ప్రస్తుతం సోషల్ మీడియాలో బాగా ట్రెండ్ అవుతున్న పేరు రష్మిక మందన్న. విజయ్ దేవరకొండతో రహస్యంగా నిశ్చితార్థం చేసుకున్నారనే గుసగుసలు వినపడిన తరువాత వీరిరువురి పేరు గట్టిగా వినిపిస్తోంది. నిశ్చితార్థం విషయం గురించి రష్మిక, విజయ ఇప్పటివరకు స్పందిచకపోగా.. ఎవరిపనిలో వారు నిమగ్నమై ఉన్నారు. ఇలాంటి సమయంలో.. కన్నడ పరిశ్రమ రష్మికను నిషేధించిందా? అనే వార్తపై నేషనల్ క్రష్ స్పందించింది.
కన్నడ పరిశ్రమ నిషేదించిందా?
నటి రష్మిక మందన్న ఈ రోజు నేషనల్ క్రష్ అని పాపులారిటీ పొందొచ్చు, పాన్ ఇండియా సినిమాల్లో నటించనూ వచ్చు.. కానీ ఈమె మూలాలు కన్నడ పరిశ్రమ నుంచి వచ్చాయని బహుశా చాలామందికి తెలియకుండా ఉండొచ్చు. అంటే ఈమె సినిమా అరంగేట్రం కన్నడ పరిశ్రమ నుంచే మొదలైంది. అయితే ఇప్పుడు కన్నడ సినిమా పరిశ్రమకు రష్మిక దూరంగా ఉందా?, లేక కన్నడ సినిమా పరిశ్రమే ఈమెను దూరంగా ఉంచిందా? అనేది చాలామందిలో మెదులుతున్న ప్రశ్న.
ఇకపోతే.. భారతదేశంలోని అత్యధిక పారితోషికం తీసుకునే నటీమణులలో ఒకరైన రష్మిక ప్రస్తుతం ‘థామా’ సినిమా ప్రమోషన్స్ చేస్తోంది. ఇలాంటి సమయంలో కన్నడ పరిశ్రమ మిమ్మల్ని దూరంగా ఉంచిందా అనే ప్రశ్నకు.. ఇంటర్వ్యూ లో స్పందించింది. ఇటీవల విడుదలైన కాంతారా చాప్టర్-1 సినిమాపై ఈమె స్పందించకపోవడంతో ఈ రూమర్ పుట్టింది. తెరవెనుక ఏమి జరుగుతోంది చాలామందికి తెలియదని రష్మిక పేర్కొన్నారు.
డౌట్ క్లియర్ చేసిన రష్మిక మందన్న
ఏ సినిమా అయినా.. రిలీజ్ అయిన రెండు మూడు రోజులు నేను చూడలేను. ఆ తరువాత చూస్తాను. ఇలాగే కాంతారా చాప్టర్-1 సినిమా కూడా చూశాను. సినిమా చాలాబాగుందని చిత్ర బృందాన్ని అభినందించాను. వారు కూడా నాకు థాంక్స్ చెప్పారు. చాలా విషయాలను నేను సోషల్ మీడియాలో షేర్ చేయను. ఇందులో కొన్ని వ్యక్తిగత విషయాలు కూడా ఉన్నాయి. అయితే ఇలాంటి విషయాల్లో ఎవరు ఏమనుకున్నా నేను పెద్దగా పట్టించుకోను. నా సినిమా గురించి, నటన గురించి మాత్రమే పట్టించుకుంటానని రష్మిక మందన్న స్పష్టం చేశారు.
ఇక కన్నడ పరిశ్రమ నిషేదించిందా? అనే ప్రశ్నకు సమాధానం ఇస్తూ.. నన్ను ఏ సినిమా ఇండస్ట్రీ నిషేధించలేదు. అవన్నీ ఒట్టి పుకార్లు మాత్రమే. ఇలాంటివన్నీ పట్టించుకోకూడదు, ఇతరుల కోసం జీవించడం ఆపేయాలని రష్మిక క్లారిటీ ఇచ్చింది. కొన్ని అపార్దాల వల్లనే రూమర్స్ పుట్టుకొస్తాని ఆమె అన్నారు. మొత్తానికి చాలామందికి ఉన్న ఒక పెద్ద డౌట్ రష్మిక క్లియర్ చేసింది.
థామా విషయానికి వస్తే
రష్మిక మందన్న నటించిన.. త్వరలో థియేటర్లలో విడుదలకానున్న సినిమా థామా. ఈ సినిమా అక్టోబర్ 21న రిలీజ్ కానుంది. ఈ మూవీలో ఆయుష్మాన్ ఖురానా, సత్యరాజ్, వరుణ్ ధావన్, మలైకా అరోరా, నోరా ఫతేహి వంటి దిగ్గజ నటులు కూడా నటిస్తున్నారు. ఇది రొమాంటిక్ హర్రర్ మూవీ. మాడ్డాక్ ఫిల్మ్స్ బ్యానర్‌పై దినేష్ విజన్, అమర్ కౌశిక్ నిర్మిస్తున్నారు. ఈ సినిమాకు ఆదిత్య సర్పోత్దార్ దర్శకత్వం వహిస్తున్నారు. ఇప్పటికే ఈ సినిమాకు సంబంధించిన టీజర్, పాటలు అన్నీ కూడా రిలీజ్ అయ్యాయి.