Top Most Affordable Electric Cars India: పెట్రోల్, డీజిల్ కార్లతో పోలిస్తే.. ఎలక్ట్రిక్ వాహనాల మెయింటెనెన్స్ ఖర్చులు తక్కువగా ఉంటాయని అందరికి తెలుసు. ఈ కారణంగానే చాలా మంది ఎలక్ట్రిక్ వాహనాలను ఎగబడి మరీ కొనుగోలు చేస్తున్నారు. ఈ కథనంలో దేశీయ మార్కెట్లో లభించే అత్యంత సరసమైన మరియు ఉత్తమమైన ఎలక్ట్రిక్ కార్ల గురించి వివరంగా తెలుసుకుందాం.
ఎంజీ కామెట్ ఈవీ
భారతీయ మార్కెట్లో అతి తక్కువ కాలంలో అత్యంత ప్రజాదరణ పొందిన ఎలక్ట్రిక్ కార్లలో చెప్పుకోదగ్గ మోడల్ ‘ఎంజీ కామెట్ ఈవీ’. ఈ కారు ధర రూ. 6.99 లక్షల నుంచి రూ. 9.14 లక్షల (ఎక్స్ షోరూమ్) మధ్యలో ఉంది. ఇది మంచి డిజైన్ మరియు ఫీచర్స్ కలిగి అద్భుతమైన పర్ఫామెన్స్ అందిస్తుంది. ఈ ఎలక్ట్రిక్ కారు సింగిల్ చార్జితో 230 కిమీ రేంజ్ అందిస్తుంది. రోజువారీ వినియోగానికి ఇది చాలా ఉపయోగకరంగా ఉంటుంది.
టాటా టియాగో ఈవీ
రూ. 7.99 లక్షల నుంచి రూ. 11.89 లక్షల (ఎక్స్ షోరూమ్) మధ్య లభించే ఈ కారు ఎక్కువమంది ప్రజలకు నమ్మికయిన మోడల్. మంచి డిజైన్ మరియు ఫీచర్స్ కలిగిన ఈ కారు మంచి పనితీరును అందిస్తుంది. ఈ కారు ఒక సింగిల్ చార్జితో 250 కిమీ నుంచి 315 కిమీ రేంజ్ అందిస్తుంది. రేంజ్ అనేది ఎంచుకునే బ్యాటరీ ఆప్షన్ మీద ఆధారపడి ఉంటుంది. డిజైన్ మరియు ఫీచర్స్ మాత్రమే కాకుండా టియాగో ఈవీ మంచి సేఫ్టీ ఫీచర్స్ కూడా పొందుతుంది. ఇవన్నీ భద్రతకు పెద్దపీట వేస్తాయి.
సిట్రోయెన్ ఈసీ3
ఫ్రెంచ్ వాహన తయారీ సంస్థ ‘సిట్రోయెన్’ భారతీయ మార్కెట్లో లాంచ్ చేసిన ఎలక్ట్రిక్ కార్లలో ‘ఈసీ3’ కూడా ఒకటి. దీని ధర రూ. 11.61 లక్షల నుంచి రూ. 13.35 లక్షల (ఎక్స్ షోరూమ్) మధ్యలో ఉంది. ఇది చూడటానికి చిన్నగా ఉన్నప్పటికీ పనితీరు పరంగా చాలా ఉత్తమంగా ఉంటుంది. ఇది లేటెస్ట్ డిజైన్ మరియు ఫీచర్స్ కలిగి.. ఒక సింగిల్ చార్జితో ఏకంగా 320 కిమీ రేంజ్ అందిస్తుంది.
టాటా టిగోర్ ఈవీ
రూ. 12.49 లక్షల నుంచి రూ. 13.75 లక్షల మధ్య లభించే టాటా మోటార్స్ యొక్క టిగోర్ ఈవీ మన జాబితాలో చెప్పుకోదగ్గ మోడల్. ఇది కొంచెం పొయెద్ద బ్యాటరీని కలిగి ఒక సింగిల్ చార్జితో ఏకంగా 315 కిమీ రేంజ్ అందిస్తుందని ARAI చేత ధృవీకరించబడింది. మంచి డిజైన్ మరియు ఫీచర్స్ కలిగిన ఈ కారు మంచి రేంజ్ కూడా అందించడంతో ఎక్కువమంది దీనిని కొనుగోలు చేయడానికి ఆసక్తి చూపుతున్నారు. ఈ కారణంగానే టాటా టిగోర్ ఈవీ అమ్మకాలు పెరుగుతున్నాయి.
టాటా పంచ్ ఈవీ
సేఫ్టీలో ఏకంగా 5 స్టార్ రేటింగ్ పొందిన టాటా మోటార్స్ యొక్క ఈవీ ‘టాటా పంచ్’ మన జాబితాలో తప్పకుండా చెప్పుకోవాల్సిన కారు. ఎందుకంటే పిట్టా కొంచెమైనా కూత ఘనం అన్నట్లు.. ఇది మంచి డిజైన్ మరియు ఫీచర్స్ మాత్రమే కాకుండా అద్భుతమైన రేంజ్ అందిస్తుంది. ఇది ఒక సింగిల్ చార్జితో 315 కిమీ నుంచి 421 కిమీ రేంజ్ అందిస్తుంది. రేంజ్ అనేది ఎంచుకునే బ్యాటరీ మీద ఆధారపడి ఉంటుంది. ఈ ఎలక్ట్రిక్ కారు ధర రూ. 10.99 లక్షల నుంచి రూ. 15.49 లక్షల (ఎక్స్ షోరూమ్) మధ్య ఉంటుంది.
ఎలక్ట్రిక్ కార్ల కొనుగోలుకు ప్రధాన కారణం
నిజానికి ఎలక్ట్రిక్ కార్లను కొనుగోలు చేయడానికి ప్రధాన కారణం.. ఖర్చులను తగ్గించడానికి అనే తెలుస్తుంది. ఎందుకంటే ఇప్పటికే విడుదలైన అనేక నివేదికల ప్రకారం ఎలక్ట్రిక్ కార్ల మెయింటెనెన్స్ ఖర్చు, పెట్రోల్ మరియు డీజిల్ కార్ల కంటే కూడా చాలా తక్కువని తెలుస్తోంది. అంతే కాకుండా ఎలక్ట్రిక్ వాహనాలు జీరో ఎమిషన్ కాబట్టి పర్యావరణ హితంగా కూడా ఉంటాయి.
Don’t Miss: హృతిక్ రోషన్ తండ్రి కొన్న కొత్త కారు ఇదే!.. ధర తెలిస్తే దడ పుట్టాల్సిందే..
పర్యావరణ పరిరక్షణ కోసం.. ఎలక్ట్రిక్ వాహనాలను కొనుగోలు చేయాలనీ కేంద్రం ఫేమ్ కింద సబ్సిడీలు కూడా అందించింది. ఈ కారణాల వల్ల దేశంలో ఎలక్ట్రిక్ వాహనాల సంఖ్య బాగా పెరిగింది. దీంతో కొత్త కంపెనీలు కూడా దేశీయ విఫణిలో కొత్త కార్లను లాంచ్ చేస్తూ.. వాహన వినియోగదారులను ఆకరిస్తున్నాయి.