దేశంలోని 5 బెస్ట్ ఆఫ్ రోడర్ కార్లు: ధర & పూర్తి వివరాలు

ఆటోమొబైల్ పరిశ్రమలో వేగంగా అభివృద్ధి చెందుతున్న భారతదేశంలో.. ఎస్‌యూవీలు, ఎంపీవీలు, హ్యాచ్‌బ్యాక్‌లు, ఆఫ్ రోడర్స్ వంటివన్నీ అందుబాటులో ఉన్నాయి. మార్కెట్లో సాధారణ కార్లకు డిమాండ్ ఉన్నట్టే.. ఆఫ్ రోడర్ కార్లను కోరుకునేవారు సంఖ్య కూడా కొంత ఎక్కువగానే ఉంది. మనం ఈ కథనంలో ఆఫ్ రోడింగ్ ప్రియులకు ఎంతగానే ఇష్టమైన 5 కార్లను గురించి వివరంగా తెలుసుకుందాం.

మహీంద్రా థార్

ఆఫ్ రోడర్ అంటే ముందుగా గుర్తొచ్చేది.. మహీంద్రా అండ్ మహీంద్రా కంపెనీకి చెందిన థార్. ఇది ఇండియన్ మార్కెట్లో లాంచ్ అయినప్పటి నుంచి.. ఇంకా చెప్పాలంటే మార్కెట్లో లాంచ్ కాకముందు నుంచే దీనికి ఫుల్ డిమాండ్ ఉంది. కఠినమైన ఆఫ్ రోడింగ్ సామర్థ్యం కలిగిన ఈ కారు.. కఠినమైన రోడ్ల మీద కూడా సజావుగా ముందుకు సాగుతుంది. ఈ కారణంగానే చాలామంది దీనిని ఇష్టపడి కొనుగోలు చేస్తున్నారు. 4×4 సామర్థ్యం కలిగిన ఈ ఆఫ్ రోడర్ కారు ధర రూ. 9.99 లక్షల నుంచి రూ. 16.99 లక్షల (ఎక్స్ షోరూమ్) మధ్య ఉంటుంది. అయితే కంపెనీ ఈ కారును ఎలక్ట్రిక్ రూపంలో లాంచ్ చేయడానికి సిద్ధమవుతోంది. ఇది ఎప్పుడు లాంచ్ అవుతుందనే విషయం తెలియాల్సి ఉంది.

ఫోర్స్ గూర్ఖా

బెస్ట్ ఆఫ్ రోడర్ల జాబితాలో మరో మోడల్ ఫోర్స్ కంపెనీకి చెందిన గూర్ఖా. దీని ధరలు రూ. 15 లక్షల నుంచి రూ. 18 లక్షల మధ్య ఉన్నాయి. ఇది కూడా కఠినమైన భూభాగాల్లో సైతం అద్భుతమైన పనితీరును అందిస్తుంది. డిజైన్, ఫీచర్స్ బాగుంటాయి. మెకానికల్ డిఫరెన్షియల్ లాక్స్, కొంత ఎక్కువ గ్రౌండ్ క్లియరెన్స్ కూడా పొందుతుంది. వాటర్ వాడింగ్ కెపాసిటీ కూడా మంచిగా ఉంటుంది. ఇది ప్రస్తుతం 3 డోర్స్, 5 డోర్స్ రూపాల్లో మార్కెట్లో అమ్మకానికి అందుబాటులో ఉంది. అమ్మకాల్లో థార్ కారుకు ప్రధాన ప్రత్యర్థి కూడా.

ఇసుజు డీ-మ్యాక్స్ వీ-క్రాస్

థార్, గూర్ఖా మాత్రమే కాకుండా ఇసుజు కంపెనీకి చెందిన డీ-మ్యాక్స్ కూడా ఈ విభాగంలో ఎక్కువమందిని ఆకట్టుకున్న ఆఫ్ రోడర్. ఇది పికప్ స్టైల్ మోడల్. పరిమాణంలో పెద్దదిగా ఉన్నప్పటికీ.. పనితీరు అదే విధంగా ఉంటుంది. దీని ధరలు రూ. 23 లక్షల నుంచి రూ. 27 లక్షల (ఎక్స్ షోరూమ్) మధ్య ఉంది. ల్యాడర్ ఫ్రేమ్, 4×4 సిస్టం కలిగిన ఈ కారు డీజిల్ ఇంజిన్ పొందుతుంది. ఇది కఠినమైన భూభాగంలో కూడా సజావుగా ముందుగా సాగుతుంది.

మహీంద్రా స్కార్పియో ఎన్

ఆఫ్ రోడర్ విభాగంలో మరో చెప్పుకోదగ్గ మహీంద్రా కారు స్కార్పియో ఎన్ 4×4. రూ. 16.2 లక్షల నుంచి రూ. 24.5 లక్షల (ఎక్స్ షోరూమ్) మధ్య ధరతో లభించే ఈ కారు.. టెర్రైన్ మోడ్స్, మంచి గ్రౌండ్ క్లియరెన్స్ పొందుతుంది. పరిమాణంలో కొంత పెద్దదిగా ఉన్నప్పటికీ.. రోజువారీ వినియోగానికి, లాంగ్ డ్రైవ్ చేయడానికైనా ఇది చాలా ఉపయోగకరంగా ఉంటుంది. డిజైన్ పరంగా, ఫీచర్స్ పరంగా కూడా ఇది చాలా ఉత్తమంగా ఉంటుంది.

టయోటా ఫార్చ్యూనర్

రూ. 33.6 లక్షల నుంచి రూ. 51.9 లక్షల (ఎక్స్ షోరూమ్) మధ్య ధర వద్ద అందుబాటులో ఉన్న టయోటా కంపెనీకి చెందిన ఫార్చ్యూనర్ కూడా మంచి ఆఫ్ రోడర్ కార్లలో ఒకటి. 4×4 వ్యవస్థకు ప్రసిద్ధి చెందిన ఈ కారు.. ట్రాక్షన్ కంట్రోల్ సిస్టం, అద్భుతమైన పనితీరును అందిస్తుంది. పైన చెప్పుకున్న కార్ల కంటే దీని ధర కొంత ఎక్కువే అయినప్పటికీ ఫ్యామిలీ కారుగా కూడా ఇది పనికొస్తుంది. మల్టిపుల్ ఇంజిన్ ఎంపికలో అందుబాటులో ఉండే ఈ కారు.. మల్టిపుల్ డ్రైవింగ్ మోడ్స్ పొందుతుంది.