Electric Scooters to Gift Your Sisters This Raksha Bandhan: తోబుట్టువుల అనుబంధానికి ప్రతీక అయిన ‘రక్షా బంధన్’ (Raksha Bandhan) త్వరలో (ఆగష్టు 19) వచ్చేస్తోంది. ఈ సమయంలో అన్నలు.. తమ అక్కలకు లేదా చెల్లెళ్లకు అద్భుతమైన టూ వీలర్, కొంత తక్కువ ధరలోనే గిఫ్ట్ ఇవ్వాలనుకుంటే ఇక్కడ ఐదు మంచి ఎలక్ట్రిక్ స్కూటర్లు ఉన్నాయి. మరిన్ని వివరాలు చూసేద్దామా..
కైనెటిక్ గ్రీన్ జూమ్ (Kinetic Green Zoom)
రోజువారీ వినియోగానికి తక్కువ ధరలో ఓ బెస్ట్ ఎలక్ట్రిక్ స్కూటర్ ఇవ్వాలనుకుంటే.. కైనెటిక్ గ్రీన్ జూమ్ ఓ ఉత్తమ ఆప్షన్ అని తెలుస్తోంది. దీని ధర రూ. 71531 (ఎక్స్ షోరూమ్). ఇది రోజువారీ వినియోగానికి, సిటీ ప్రయాణానికి చాలా ఉపయోగకరంగా ఉంటుంది. 250 వాట్స్ బీఎల్డీసీ మోటార్ ద్వారా శక్తిని పొందే ఈ స్కూటర్ 48 వోల్ట్ / 24 యాంపియర్ లిథియం అయాన్ బ్యాటరీ పొందుతుంది. ఇది ఒక ఫుల్ చార్జితో గరిష్టంగా 70 కిమీ రేంజ్ అందిస్తుంది. ఈ ఎలక్ట్రిక్ స్కూటర్ టాప్ స్పీడ్ 25 కిమీ/గం.
కైనెటిక్ గ్రీన్ జూమ్ స్కూటర్ ఫుల్ ఛార్జ్ కావడానికి పట్టే సమయం 4 నుంచి 5 గంటలు మాత్రమే. ఇందులో ఎల్ఈడీ హెడ్‌ల్యాంప్ ఉంటుంది. ఇది మంచి దృశ్యమానతను అందిస్తుంది. డ్రమ్ బ్రేక్స్, టెలిస్కోపిక్ ఫ్రంట్ సస్పెన్షన్ మరియు డ్యూయెల్ స్ప్రింగ్ రియర్ సస్పెన్షన్ వంటివి ఇందులో ఉంటాయి. ఇందులోని బ్యాటరీ రిమూవబుల్.. కాబట్టి ఛార్జింగ్ అయిపోయిన తరువాత స్వపబుల్ సెంటర్లో కూడా మార్చుకోవచ్చు.
ఒడిస్సే స్నాప్ (Odysse Snap)
రూ. 79999 వద్ద లభించే ఒడిస్సే స్నాప్ ఎలక్ట్రిక్ స్కూటర్ మన జాబితాలో చెప్పుకోదగ్గ ఉత్తమ ఎలక్ట్రిక్ స్కూటర్. ఇది ఫ్రెండ్లీ బడ్జెట్ స్కూటర్. గంటకు 60 కిమీ వరకు వేగవంతమయ్యే ఈ స్కూటర్ 105 కిమీ రేంజ్ అందిస్తుంది. ఇందులో లిథియం అయాన్ బ్యాటరీ ఉంటుంది. ఇది ఒకసారి ఫుల్ ఛార్జ్ కావడానికి 4 గంటల సమయం పడుతుంది. ఈ స్కూటర్ అజూర్ బ్లూ, మ్యాట్ బ్లాక్, స్కార్లెట్ రెడ్, టీల్ గ్రీన్ వంటి నాలుగు ఆకర్షణీయమైన రంగులలో లభిస్తుంది. ఈ ఎలక్ట్రిక్ స్కూటర్ ఫ్లిప్‌కార్ట్‌లో కూడా లభిస్తుంది. ఇందులో బుక్ చేసుకుంటే రూ. 10000 వరకు డిస్కౌంట్ కూడా పొందవచ్చు.
హీరో ఎలక్ట్రిక్ అట్రియా ఎల్ఎక్స్ (Hero Electric Atria LX)
రూ. 77690 ధర వద్ద లభించే హీరో ఎలక్ట్రిక్ అట్రియా ఎల్ఎక్స్ స్కూటర్ నగర ప్రయాణం కోసం రూపొందించబడిన ప్రత్యేకమైన వెహికల్. ఇది కూడా బడ్జెట్ ఫ్రెండ్లీ స్కూటర్. ఇందులో 250 వాట్స్ బీఎల్డీసీ మోటార్ ఉంటుంది. ఈ స్కూటర్ 51.2 వోల్ట్స్ / 30 యాంపియర్ లిథియం అయాన్ బ్యాటరీ పొందుతుంది. అట్రియా ఎల్ఎక్స్ టాప్ స్పీడ్ గంటకు 25 కిమీ. ఇది ఒక ఫుల్ ఛార్జ్‌తో 85 కిమీ రేంజ్ అందిస్తుంది.
హీరో ఎలక్ట్రిక్ అట్రియా ఎల్ఎక్స్ స్కూటర్ ఫుల్ ఛార్జ్ కావడానికి పట్టే సమయం 4 నుంచి 5 గంటలు మాత్రమే. ఇందులో మెరుగైన దృశ్యమానత కోసం ఎల్ఈడీ హెడ్‌ల్యాంప్ ఉంటుంది. అంతే కాకుండా వెహికల్ గురించి చాలా సమాచారాన్ని అందించడానికి డిజిటల్ ఇన్‌స్ట్రుమెంట్ క్లస్టర్ కూడా ఉంటుంది. ఇది బ్యాటరీ స్టేటస్, టైమ్ మరియు స్పీడ్ వంటి చాలా విషయాలను రైడర్లకు తెలియజేస్తుంది.
ఒడిస్సే ఈ2గో లైట్ (Odysse E2go Lite)
మన జాబితాలో తక్కువ ధర వద్ద లభించే మరో ఎలక్ట్రిక్ స్కూటర్ ఒడిస్సే ఈ2గో లైట్. దీని ధర రూ. 71000. నగర ప్రయాణానికి చాలా అద్భుతంగా ఉండే ఈ స్కూటర్ 250 వాట్స్ బీఎల్డీసీ మోటార్ పొందుతుంది. ఇందులోని 1.42 కిలోవాట్ లిథియం అయాన్ బ్యాటరీ గరిష్టంగా 70 కిమీ రేంజ్ అందిస్తుంది. ఈ స్కూటర్ టాప్ స్పీడ్ గంటకు 25 కిమీ మాత్రమే.
ఈ ఒడిస్సే ఈ2గో లైట్ ఎలక్ట్రిక్ స్కూటర్ రైడ్ చేయడానికి ప్రత్యేకంగా లైసెన్స్ లేదా రిజిస్ట్రేషన్ వంటివి అవసరం లేదు. సింపుల్ డిజైన్ కలిగిన ఈ స్కూటర్ కీలెస్ ఎంట్రీ, యాంటీ తెఫ్ట్ అలారం మరియు ముందు భాగంలో డిస్క్ బ్రేక్స్ పొందుతుంది. ఈ స్కూటర్ కంబాట్ రెడ్, అజూర్ బ్లూ, మ్యాట్ బ్లాక్, స్కార్లెట్ రెడ్, టీల్ గ్రీన్ వంటి కలర్ ఆప్షన్లలో లభిస్తుంది. దీనిని ఫ్లిప్‌కార్ట్‌లో బుక్ చేసుకుంటే ఏకంగా రూ.10 వేలు డిస్కౌంట్ పొందవచ్చు.
ఓలా ఎస్1 ఎక్స్ (Ola S1 X)
భారతదేశంలో అతి తక్కువ కాలంలోనే అత్యధిక ప్రజాదరణ పొందిన ఎలక్ట్రిక్ టూ వీలర్ తయారీ సంస్థ ఓలా ఎలక్ట్రిక్. ఈ కంపెనీ యొక్క ఎస్1 ఎక్స్ తక్కువ ధర వద్ద లభించే మరియు రోజువారీ వినియోగానికి అత్యద్భుతమైన స్కూటర్. ఈ ఎలక్ట్రిక్ స్కూటర్ ధర రూ. 84999. ఇది రోజువారీ వినియోగానికి చాలా ఉత్తమమైన స్కూటర్.
Don’t Miss: ప్రపంచ కుబేరులు.. వేలకోట్ల సంపద: వీళ్ళు వాడే కార్లు మాత్రం ఇవే
ఓలా ఎస్1 ఎక్స్ ఎలక్ట్రిక్ స్కూటర్ డిజిటల్ ఇన్‌స్ట్రుమెంట్ క్లస్టర్, కీలెస్ ఎంట్రీ, మల్టిపుల్ రైడింగ్ మోడ్స్ వంటి ఫీచర్స్ పొందుతుంది. ఇందులో 2 కిలోవాట్ బ్యాటరీ గంటకు 85 కిమీ వేగంతో 121 కిమీ రేంజ్ అందిస్తుంది. అదే సమయంలో 3 కిలోవాట్ బ్యాటరీ మోడల్ (రూ. 90019) గంటకు 90 కిమీ వేగంతో 151 కిమీ రేంజ్ అందిస్తుంది. ఈ స్కూటర్ యొక్క బ్యాటరీ ఫుల్ ఛార్జ్ కావడానికి 7.4 గంటల సమయం పడుతుంది. ఇది 7 విభిన్న రంగులలో లభిస్తుంది. కాబట్టి ఈ స్కూటర్ అన్ని విధాలా చాలా ఉపయోగకరంగా ఉంటుంది.