టాటా కార్ల కొనుగోలుపై అద్భుతమైన ఇయర్ ఎండ్ ఆఫర్స్.. తప్పక తెలుసుకోండి!

Tata Motors Year End Offers 2023: దేశీయ వాహన తయారీ దిగ్గజం ‘టాటా మోటార్స్’ (Tata Motors) 2023 ముగియనున్న సందర్భంగా.. 2024 రానున్న తరుణంలో కొత్త కస్టమర్లను ఆకర్శించడానికి మరియు తమ అమ్మకాలను పెంచుకోవడానికి ‘ఇయర్ ఎండ్ ఆఫర్స్’ (Year End Offers) పేరిట మంచి డిస్కౌంట్స్ అందిస్తోంది. దీనికి సంబంధిన మరిన్ని వివరాలు ఈ కథనంలో తెలుసుకుందాం.

టాటా హారియర్ (Tata Harrier)

హారియర్ కొనుగోలుపైన టాటా మోటార్స్ రూ. 1.50 లక్షల డిస్కౌంట్ అందిస్తోంది. ఇటీవల విడుదలైన కొత్త హారియర్ ఫేస్‌లిఫ్ట్ మోడల్ సేల్స్ కోసం ఇప్పటికే ఉన్న ప్రీ-ఫేస్‌లిఫ్ట్ మోడల్స్ ఖాళీ చేయడానికి ఈ ఆఫర్స్ అందిస్తున్నట్లు తెలుస్తోంది.

మార్కెట్లో లభిస్తున్న హారియర్ 2.0 లీటర్ డీజిల్ ఇంజిన్ కలిగి 170 హార్స్ పవర్ అందిస్తుంది. ఇది 6 స్పీడ్ మాన్యువల్ లేదా 6 స్పీడ్ ఆటోమేటిక్‌తో జత చేయబడి ఉత్తమ పనితీరుని అందిస్తుంది. మంచి డిజైన్, అద్భుతమైన ఫీచర్స్ కలిగిన ఈ కారు దేశీయ మార్కెట్లో మహీంద్రా XUV700 5 సీటర్, ఎంజీ హెక్టర్, జీప్ కంపాస్ వంటి వాటికి ప్రధాన ప్రత్యర్థిగా ఉంటుంది.

టాటా సఫారి (Tata Safari)

సఫారీ SUV మీద కూడా కంపెనీ రూ. 1.50 లక్షల వరకు డిస్కౌంట్ అందిస్తోంది. హారియర్ మాదిరిగానే కొన్ని టాటా డీలర్‌షిప్‌లు కూడా ప్రీ-ఫేస్‌లిఫ్ట్ సఫారి యొక్క అమ్ముడుపోని స్టాక్‌లను విక్రయించడానికి ఈ ఆఫర్ అందిస్తున్నట్లు తెలుస్తోంది. సఫారీ కూడా హారియర్ తరహాలోనే అదే పవర్‌ట్రెయిన్ ఎంపికలను పొందుతుంది. ఇది దేశీయ మార్కెట్లో హ్యుందాయ్ ఆల్కజార్, ఎంజీ హెక్టర్ ప్లస్, మహీంద్రా XUV700 వంటి వాటికి ప్రత్యర్థిగా ఉంటుంది.

టాటా టిగోర్ (Tata Tigor)

టిగోర్ కొనుగోలు మీద కంపెనీ రూ. 65000 డిస్కౌంట్ అందిస్తోంది. అయితే ఈ మోడల్ CNG వెర్షన్ మీద రూ. 55000 తగ్గింపు లభిస్తుంది. 1.2 లీటర్ పెట్రోల్ ఇంజిన్ కలిగిన ఈ మోడల్ 5 స్పీడ్ మాన్యువల్ మరియు ఆటోమాటిక్ గేర్‌బాక్స్‌తో జతచేయబడి ఉంటుంది. ఇది 86 హార్స్ పవర్ అందిస్తుంది.

టాటా టిగోర్ CNG మోడల్ 70 హార్స్ పవర్ అందిస్తుంది. ఇందులో మాన్యువల్ గేర్‌బాక్స్‌ ఆప్షన్ మాత్రమే లభిస్తుంది. మంచి డిజైన్, లేటెస్ట్ ఫీచర్స్ కలిగిన ఈ కారు హోండా అమేజ్, మారుతి సుజుకి డిజైర్ మరియు హ్యుందాయ్ ఆరా వంటి వాటికి ప్రత్యర్థిగా ఉంటుంది.

టియాగో (Tata Tiago)

టాటా మోటార్స్ తన టియాగో కొనుగోలుపైన రూ. 60000 వరకు తగ్గింపుని అందిస్తుంది. ఈ డిస్కౌంట్ కేవలం పెట్రోల్ వేరియంట్‌లకు మాత్రమే వర్తిస్తుంది. CNG మోడల్ మీద రూ. 50000 మాత్రమే తగ్గింపు లభిస్తుంది. ఇది కూడా ఉత్తమ ఫీచర్స్ కలిగిన ఈ మోడల్ దేశీయ విఫణిలో మారుతి స్విఫ్ట్, హ్యుందాయ్ గ్రాండ్ ఐ10 నియోస్ వంటి వాటికి ప్రధాన ప్రత్యర్థిగా ఉంటుంది.

ఆల్ట్రోజ్ (Tata Altroz)

టాటా కంపెనీ ఆల్ట్రోజ్ కొనుగోలు చేసేవారికి రూ. 45000 డిస్కౌంట్ అందిస్తుంది. పెట్రోల్, డీజిల్ మరియు CNG మోడల్స్ మీద ఈ తగ్గింపు లభిస్తుంది. ఈ ప్రీమియం హ్యాచ్‌బ్యాక్ 1.2 లీటర్ పెట్రోల్, 1.5 డీజిల్ మరియు 1.2 లీటర్ టర్బో పెట్రోల్ అనే మూడు ఇంజిన్ ఆప్షన్స్ పొందుతుంది. టాటా ఆల్ట్రోజ్ దేశీయ మార్కెట్లో మారుతి సుజుకి బాలెనొ, హ్యుండై ఐ20 మరియు టయోటా గ్లాంజా వంటి వాటికి ప్రత్యర్థిగా ఉంటుంది.

Don’t Miss: బైకులు డీజిల్ ఇంజిన్‌తో ఎందుకు రావో తెలుసా? ఆసక్తికర విషయాలు!

కంపెనీ అందిస్తున్న ఈ ఆఫర్స్ ఒక నగరం నుంచి మరో నగరానికి మారే అవకాశం ఉంటుంది. అంతే కాకుండా స్టాక్ ఉన్నంత వరకు మాత్రమే ఈ డిస్కౌంట్స్ లభిస్తాయి. దీనికి సంబంధించిన మరిన్ని అధికారిక వివరాలు తెలుసుకోవడానికి సమీపంలో ఉన్న కంపెనీ అధీకృత డీలర్షిప్ సందర్శించి తెలుసుకోవచ్చు.