దీపావళి పండుగ వచ్చేస్తోంది. దీనిని దృష్టిలో ఉంచుకుని పలు కంపెనీలు కొత్త వాహనాలను లాంచ్ చేస్తున్నాయి. ఇందులో భాగంగానే టయోటా కిర్లోస్కర్ మోటార్ కూడా.. అర్బన్ క్రూయిజర్ హైరైడర్ ఏరో పేరుతో ఓ స్పెషల్ ఎడిషన్ లాంచ్ చేసింది. ఇది స్టాండర్డ్ మోడల్ కంటే కూడా కొంత భిన్నంగా ఉంది. దీనికి సంబంధించిన పూర్తి వివరాలు ఇక్కడ తెలుసుకుందాం.
ధర వివరాలు
టయోటా లాంచ్ చేసిన కొత్త అర్బన్ క్రూయిజర్ హైరైడర్ ఏరో ఎడిషన్ ధర రూ. 10.94 లక్షలు (ఎక్స్ షోరూమ్). ఇది సాధారణ కారుకు కొంత భిన్నంగా ఉంటుంది. దీనికోసం ఇది అనేక కాస్మొటిక్ అప్డేట్స్ పొందింది. దీని కోసం కంపెనీ 66 స్పెషల్ యాక్ససరీస్ కూడా అందిస్తోంది. అంతే కాకుండా కంపెనీ ఈ కారుపై 3 సంవత్సరాలు లేదా 1,00,000 కిమీ వారంటీ అందిస్తుంది. హైబ్రిడ్ బ్యాటరీపై 8 ఏళ్లు లేదా 1,60,000 వారంటీ అందిస్తుంది.
డిజైన్ వివరాలు & కలర్ ఆప్షన్స్
పేరుకు తగిన విధంగానే.. టయోటా అర్బన్ క్రూయిజర్ హైరైడర్ ఏరో ఎడిషన్.. స్పెషల్ స్టైలింగ్ ప్యాకేజీతో ఫ్రంట్ స్పాయిలర్, రియర్ స్పాయిలర్, సైడ్ స్కర్ట్లు పొందుతుంది. కంపెనీ ఈ కారు కోసం అందించే యాక్ససరీస్ కోసం అదనంగా రూ. 31999 వెచ్చించాల్సి ఉంటుంది. కాగా ఇది వైట్, సిల్వర్, బ్లాక్, రెడ్ అనే నాలుగు కలర్ ఆప్షన్లలో లభిస్తుంది.
ఫీచర్స్ గురించి
టయోటా అర్బన్ క్రూయిజర్ హైరైడర్ ఏరో ఎడిషన్.. క్రిస్టల్ యాక్రిలిక్ గ్రిల్, సిగ్నేచర్ ట్విన్ ఎల్ఈడీ డీఆర్ఎల్, స్టైలిష్ 17 ఇంచెస్ అల్లాయ్ వీల్స్ వంటివి పొందుతుంది. లోపలి భాగంలో.. వెంటిలేటెడ్ లెదర్ సీట్లు, పనోరమిక్ సన్‌రూఫ్, వైర్లెస్ ఆపిల్ కార్ప్లే & ఆండ్రాయిడ్ ఆటోతో కూడిన 9 ఇంచెస్ టచ్‌స్క్రీన్, యాంబియంట్ లైటింగ్, వైర్లెస్ ఛార్జింగ్, 360 డిగ్రీ కెమెరా వంటి వాటితో పాటు.. రిక్లైనింగ్ సీట్లు, ఏసీ వెంట్స్, యూఎస్బీ ఛార్జింగ్, ఫ్లెక్సిబుల్ 60:40 స్ప్లిట్ రియర్ సీటు వంటివన్నీ కూడా ఉన్నాయి.
ఇంజిన్ డీటైల్స్
హైరైడర్ సెల్ఫ్ ఛార్జింగ్ స్ట్రాంగ్ హైబ్రిడ్ ఎలక్ట్రిక్ పవర్‌ట్రెయిన్‌తో వస్తుంది. ఈ కారు 27.97 కిమీ/లీ మైలేజ్ అందిస్తుంది. ఇందులోని 1.5 లీటర్ కే సిరీస్ ఇంజిన్.. ఉత్తమ పనితీరును అందిస్తుంది. ఇది 2 వీల్ డ్రైవ్, 4 వీల్ డ్రైవ్ అనే ఆప్షన్స్ పొందటం మాత్రమే కాకుండా 5 స్పీడ్ మాన్యువల్ లేదా 6 స్పీడ్ ఆటోమాటిక్ ట్రాన్స్మిషన్ ఎంపికలతో వస్తుంది.
టయోటా హైరైడర్ గురించి
నిజానికి భారతదేశంలో 2022లో ప్రారంభమైన అర్బన్ క్రూయిజర్ హైరైడర్ ప్రారంభం నుంచి మంచి అమ్మకాలను పొందుతోంది. ఇది ఇటీవలే 1,68,000 యూనిట్లను అధిగమించింది. అంటే అంతమంది ఈ కారును కొనుగోలు చేశారన్నమాట. అయితే ఇప్పుడు ఇండియన్ మార్కెట్లో లాంచ్ అయిన కొత్త ఏరో ఎడిషన్.. స్టాండర్డ్ మోడల్ కంటే కూడా అద్భుతంగా ఉండటం చేత.. పండుగ సమయంలో మరిన్ని గొప్ప అమ్మకాలు పొందే అవకాశం ఉందని భావిస్తున్నాము. ఈ కారు రోజువారీ వినియోగానికి, నగర ప్రయాణానికి, లాంగ్ డ్రైవ్ చేయడానికి చాలా అనుకూలంగా ఉంటుంది. మొత్తం మీద ఈ కొత్త ఎడిషన్.. టయోటా అమ్మకాలను తప్పకుండా మెరుగు పరుస్తుందని భావిస్తున్నాము.