని అనిపిస్తుంది. డబ్బింగ్ కూడా వేరే టెక్నాలజీ వాడి సుధీర్ వాయిస్ చెప్పించినట్టు వార్తలు వస్తున్నాయి.

అనుకున్నదానికంటే ఎక్కువ ఖర్చు పెట్టాను!

నిర్మాత చంద్రశేఖర్ రెడ్డి ట్రైలర్ లాంచ్ ఈవెంట్‌లో మాట్లాడుతూ.. ”సుధీర్ ఇది మీ సినిమా, ఈ చిత్రం వల్ల ఆయన కూడా ప్లస్ అవుతుంది. కెరియర్‌లో బిగ్గెస్ట్ మూవీ అవుతుంది. దయచేసి రండి” అని ప్రొడ్యూసర్ హీరోను (సుధీర్) రిక్వెస్ట్ చేశారు. ఇంకా మాట్లాడుతూ.. ఒక బాధ్యత కలిగిన వ్యక్తి, కష్టపడి కిందినుంచి వచ్చిన వ్యక్తి, మంచి ఫ్యామిలీ కూడా అయితే సరిపోతాడు అనే ఉద్యేశంతోనే సుధీర్‌ను హీరోగా ఎంచుకున్నాం. ఎప్పుడు పెట్టని బడ్జెట్ ఈ సినిమాకు పెట్టాము అన్నారు. వారు కూడా అర్థం చేసుకొని త్వరలో మాతో కలిసి వస్తారని అనుకుంటున్నాము, అనుకున్నదానికన్నా అదనంగా కోటి రూపాయలు ఎక్కువ ఖర్చు పెట్టానని చెప్పుకొచ్చారు.