34.2 C
Hyderabad
Thursday, April 3, 2025

2023లో ఎక్కువ రెమ్యునరేషన్ తీసుకున్న హీరోయిన్స్.. వీరే!

Top Actress Remuneration in 2023 Nayanthara To Sreeleela: ఆధునిక కాలంలో చాలామంది సినిమా హీరోలు పాన్ ఇండియా సినిమాల్లో నటిస్తూ వందల కోట్లు రెమ్యునరేషన్స్ తీసుకుంటున్నారు. ఈ జాబితాలో ప్రభాస్, జూనియర్ ఎన్టీఆర్, రామ్ చరణ్ మొదలైన వారు ఉన్నాయి. అయితే సౌత్ ఇండియా సినీ ఇండస్ట్రీలో ఎక్కువ రెమ్యునరేషన్ తీసుకుంటున్న కథానాయికలు ఎవరు, వారి రెమ్యునరేషన్ ఎంత అనే మరిన్ని వివరాలు ఈ కథనంలో తెలుసుకుందాం.

హీరోయిన్స్ రెమ్యునరేషన్స్

త్రిష (Trisha)  ప్రారంభం నుంచి ఓ మంచి క్రేజుతో ముందుకెళ్లిన ఈ భామ దాదాపు రెండు దశాబ్దాలు తిరుగు లేకుండా టాలీవుడ్ చిత్ర సీమలో చక్రం తిప్పింది. ఆ తరువాత కొన్ని రోజులు అంతగా అవకాశాలు లేకపోవడంతో చిన్న బ్రేక్ తీసుకుంది. అయితే 96 అనే తమిళ సినిమాతో మళ్ళీ పూర్వ వైభవం పొందింది. కాగా పొన్నియన్ సెల్వన్ మూవీతో మంచి సక్సెస్ సాధించింది. ప్రస్తుతం ఈమె చేతిలో సుమారు ఆరు సినిమాలు ఉన్నట్లు సమాచారం. ఈమె ఒక సినిమాకు ఏకంగా రూ. 12 కోట్లు వరకు రెమ్యునరేషన్ తీసుకుంటున్నట్లుగా సమాచారం.

నయనతార (Nayanthara) – ఈ పేరుకి సినీ ఇండస్ట్రీలో పెద్దగా పరిచయమే అవసరం లేదు. తెలుగులో లక్ష్మీ, బాస్ వంటి సినిమాల్లో మంచి పేరు తెచ్చుకుని శ్రీరామరాజ్యంలో సీతగా నటించి ప్రేక్షకుల మనసు దోచేసింది. ఇటీవలే జవాన్ చిత్రంతో బాలీవుడ్ ఇండస్ట్రీలోకి అడుగుపెట్టి మంచి సక్సెస్ సాధించింది. ఈమె ఒక్కో సినిమాకు రూ. 10 కోట్లు వరకు రెమ్యునరేషన్ తీసుకుంటున్నట్లుగా సమాచారం.

అనుష్క శెట్టి (Anushka Shetty) – కర్ణాటకలో పుట్టిన అనుష్క అతి తక్కువ కాలంలోనే టాలీవుడ్ పరిశ్రమలో ఎనలేని పాపులారిటీ పొందింది. బాహుబలి సినిమా తరువాత గ్యాప్ తీసుకున్న స్వీటీ ఇటీవలే మిస్ శెట్టి మిస్టర్ పోలిశెట్టి సినిమాతో మళ్ళీ రీ ఎంట్రీ ఇచ్చింది. ఒక్కో సినిమాకు ఈమె రూ. 6 కోట్లు వరకు తీసుకుంటున్నట్లు సమాచారం.

సమంత (Samantha) – ఏ మాయ చేసావే సినిమాతో ప్రేక్షకులను మాయ చేసిన సమంత ఇటీవల ఖుషి సినిమాతో సక్సెస్ కొట్టేసింది. విజయ దేవరకొండ సరసన నటించిన ఈమె చాలా రోజుల తరువాత మళ్ళీ సూపర్ హిట్ తన ఖాతాలో వేసుకుంది. కాగా ఈమె ఇప్పుడు ఒక్కో సినిమాకు రూ. 8 కోట్లు వరకు తీసుకుంటున్నట్లు సమాచారం.

రష్మిక మందన్న (Rashmika Mandanna) – అటు తెలుగు ఇటు హిందీ సినిమాల్లో బిజీగా ఉన్న నేషనల్ క్రష్ రష్మిక ప్రారంభం నుంచి మంచి విజయాలను తన ఖాతాలో వేసుకుంది. గీత గోవిందం సినిమాతో ఎంతో ఫేమస్ అయిన ఈమె పుష్ప సినిమాతో మరో మెట్టు సక్సెస్ సొంతం చేసుకుంది. కాగా ఈమె ఒక్కో సినిమాకు రూ. 7 కోట్లు వరకు రెమ్యునరేషన్ తీసుకుంటున్నట్లు సమాచారం.

కీర్తి సురేష్ (Keerthy Suresh) – నేను శైలజ సినిమాతోనే భారీ క్రేజు తెచ్చుకున్న ఈ బ్యూటీ ఇటీవల భోళా శంకర్ సినిమాతో ప్రేక్షకులను ఎంతగానో అలరించింది. కాగా ఇప్పటికి మహా నటి సినిమాతో మహానటిగా గుర్తింపు పొందిన కీర్తి ఇప్పులు తమిళంలో వరుస సినిమాలు చేస్తున్నట్లు సమాచారం. అయితే ఈమె ఒక్కో సినిమాకు రూ. 2.5 కోట్లు నుంచి రూ. 4 కోట్లు వరకు రెమ్యునరేషన్ తీసుకుంటున్నట్లు సమాచారం.

తమన్నా భాటియా (Tamannaah Bhatia) – తెలుగు, తమిళం, హిందీ వంటి భాషల్లో తనదైన రీతిలో ప్రేక్షలకున మైమరిపిస్తున్న తమన్నా ఇటీవల భోళా శంకర్ మరియు జైలర్ సినిమాలతో సందడి చేసింది. మిల్కీ బ్యూటీ తమన్నా ఒక్కో సినిమాకు రూ. 5 కోట్లు వరకు తీసుకుంటున్నట్లు తెలుస్తోంది.

Don’t Miss: బ్యాడ్మింటన్‌ నుంచి స్టార్‌ హీరోయిన్‌.. వందల కోట్ల ఆస్తి, లగ్జరీ కార్లు.. రాయల్‌ లైఫ్‌!

కాజల్ అగార్వల్ (Kajal Aggarwal) – తెలుగు చితా సీమలో యువరాణిగా ప్రసిద్ధి పొందిన కాజల్ ప్రస్తుతం పెళ్ళై కొడుకు పుట్టిన తరువాత కూడా సెకండ్ ఇన్నింగ్స్ ప్రారంభించింది. ఇప్పుడు ఈమె భగవంత్ కేసరి మరియు ఇండియన్ 2 అనే చిత్రాల్లో నటిస్తోంది. కాగా కాజల్ ఒక్కో సినిమాకు రూ. 4 కోట్లు రెమ్యునరేషన్ తీసుకుంటున్నట్లు తెలుస్తోంది.

శ్రీలీల (Sreeleela) – లేటెస్ట్ తెలుగు సినిమాల్లో ప్రస్తుతం శ్రీలీల హవా నడుస్తోంది. గత ఏడాది కాలంలోనే రెండు మూడు సినిమాల్లో నటించి ఎంతో పాపులర్ కథానాయకిగా పేరు తెచ్చుకుంది. కాగా ప్రస్తుతం భగవంత్ కేసరి సినిమాలో నటిస్తోంది. ఈమె ఒక్కో సినిమాకు రూ. 2 నుంచి రూ. 2.5 కోట్లు రెమ్యునరేషన్ తీసుకుంటున్నట్లు సమాచారం.

admin
adminhttps://marthatelugu.com
I'm Sri, have 6 years experience as a Content Writer in all categories, I always try to give the breaking news to the Internet Users. I'm a certified Journalist and I Worked as a Journalist in one of the famous telugu channel.

సంబంధిత వార్తలు

తాజా వార్తలు