Tata Punch Camo Edition Launched In India: భారతదేశంలో 5 స్టార్ సేఫ్టీ రేటింగ్ పొందిన కార్ల జాబితాలో ఒకటైన టాటా మోటార్స్ యొక్క టాటా పంచ్.. ఎట్టకేలకు ‘క్యామో ఎడిషన్’ పేరుతో దేశీయ విఫణిలో అడుగుపెట్టింది. ఇది ఇప్పటికే మార్కెట్లో ఉన్న ఇతర పంచ్ కార్ల కంటే కూడా ఆకర్షణీయమైన కలర్ ఆప్షన్ పొందుతుంది. దీని గురించి మరిన్ని వివరాలు తెలుసుకోవాలంటే.. ఈ కథనం చదివేయండి.
ఇండియన్ మార్కెట్లో లాంచ్ అయిన కొత్త టాటా పంచ్ క్యామో ఎడిషన్ ప్రారంభ ధర రూ. 8.45 లక్షలు (ఎక్స్ షోరూమ్). ఇది ఆధునిక కాస్మొటిక్ అప్డేట్స్ పొందుతుంది. ఇంటీరియర్ కలర్ పూర్తిగా నలుపు రంగులో ఉండటం చూడవచ్చు.
వేరియంట్స్ వారీగా ధరలు
➢అకాంప్లిస్డ్ ప్లస్: రూ. 8.45 లక్షలు
➢అకాంప్లిస్డ్ ప్లస్ ఏఏంటీ: రూ. 9.05 లక్షలు
➢అకాంప్లిస్డ్ ప్లస్ ఎస్: రూ. 8.95 లక్షలు
➢అకాంప్లిస్డ్ ప్లస్ ఎస్ ఏఎంటీ: రూ. 9.55 లక్షలు
➢అకాంప్లిస్డ్ ప్లస్ సీఎన్‌జీ: రూ. 9.55 లక్షలు
➢అకాంప్లిస్డ్ ప్లస్ ఎస్ సీఎన్‌జీ: రూ. 10.05 లక్షలు
➢క్రియేటివ్ ప్లస్: రూ. 9.15 లక్షలు
➢క్రియేటివ్ ప్లస్ ఏఎంటీ: రూ. 9.75 లక్షలు
➢క్రియేటివ్ ప్లస్ ఎస్: రూ. 9.60 లక్షలు
➢క్రియేటివ్ ప్లస్ ఎస్ ఏఎంటీ: రూ. 10.15 లక్షలు (అన్ని ధరలు ఎక్స్-షోరూమ్, ఇండియా)
టాటా పంచ్ క్యామో ఎడిషన్ 2022లో మొదటిసారి లాంచ్ అయింది. ఇది 2023లో నిలిపివేయబడింది. కాగా ఇప్పుడు పండుగ సీజన్‌ను దృష్టిలో ఉంచుకుని మళ్ళీ లాంచ్ చేయడం జరిగింది. అయితే ఇది కేవలం పరిమిత సంఖ్యలో మాత్రమే అందుబాటులో ఉండనున్నట్లు సమాచారం. అయితే ఎన్ని యూనిట్లు అందుబాటులో ఉంటాయనేది తెలియాల్సి ఉంది. అయితే దీని ధర దాని ఇతర మోడల్స్ కంటే కూడా రూ. 15,000 ఎక్కువ.
కొత్త టాటా పంచ్ క్యామో ఎడిషన్‌లో గమనించదగ్గ ముఖ్యమైన అప్డేట్ ఏమిటంటే.. ఇది కొత్త సివీడ్ గ్రీన్ కలర్ పొందుతుంది. అయితే ఇది డ్యూయెల్ టోన్ షేడ్‌లో ఉంటుంది. అంటే కారు మొత్తం ఒక రంగులో ఉంటే.. రూఫ్ మాత్రం మరో రంగులో ఉంటుంది. అల్లాయ్ వీల్స్ ముదురు రంగులో 16 ఇంచెస్ వరకు ఉన్నాయి. ఫ్రంట్ ఫెండర్ మీద ‘క్యామో’ బ్యాడ్జింగ్ చూడవచ్చు.
ఇంటీరియర్ డిజైన్ మొత్తం నలుపు రంగులో ఉంటుంది. సీట్ అపోల్స్ట్రే మరియు డోర్ ప్యాడ్ మీద క్యామో గ్రాఫిక్స్ ఉండటం చూడవచ్చు. డోర్ హ్యాండిల్స్ కూడా బ్లాక్ కలర్ పొందుతాయి. కాబట్టి ఎక్స్టీరియర్ మరియు ఇంటీరియర్ డిజైన్ మొత్తం చాలా అద్భుతంగా ఉన్నట్లు తెలుస్తోంది. ఈ కారులో 10.25 ఇంచెస్ టచ్‌స్క్రీన్, సెమీ డిజిటల్ డ్రైవర్ డిస్‌ప్లే, ఏసీ వెంట్స్, వైర్‌లెస్ ఫోన్ ఛార్జర్ వంటివన్నీ ఉన్నాయి.
టాటా పంచ్ అంటేనే డిజైన్, ఫీచర్స్ కంటే కూడా సేఫ్టీ గుర్తొస్తుంది. కాబట్టి ఇందులో డ్యూయెల్ ఫ్రంట్ ఎయిర్‌బ్యాగ్‌లు, ఏబీఎస్ విత్ ఈబీడీ, రియర్ పార్కింగ్ కెమెరా, రియర్ పార్కింగ్ సెన్సార్లు మొదలైనవన్నీ ఉన్నాయి. ఇవన్నీ ప్రయాణికుల భద్రతకు పెద్దపీట వేస్తాయి. ఇది కూడా స్టాండర్డ్ పంచ్ కారు మాదిరిగానే మంచి సేఫ్టీ అందిస్తుందని భావిస్తున్నాము.
ఇంజిన్ వివరాలు
టాటా పంచ్ క్యామో ఎడిషన్ పెట్రోల్ మరియు సీఎన్‌జీ ఎంపికలలో అందుబాటులో ఉంది. ఇందులోని 1.2 లీటర్ 3 సిలిండర్ న్యాచురల్లీ ఆస్పిరేటెడ్ పెట్రోల్ ఇంజిన్ 88 హార్స్ పవర్ అందిస్తుంది. సీఎన్‌జీ ఇంజిన్ 74 హార్స్ పవర్ ప్రొడ్యూస్ చేస్తుంది. పెట్రోల్ ఇంజిన్ మాన్యువల్ మరియు ఆటోమాటిక్ గేర్‌బాక్స్ ఆప్షన్ పొందుతుంది. సీఎన్‌జీ మోడల్ కేవలం మాన్యువల్ గేర్‌బాక్స్‌తో మాత్రమే లభిస్తుంది.
Don’t Miss: పండుగ సీజన్‌లో నిస్సాన్ ప్రభంజనం: రూ.5.99 లక్షలకే కొత్త కారు
కొత్త టాటా పంచ్ క్యామో ఎడిషన్.. హ్యుందాయ్ ఎక్స్‌టర్, సిట్రోయెన్ సీ3, మారుతి ఫ్రాంక్స్, టయోటా టైసర్ వంటి వాటికి ప్రత్యర్థిగా ఉంటుంది. కాబట్టి ఇది అమ్మకాల పరంగా కొంత పోటీ ఎదుర్కోవాల్సి ఉంటుందని భావిస్తున్నాము. అయితే పంచ్ గొప్ప సేఫ్టీ ఫీచర్స్ కలిగి.. ఇప్పుడు కొత్త రంగులో అందుబాటులో ఉంది కాబట్టి మంచి అమ్మకాలను పొందుతుందని ఆశిస్తున్నాము.