Top 5 Car Launches in 2024 August: 2024 ప్రారంభమై దాదాపు ఏడు నెలలు కావొస్తోంది. ఏడాది ప్రారంభం నుంచి లెక్కకు మించిన కార్లు, బైకులు దేశీయ మార్కెట్లో లాంచ్ అవుతూనే ఉన్నాయి. ఈ నెలలో కూడా బజాజ్ ఫ్రీడమ్ 125 బైక్, హ్యుందాయ్ ఎక్స్‌టర్ సీఎన్‌జీ, పోర్స్చే ఎలక్ట్రిక్ కార్లు మొదలైనవి లాంచ్ అయ్యాయి. కాగా వచ్చే నెలలో కూడా కంపెనీ మరికొన్ని కార్లను లాంచ్ చేయడానికి సన్నద్ధమవుతోంది. ఈ కథనంలో 2024 ఆగష్టు నెలలో దేశీయ విఫణిలో లాంచ్ అయ్యే కార్లను గురించి మరిన్ని వివరాలు ఈ కథనంలో తెలుసుకుందాం.
నిస్సాన్ ఎక్స్-ట్రైల్ (Nissan X-Trail)
భారతదేశంలో ప్రస్తుతం కేవలం ఒక కారును (నిస్సాన్ మాగ్నైట్) మాత్రమే విక్రయిస్తున్న నిస్సాన్ త్వరలో ఎక్స్-ట్రైల్ పేరుతో 7 సీటర్ కారును లాంచ్ చేయడానికి సిద్ధమవుతోంది. కంపెనీ ఈ కారును ఆగష్టు 1న అధికారికంగా దేశీయ విఫణిలో లాంచ్ చేయనుంది. ఇది సీబీయూ మార్గం ద్వారా ఇండియాలోకి రానుంది. కాబట్టి దీని ధర కొంత ఎక్కువగానే ఉంటుందని తెలుస్తోంది. ఈ కారు ధర రూ. 40 నుంచి రూ. 45 లక్షల మధ్య ఉంటుందని సమాచారం. అయితే అధికారిక ధరలు ఆగష్టు 1న వెల్లడవుతాయి.
ఆగష్టు 1న లాంచ్ కానున్న కొత్త నిస్సాన్ ఎక్స్-ట్రైల్ ఆకర్షణీయమైన డిజైన్ కలిగి మూడు కలర్ (డైమండ్ బ్లాక్, పెర్ల్ వైర్ మరియు షాంపైన్ సిల్వర్) ఆప్షన్లలో లభిస్తుంది. ఈ కారు ఎల్ఈడీ లైటింగ్ పొందే అవకాశం ఉంది. ఇది 8 ఇంచెస్ టచ్‌స్క్రీన్ ఇన్ఫోటైన్‌మెంట్ సిస్టం మరియు 12.3 ఇంచెస్ డ్రైవర్ ఇన్ఫర్మేషన్ డిస్‌ప్లే మొదలైనవి పొందనున్నట్లు సమాచారం.
కొత్త నిస్సాన్ ఎక్స్-ట్రైల్ కారు 1.5 లీటర్ త్రీ సిలిండర్ టర్బో పెట్రోల్ ఇంజిన్ పొందనున్నట్లు సమాచారం. ఇది 163 బీహెచ్‌పీ పవర్, 300 ఎన్ఎమ్ టార్క్ అందిస్తుంది. ఇది సీవీటీ గేర్‌బాక్స్‌తో జతచేయబడి ఉంటుంది. ఈ కారు మార్కెట్లో లాంచ్ అయిన తరువాత ఎంజీ గ్లోస్టర్, స్కోడా కొడియాక్ వంటి కార్లకు ప్రధాన ప్రత్యర్థిగా ఉంటుంది.
సిట్రోయెన్ బసాల్ట్ (Citroen Basalt)
ప్రముఖ ఫ్రెంచ్ కార్ల తయారీ సంస్థ సిట్రోయెన్ ఆగష్టు 7న ‘బసాల్ట్’ పేరుతో సరికొత్త కారును లాంచ్ చేయడానికి సర్వత్రా సిద్ధమైంది. అంతంకంటే ముందు ఆగష్టు 2న ఈ కారును కంపెనీ ఆవిష్కరించే అవకాశం ఉంది. ఈ కారు ఇప్పటికే మార్కెట్లో విక్రయించబడుతున్న సిట్రోయెన్ సీ3 ఎయిర్‌క్రాస్ ఆధారంగా రూపొందించబడుతున్నట్లు తెలుస్తోంది. కాబట్టి చూడటానికి సీ5 ఎయిర్‌క్రాస్ మాదిరిగానే అనిపిస్తుంది.
సిట్రోయెన్ కంపెనీ లాంచ్ చేయనున్న కొత్త బసాల్ట్ కారు మంచి డిజైన్ కలిగి, ఆధునిక కాలంలో ఉపయోగించడానికి చాలా అనుకూలంగా ఉంటుందని ఫోటోలను చూస్తేనే అర్థమవుతోంది. ఈ కారు 1.2 లీటర్ పెట్రోల్ ఇంజిన్ పొందనున్నట్లు సమాచారం. కాగా బసాల్ట్ ధరలు ఎలా ఉంటాయి? బుకింగ్స్ ఎప్పుడు ప్రారంభమవుతాయి? ఆ తరువాత డెలివరీలు ఎప్పుడు అనే వివరాలు త్వరలోనే తెలుస్తాయి.
టాటా కర్వ్ (Tata Curvv)
దేశీయ దిగ్గజం టాటా మోటార్స్ ఆగష్టు 7న తన కర్వ్ కూపేను అధికారికంగా లాంచ్ చేయనుంది. కూపే వంటి డిజైన్ కలిగిన ఈ కారు వాహన ప్రియులను తప్పకుండా ఆకర్షిస్తుంది. మంచి డిజైన్ కలిగిన టాటా కర్వ్ ఎల్ఈడీ హెడ్‌లైట్స్, టెయిల్ లైట్స్ మరియు 17 ఇంచెస్ అల్లాయ్ వీల్స్ పొందుతుంది. లోపల 10.25 ఇంచెస్ టచ్‌స్క్రీన్ ఇన్ఫోటైన్‌మెంట్ సిస్టం ఉండే అవకాశం ఉంది. దీని పరిమాణం ఎంచుకునే వేరియంట్ మీద ఆధారపడి ఉంటుంది. ఈ కారులో చాలా వరకు లేటెస్ట్ ఫీచర్స్ ఉండనున్నాయి.
త్వరలో లాంచ్ కానున్న కొత్త టాటా కర్వ్ కారు ఐసీఈ మరియు ఎలక్ట్రిక్ పవర్‌ట్రెయిన్‌లతో లభించే అవకాశం ఉంది. ఐసీఈ వేరియంట్ 125 పీఎస్ పవర్ మరియు 225 ఎన్ఎమ్ టార్క్ అందిస్తుంది. ఎలక్ట్రిక్ వేరియంట్ 55 కిలోవాట్ బ్యాటరీ ప్యాక్ ద్వారా సింగిల్ చార్జితో 550 కిమీ రేంజ్ అందిస్తుందని తెలుస్తోంది. దీనికి సంబంధించిన మరిన్ని వివరాలు అధికారికంగా తెలియాల్సి ఉంది.
మహీంద్రా థార్ 5 డోర్ లేదా థార్ ఆర్మడ (Mahindra Thar 5 Door / Thar Armada)
భారతదేశంలో ప్రారంభం నుంచి అత్యంత ప్రజాదరణ పొందుతున్న మహీంద్రా థార్ ఆగష్టు 15న 5 డోర్స్ వెర్షన్ రూపంలో లాంచ్ కానుంది. దీనినే థార్ ఆర్మడ అని కూడా పిలుస్తారు. చూడటానికి సాధారణ థార్ మాదిరిగా కనిపించినప్పటికీ.. ఇది పరిమాణంలో కొంత పెద్దదిగా ఉంటుంది. ఇది రీ డిజైన్ చేయబడిన ఫ్రంట్ ఫాసియాను కలిగి ఉంటుంది.
మహీంద్రా థార్ ఆర్మడ ఆధునిక ఫీచర్స్ పొందుతుంది. ఇందులో 360 డిగ్రీ కెమెరా, రియర్ వెంట్‌లతో క్లైమేట్ కంట్రోల్, టచ్‌స్క్రీన్ ఇన్ఫోటైన్‌మెంట్ సిస్టం, డిజిటల్ ఇన్స్ట్రుమెంట్ క్లస్టర్, కనెక్టెడ్ కార్ టెక్నాలజీ మరియు లెవెల్ 2 ఏడీఏఎస్ వంటివి ఉండనున్నాయి. ఈ కారు 2.0 లీటర్ పెట్రోల్ మరియు 2.2 లీటర్ డీజిల్ ఇంజిన్ ఆప్షన్స్ పొందుతుంది. ఇంజిన్ మాన్యువల్ మరియు ఆటోమాటిక్ ట్రాన్స్‌మిషన్ ఎంపికలను పొందుతుంది.
నాల్గవ తరం మారుతి సుజుకి డిజైర్ (Fourth Zen Maruti Suzuki Dzire)
ఇక చివరగా వచ్చే నెలలో లాంచ్ అయ్యే కార్లలో మారుతి సుజుకి నాల్గవ తరం డిజైర్ కూడా ఒకటి. ఇది చూడటానికి స్టాండర్డ్ మోడల్ డిజైర్ మాదిరిగా ఉన్నప్పటికీ.. చాలా వరకు అప్డేట్ అయి ఉంటుంది. ఇందులో రీ డిజైన్ హెడ్‌లైట్స్, కొత్త ఫ్రంట్ గ్రిల్, బంపర్ మరియు ఫాగ్‌లాంప్ వంటివి ఉంటాయి. ఇది ఆగష్టు చివరి నాటికి మార్కెట్లో అధికారికంగా లాంచ్ అయ్యే అవకాశం ఉంది.
Don’t Miss: మహీంద్రా థార్‌తో దుమ్ములేపిన హీరోయిన్.. ఆఫ్-రోడింగ్ అయినా తగ్గేదేలే
త్వరలో లాంచ్ కానున్న కొత్త మారుతి సుజకి డిజైర్ ఫ్లోటింగ్ టచ్‌స్క్రీన్ ఇన్ఫోటైన్‌మెంట్ సిస్టం, సింగిల్ పేన్ ఎలక్ట్రిక్ సన్‌రూఫ్ వంటివి పొందనున్నట్లు సమాచారం. ఈ కారు 1.2 లీటర్ 3 సిలిండర్ న్యాచురల్లీ ఆస్పిరేటెడ్ ఇంజిన్ కలిగి 5 ప్రొసీడ్ మాన్యువల్ గేర్‌బాక్స్ ఆప్షన్స్ పొందనుంది. కంపెనీ ఈ కారును భవిష్యత్తులో CNG రూపంలో మరియు స్ట్రాంగ్ హైబ్రిడ్ రూపంలో కూడా లాంచ్ చేసే అవకాశం ఉన్నట్లు సమాచారం.