Top 5 Things You Need To Know About The New BYD Sealion 7: భారత్ మొబిలిటీ గ్లోబల్ ఎక్స్‌పో 2025లో కనిపించిన ‘బీవైడీ సీలియన్ 7’ (BYD Sealion 7) ఎలక్ట్రిక్ కారు ఎట్టకేలకు మార్కెట్లో అధికారికంగా లాంచ్ అయింది. దేశీయ విఫణిలో అడుగుపెట్టిన ఈ కారును కొనాలనుకునే కస్టమర్లు తప్పకుండా 5 విషయాలను తెలుసుకోవాల్సి ఉంటుంది. ఈ కథనంలో ఆ ఐదు విషయాలను వివరంగా తెలుసుకుందాం.
1. ధర మరియు వేరియంట్స్
బీవైడీ సీలియన్ 7 ఎలక్ట్రిక్ కారు రెండు వేరియంట్లలో మాత్రమే లభిస్తుంది. అవి ప్రీమియం (రూ. 48.90 లక్షలు), పెర్ఫామెన్స్ (రూ. 54.90 లక్షలు). కంపెనీ ఈ ఎలక్ట్రిక్ కారు కోసం బుకింగ్స్ స్వీకరించడం ప్రారంభించింది. డెలివరీలు మార్చి మధ్యలో ప్రారంభమయ్యే అవకాశం ఉంది. అయితే ఇప్పటికే ఈ ఎలక్ట్రిక్ కారు కోసం సంస్థ 1000 కంటే ఎక్కువ ఆర్డర్స్ స్వీకరించినట్లు తెలుస్తోంది. (అన్ని ధరలు ఎక్స్ షోరూమ్).
2. డిజైన్
బీవైడీ సీలియన్ 7 ఎలక్ట్రిక్ కారు.. చూడటానికి కొంత బీవైడీ సీల్ మాదిరిగా ఉన్నప్పటికీ, పరీక్షగా గమనిస్తే.. ఇది సరికొత్త మోడల్ అని అర్థమవుతుంది. ఫ్రంట్ ఫాసియా యాంగ్యులర్ హెడ్‌ల్యాంప్.. డీఆర్ఎల్‌తో కలిస్తుంది. ఇవి యాంగ్యులర్ హెడ్‌ల్యాంప్ క్లస్టర్‌ల వెలుపల దిగువ వరకు విస్తరించి ఉంటాయి. వీల్ ఆర్చ్‌ల చుట్టూ క్లౌడింగ్.. రూఫ్‌లైన్ వాలుగా కూపే మాదిరిగా ఉంటుంది. రియర్ విండ్‌స్క్రీన్ కింద ఉన్న చిన్న బూట్ డెక్ కూడా ఇక్కడ గుర్తించదగిన మరో అంశం. వెనుక మొత్తం వెడల్పు అంతటా విస్తరించి ఉండే టెయిల్ లైట్.. రియర్ డిఫ్యూజర్‌ను కూడా పొందుతుంది.
3. ఫీచర్స్
కారు గురించి తెలుసుకోవాలంటే.. తప్పకుండా ఫీచర్స్ గురించి తెలుసుకోవాల్సిందే. కాబట్టి బీవైడీ సీలియన్ 7 ఎలక్ట్రిక్ కారులో 15.6 ఇంచెస్ రొటేటింగ్ టచ్‌స్క్రీన్ మరియు 10.25 ఇంచెస్ డిజిటల్ ఇన్‌స్ట్రుమెంట్ క్లస్టర్ ఉంటాయి. ఇవి మాత్రమే కాకుండా.. ఏసీ వెంట్స్ టచ్‌స్క్రీన్ కింద ఉండటం చూడవచ్చు. పవర్ అడ్జస్టబుల్ డ్రైవర్ సీటు, డ్యూయెల్ జోన్ క్లైమేట్ కంట్రోల్, యాంబియంట్ లైటింగ్, హెడ్స్ ఆప్ డిస్‌ప్లే, పవర్ అడ్జస్టబుల్ ప్యాసింజర్ సీటు, వెంటిలేటెడ్ ఫ్రంట్ సీటు, పనోరమిక్ గ్లాస్ రూఫ్, ఫ్లష్ డోర్ హ్యాండిల్స్, వైర్‌లెస్ ఫోన్ ఛార్జర్ 12 స్పీకర్ ఆడియో సిస్టమ్ వంటివి ఉన్నాయి.
ఇక సేఫ్టీ ఫీచర్స్ విషయానికి వస్తే.. ఇందులో అడాప్టివ్ క్రూయిజ్ కంట్రోల్, ఫార్వర్డ్ అండ్ రియర్ కొలిషన్ వార్ణింగ్, ఆటోమాటిక్ బ్రేకింగ్‌తో ఫ్రంట్ అండ్ రియర్ క్రాస్ ట్రాఫిక్ అలెర్ట్.. లేన్ డిపార్చర్ వార్ణింగ్ వంటివాటితో కూడిన.. అడ్వాన్స్‌డ్ డ్రైవర్ అసిస్టెన్స్ సిస్టం (ADAS) వంటివన్నీ ఉన్నాయి. ఇవన్నీ వాహన వినియోగదారుల భద్రతను నిర్థారిస్తాయి.
4. బ్యాటరీ అండ్ రేంజ్
బీవైడీ సీలియన్ 7 ఎలక్ట్రిక్ కారు సింగిల్ మోటార్ మరియు డ్యూయెల్ మోటార్ రెండింటిలోనూ లభిస్తుంది. రెండూ 82.5 కిలోవాట్ బ్యాటరీ ప్యాక్ పొందుతుంది. సింగిల్ మోటార్ వేరియంట్ 308 Bhp పవర్ ప్రొడ్యూస్ చేస్తే.. డ్యూయెల్ మొదటి వెర్షన్ 523 Bhp పవర్ అందిస్తుంది.
సింగిల్ మోటార్ ప్రీమియం వేరియంట్ 0 నుంచి 100 కిమీ / గం వరకు వేగవంతం (యాక్సిలరేషన్) కావడానికి 6.7 సెకన్లు మాత్రమే. డ్యూయెల్ మోటార్ పెర్ఫామెన్స్ వేరియంట్ 0 నుంచి 100 కిమీ / గం వేగవంతం కావడానికి పట్టే సమయం 4.5 సెకన్లు మాత్రమే. సింగిల్ మోటార్ వేరియంట్ వేరియంట్ ఒక సింగిల్ ఛార్జితో 587 కిమీ రేంజ్ అందిస్తుంది. పెర్ఫామెన్స్ ఆల్ వీల్ డ్రైవ్ వెర్షన్‌లో 542 కిమీ రేంజ్ అందిస్తుంది.
Also Read: లాంచ్‌కు సిద్దమవుతున్న టయోటా కార్లు ఇవే: ఇక మార్కెట్లో రచ్చ.. రచ్చే!
5. ప్రత్యర్థులు
భారతీయ విఫణిలో అడుగుపెట్టిన కొత్త బీవైడీ సీలియన్ 7 ఎలక్ట్రిక్ కారు బీఎండబ్ల్యూ ఐఎక్స్1 లాంగ్ వీల్‌బేస్ కారుకు ప్రధాన ప్రత్యర్థిగా ఉంటుంది. కాబట్టి అమ్మకాల పరంగా ఇది కొంత పోటీని ఎదుర్కోవాల్సి ఉంటుంది. బీవైడీ కంపెనీ యొక్క కార్లకు ఇండియన్ మార్కెట్లో అధిక ప్రజాదరణ ఉంది. కాబట్టి ఈ సీలియన్ 7 ఎలక్ట్రిక్ కారు కూడా మంచి అమ్మకాలు పొందే అవకాశం ఉందని భావిస్తున్నాము.
ఇండియన్ మార్కెట్లోని బీవైడీ కార్లు
బీవైడీ (బిల్డ్ యువర్ డ్రీమ్స్) కంపెనీ చైనా బ్రాండ్ అయినప్పటికీ.. కార్లన్నీ సరికొత్త డిజైన్, లేటెస్ట్ ఫీచర్స్ ఉండటం వల్ల మరియు సేఫ్టీలో 5 స్టార్ రేటింగ్ పొందటం వల్ల ఎక్కువమందిని ఆకర్షిస్తున్నాయి. కంపెనీ ఇప్పటి వరకు ఆట్టో 3, సీల్ మరియు ఈ మ్యాక్స్ 7 వంటి వంటి వాటిని మార్కెట్లో లాంచ్ చేసింది. ఇప్పుడు తాజాగా సీలియన్ 7 లాంచ్ చేసింది.
Also Read: సరికొత్త ఏప్రిలియా టువోనో 457.. రైడింగ్ చేయడానికి సరైన బైక్ ఇదే!
ఎలక్ట్రిక్ కార్లకు ఇండియన్ మార్కెట్లో మంచి ఆదరణ ఉండటం వల్ల.. చాలా కంపెనీలు తమ కార్లను ఎలక్ట్రిక్ రూపంలో లాంచ్ చేస్తున్నాయి. ఈ జాబితాలో టాటా మోటార్స్, మహీంద్రా అండ్ మహీంద్రా, మారుతి సుజుకి, ఆడి, బెంజ్, బీఎండబ్ల్యూ, వోల్వో మొదలైనవన్నీ ఉన్నాయి. ఈ కంపెనీలన్నీ ఎప్పటికప్పుడు ఎలక్ట్రిక్ కార్లను లాంచ్ చేసి.. అత్యుత్తమ అమ్మకాలను పొందుతున్నాయి. దేశీయ మార్కెట్లో మాత్రమే కాకుండా అంతర్జాతీయ మార్కెట్లో కూడా విక్రయిస్తున్నాయి.