తరుణ్ భాస్కర్, ఈషా రెబ్బా జంటగా నటిస్తున్న చిత్రం ఓం శాంతి శాంతి శాంతిః. ఏఆర్ సజీవ్ ఈ సినిమాతో దర్శకుడిగా పరిచయం అవుతున్నారు. 2026 జనవరి 23వ తేదీనఈ చిత్రాన్ని థియేటర్లలో విడుదల చేయనున్నట్టు మూవీ టీమ్ ప్రకటించింది. ఇందులో బ్రహ్మాజీ ముఖ్య పాత్రలో కనిపించనున్నారు. కాగా హైదరాబాద్‌లో డిసెంబర్ 08న ట్రైలర్ లాంచ్ ఈవెంట్ నిర్వహించి, ట్రైలర్‌ను రిలీజ్ చేశారు.
గ్రామీణ కుటుంబ నేపథ్యంలో..
ఓం శాంతి శాంతి శాంతిః సినిమా ఇంతక ముందే మలయాళం చిత్ర పరిశ్రమలో జయ జయ జయహే అనే పేరుతో విడుదల అయింది. ఓటీటీ తెలుగు వాళ్లకి కూడా నేటికీ అందుబాటులో ఉంది. అందరి మన్ననలు పొంది మంచి విజయాన్ని సొంతం చేసుకునింది. పెళ్లైన తరువాత భార్య భర్తల మధ్య సంబంధాలు, కుటుంబం వ్యవస్థ, పితృస్వామిక విధానం, మహిళ స్వేచ్ఛ, తిరుగుబాటు తత్వం.. ఇవన్నీ కలగలిపి చాలా అద్భుతంగా తీశారు. ఇప్పుడు ఈ సినిమానే ‘ఓం శాంతి శాంతి శాంతిః’ అనే పేరుతో తెలుగులో రిమేక్ చేస్తున్నారు. అయితే రీమేక్‌లో ఉన్నది ఉన్నటు కాకుండా కథలో చాలా వరకు మార్పులు చేసి తెలుగు ప్రాంతానికి చెందిన వారికి నచ్చే విధంగా తీసారట. ఇదొక గ్రామీణ కుటుంబ నేపథ్యంలో సాగే కథ. మ్యారేజ్ తరువాత భార్య భర్తల మధ్య ఉండే సంబంధాలానే ఆసక్తికరంగా చూపించనున్నారు.
దర్శకుడు, నటుడిగా..
దర్శకుడిగా పెళ్లి చూపులు, ఈ నగరానికి ఏమైంది..? కీడా కోలా అనే చిత్రాలు తరుణ్ భాస్కర్ చేశారు. అవన్నీ కూడా అటు డబ్బులు పరంగా, ఇటు ప్రేక్షకులను మెప్పించడంలోనూ విజయం సాధించాయి. అయితే ఆ తరువాత ఫలక్నామా దాస్, మహానటి, కీడా కోలా, సీతారామం, మీకు మాత్రమే చెబుతా (ఈ చిత్రంలో కథానాయకుడు పాత్ర) ఇలాంటి అనేక సినిమాలలో ఆయన నటించారు. దర్శకుడుగానే కాకుండా.. నటుడుగా కూడా మంచి పేరు తెచ్చుకున్నాడు. ఇప్పుడు మరోసారి కథానాయకుడిగా హీరోయిన్ ఈషా రెబ్బాతో కలిసి నటిస్తున్నారు.
ఇది రిమేక్ అయినప్పటికీ తరుణ్ భాస్కర్, ఈషా రెబ్బాలకు నటన పరంగా ఇది కొత్తదనం ఇస్తుంది. దీనికోసం కథ, కథనంలో మార్పులు చేశారు. కాబట్టి.. ప్రేక్షకులకు ఆకట్టుకుంటుంది. ట్రైలర్‌లో ఇద్దరి కెమిస్ట్రీ బాగా కుదిరింది. కామెడీ, ఫన్, ఎమోషన్లతో భార్యభర్తలుగా మెప్పించారనే అనిపిస్తోంది. బ్రాహ్మజీ కూడా తోడవడం సినిమాకీ ప్లస్ అయింది.
రిపోర్టర్ కాళ్లు మొక్కి సారీ చెప్పి
ట్రైలర్ లాంచ్ సందర్బంగా మీడియాతో క్వశ్చన్ అండ్ ఆన్సర్ కార్యక్రమం నిర్వహించారు. ఇందులో భాగంగా ఒక జర్నలిస్ట్ తరుణ్ భాస్కర్‌ను ప్రశ్న అడగబోతుండగా.. రిపోర్టర్ మాటలు పూర్తికాక ముందే మధ్యలో తరుణ్ కలగజేసుకొని సరదాగా అడ్వాన్స్ క్రిస్మస్ డే చెప్పాడు. దీంతో ఆ జర్నలిస్ట్ మనసు నొచ్చుకునింది. దాంతో మీరు ఇలా చేయడం కరెక్ట్ కాదు, అని కాసేపు వారిద్దరికీ మాటమాటా పెరిగింది. ఆ తరువాత తరుణ్ భాస్కర్ వేదిక కిందికి దిగివచ్చి రిపోర్టర్ కాళ్లకు నమస్కారం చేసి నన్ను క్షమించండి సార్ మీరు ఫీల్ అవ్వద్దండి. దీన్ని సీరియస్ తీసుకోవద్దు అన్నాడు. అక్కడితో ఆ సమస్య సద్దుమనిగిపోయింది. మళ్లీ కార్యక్రమం యథావిధిగా కొనసాగింది. ట్రైలర్ చాలా బాగా వచ్చింది. “ఓం శాంతి శాంతి శాంతిః” తరుణ్ భాస్కర్‌ను , ఈషా రెబ్బాకు మంచి విజయాన్ని, గుర్తింపుని తీసుకొచ్చే విధంగా ఉందని భావిస్తున్నాము.