కేవలం 1000 మందికే ఈ స్కూటర్.. దీని స్పెషాలిటీ ఏంటో తెలుసా?

TVS iQube Celebration Edition Launched in India: దేశీయ మార్కెట్లో అత్యంత ప్రజాదరణ పొందిన టూ వీలర్ తయారీ సంస్థ ‘టీవీఎస్ మోటార్’ (TVS Motor) ఇప్పటికే లెక్కకు మించిన వాహనాలను భారతీయ విఫణిలో లాంచ్ చేసి విక్రయిస్తోంది. కాగా ఇప్పుడు తాజాగా ఎలక్ట్రిక్ విభాగంలో మంచి అమ్మకాలతో దూసుకెళ్తున్న ‘టీవీఎస్ ఐక్యూబ్’ (TVS iQube) ఇప్పుడు స్పెషల్ ఎడిషన్ రూపంలో లాంచ్ అయింది.

టీవీఎస్ ఐక్యూబ్ స్పెషల్ ఎడిషన్స్ (TVS iQube Special Edition)

టూ వీలర్ తయారీ సంస్థ టీవీఎస్ యొక్క ఐక్యూబ్ మరియు ఐక్యూబ్ ఎస్ సెలబ్రేషన్ ఎడిషన్‌లుగా లాంచ్ అయ్యాయి. వీటి ధరలు వరుసగా రూ. 1.20 లక్షలు మరియు రూ. 1.29 లక్షలు (ఎక్స్ షోరూమ్). కంపెనీ లాంచ్ చేసిన ఈ స్పెషన్ ఎడిషన్ స్కూటర్లు పరిమిత సంఖ్యలో (కేవలం 1000 యూనిట్లు) మాత్రమే విక్రయించనున్నారు.

బుకింగ్స్ & డెలివరీలు (Bookings & Delivery)

భారతీయ విఫణిలో లాంచ్ అయిన కొత్త టీవీఎస్ ఐక్యూబ్ స్పెషల్ ఎడిషన్స్ అనేవి కేవలం 1000 మంది కస్టమర్లకు మాత్రమే అందించనున్నారు. అంటే ముందుగా బుక్ చేసుకున్న 1000 మందికి వారికి మాత్రమే కంపెనీ వీటిని డెలివరీ చేస్తుంది. కాబట్టి ఈ స్కూటర్ కావాలనుకునే వారు ఈ రోజు (ఆగష్టు 15) బుక్ చేసుకోవాల్సి ఉంటుంది. డెలివరీలు ఆగష్టు 26 నుంచి ప్రారంభమవుతాయి.

డిజైన్ మరియు ఫీచర్స్ (Design and Features)

78వ స్వాతంత్య్ర దినోత్సవాన్ని పురస్కరించుకుని కంపెనీ ఈ లిమిటెడ్ స్పెషల్ ఎడిషన్ లాంచ్ చేసింది. ఇది డ్యూయెల్ టోన్ కలర్ పొందుతుంది. కాబట్టి ఈ ఎలక్ట్రిక్ స్కూటర్ ఫ్రంట్ ఎండ్ నారింజ రంగులో ఉంటుంది. సైడ్ ప్యానెల్ మరియు వెనుక భాగం బూడిద రంగులో లేదా నలుపు రంగులో ఉంటుంది. కాబట్టి ఇది దాని మునుపటి వేరియంట్ల కంటే భిన్నంగా, ఆకర్షణీయంగా ఉంటుంది. అంతే కాకుండా ఈ స్కూటర్ యొక్క ఎల్ఈడీ డీఆర్ఎల్ మీద చిన్న జాతీయ జెండా ఉంటుంది. ఇది స్పెషల్ ఎడిషన్ అని చెప్పకనే చెబుతుంది.

ఫీచర్స్ విషయానికి వస్తే.. కొత్త టీవీఎస్ ఐక్యూబ్ స్పెషల్ ఎడిషన్, ఇప్పటికే మార్కెట్లో అమ్మకానికి ఉన్న ఐక్యూబ్ యొక్క అదే ఫీచర్స్ పొందుతుంది. అయితే ఇందులో కాస్మొటిక్ అప్డేట్స్ మాత్రమే ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తాయి. ఇతర అన్ని ఫీచర్స్ స్టాండర్డ్ మోడల్ మాదిరిగానే.. రైడర్లకు ఉత్తమ రైడింగ్ అనుభూతిని అందిస్తాయి.

బ్యాటరీ & రేంజ్ (Battery & Range)

కొత్త టీవీఎస్ ఐక్యూబ్ స్పెషల్ ఎడిషన్.. చూడటానికి స్టాండర్డ్ మోడల్ మాదిరిగానే ఉంటుంది. స్టాండర్డ్ ఐక్యూబ్ మోడల్‌లోని అదే బ్యాటరీ ఇందులో ఉంటుంది. కాబట్టి రేంజ్ మరియు మోటార్ కెపాసిటీ, చాసిస్, సస్పెన్షన్ మరియు బ్రేకింగ్ అన్నీ కూడా సాధారణ ఐక్యూబ్ మోడల్‌ మాదిరిగానే ఉంటాయి.

టీవీఎస్ ఐక్యూబ్ స్పెషల్ ఎడిషన్ 4.4 కిలోవాట్ ఎలక్ట్రిక్ మోటార్ ద్వారా శక్తిని పొందుతుంది. ఈ స్కూటర్ 4.2 సెకన్లలో గంటకు 0 నుంచి 40 కిమీ వరకు వేగవంతం అవుతుంది. ఈ స్కూటర్ టాప్ 78 కిమీ/గం. ఈ స్కూటర్‌లో రివర్స్ మోడ్ మరియు ఎకానమీ, పవర్ అనే రైడింగ్ మోడ్స్ ఉన్నాయి. ఈ స్కూటర్ యొక్క 3.4 కిలోవాట్ బ్యాటరీ ఒక ఫుల్ చార్జితో 100 కిమీ రేంజ్ అందిస్తుంది. మొత్తం మీద అద్భుతమైన డిజైన్ కలిగిన ఈ స్కూటర్.. స్టాండర్డ్ స్కూటర్ మాదిరిగానే అదే పర్ఫామెన్స్ అందిస్తుందని స్పష్టమవుతోంది.

Don’t Miss: ఎట్టకేలకు భారత్‌లో ‘మహీంద్రా థార్ రోక్స్’ లాంచ్: ధర రూ.12.99 లక్షలే!

భారతదేశంలో అత్యంత ప్రజాదరణ పొందిన టీవీఎస్ మోటార్ దేశీయ మార్కెట్లో ఎప్పటికప్పుడు కొత్త లేదా అప్డేటెడ్ వాహనాలను లాంచ్ చేస్తూ ఉంది. ఇందులో భాగంగానే ఇప్పుడు ఈ టీవీఎస్ ఐక్యూబ్ స్పెషల్ ఎడిషన్ లాంచ్ చేసింది. ఈ స్కూటర్ తప్పకుండా మంచి ఆదరణ పొందుతుందని భావిస్తున్నాము. కాగా కంపెనీ రాబోయే రోజుల్లో మరిన్ని కొత్త వాహనాలను లాంచ్ చేయడానికి సన్నద్ధమవుతోంది. దేశీయ మార్కెట్లోని టూ వీలర్ విభాగంలో తన ఉనికిని చాటుకోవడానికి కంపెనీ నిరంతరం ప్రయత్నిస్తూనే ఉంది.