భారతదేశంలో అత్యంత ప్రజాదరణ పొందిన టీవీఎస్ మోటార్ కంపెనీకి చెందిన ‘రైడర్ 125‘ కొత్త వేరియంట్ అధికారికంగా మార్కెట్లో అడుగుపెట్టింది. సంస్థ లాంచ్ చేసిన ఈ కొత్త వేరియంట్.. ఎలాంటి అప్డేట్స్ పొందింది. ధర ఎంత?, ఇతర వివరాలు ఏమిటనే విషయాన్ని ఇక్కడ తెలుసుకుందాం.
ధర
టీవీఎస్ రైడర్ 125 కొత్త వేరియంట్ రెండు వేరియంట్లలో లభిస్తుంది. అవి టీఎఫ్‌టీ డ్యూయెల్ డిస్క్ (రూ. 95600), ఎస్ఎక్స్‌సీ డ్యూయల్ డిస్క్ (రూ. 93800) ఇక్కడ అన్ని ధరలు ఎక్స్-షోరూమ్, ఢిల్లీ. ఈ బైక్ ఇప్పుడు దేశంలోని అన్ని టీవీఎస్ మోటార్ డీలర్‌షిప్‌లలో అందుబాటులో ఉంది. కంపెనీ ఇప్పుడు ఈ కొత్త బైకుని ‘ది వికెడ్ ట్రోయికా‘ అని పిలుస్తుంది. ఇది సాధారణ మోడల్ కంటే కూడా ఎక్కువ అప్డేట్స్ పొందుతుంది.
డిజైన్ & ఫీచర్స్
సరికొత్త టీవీఎస్ రైడర్ 125 బైక్ చూడటానికి స్టాండర్డ్ మోడల్ మాదిరిగానే ఉన్నప్పటికీ.. చిన్న అప్డేట్స్ పొందుతుంది. అవి ఫాలో మీ హెడ్‌ల్యాంప్, ఇంజిన్ ఆపివేసిన తరువాత కూడా లైట్ కొంతసేపు ఆన్‌లో ఉండే ఓ సేఫ్టీ ఫీచర్. ఇవి కాకుండా రైడర్ రెండు డిస్‌ప్లే ఎంపికలతో స్మార్ట్ కనెక్టివిటీ కూడా ఇందులో ఉంది. 99 కంటే ఎక్కువ ఫీచర్స్ అందించే టీఎఫ్‌టీ స్క్రీన్.. 85 కంటే ఎక్కువ ఫీచర్లతో.. రివర్స్ ఎల్‌సీడీ క్లస్టర్ ఇందులో లభిస్తుంది.
టీవీఎస్ స్మార్ట్‌కనెక్ట్ ప్లాట్‌ఫామ్.. బ్లూటూత్ కనెక్టివిటీ, వాయిస్ అసిస్ట్, టర్న్ బై టర్న్ న్యావిగేషన్, కాల్ హ్యాండ్లింగ్, నోటిఫికేషన్ వంటి వాటికి అనుసంధానంగా ఉంటుంది. ఇది రోజువారీ ప్రయాణాన్ని మరింత అనుకూలంగా మారుస్తుంది. ఇవి కాకుండా కొన్ని గ్రాఫిక్స్ అప్డేట్స్ కూడా పొందుతాయి.
ఇంజిన్ వివరాలు
కొత్త టీవీఎస్ రైడర్ 125 బైక్ ఇప్పుడు బూస్ట్ మోడ్ పొందుతుంది. ఇది ఐజీఓ అసిస్ట్ టెక్నాలజీతో కూడైన కేటగిరీ ఫస్ట్ ఫీచర్. ఇందులోని ఇంజిన్ 6000 ఆర్‌పీఎమ్ వద్ద 11.75 న్యూటన్ మీటర్ టార్క్ ప్రొడ్యూస్ చేస్తుంది, హార్స్ పవర్ మారదు 11.2 హెచ్‌పీ వద్దనే ఉంటుంది. ఏబీఎస్‌తో కూడిన డ్యూయెల్ డిస్క్ బ్రేక్‌లు ఇప్పుడు ఇందులో ఉన్నాయి. ఇవన్నీ రైడర్లకు ఉత్తమ రైడింగ్ అనుభూతిని అందిస్తాయి.
రైడర్ 125 బైక్ ఉప్పుడు 90/90-17 ఫ్రంట్, 110/80-17 రియర్ టైర్లను పొందుతుంది. కాబట్టి రోడ్డుపై మంచి రైడింగ్ అనుభూతిని అందిస్తుంది. క్లాస్ లీడింగ్ టెక్నాలజీ, సెగ్మెంట్ ఫస్ట్ సేఫ్టీ ఫీచర్స్ కలిగిన ఈ లేటెస్ట్ బైక్.. ఎరుపు రంగులో అక్కడక్కడా మెటాలిక్ సిల్వర్ ఫినిషింగ్ పొందుతుంది.
కంపెనీ వైస్ ప్రెసిడెంట్ ఏమన్నారంటే?
2025 టీవీఎస్ రైడర్ 125 లాంచ్ సందర్భంగా.. కంపెనీ వైస్ ప్రెసిడెంట్ అనిరుద్ధ హల్దార్ మాట్లాడుతూ.. యువ రైడర్లు టీవీఎస్ మోటార్ నుంచి ఏమి కోరుకుంటున్నారో.. దానిని ఇవ్వడంలో భాగంగానే ఈ కొత్త బైక్ లాంచ్ చేసాము. ఇది తప్పకుండా రైడర్లకు మంచి రైడింగ్ అనుభూతిని అందిస్తుంది. మరిన్ని కొత్త మోడల్స్ లేదా అప్డేటెడ్ మోడల్స్ తీసుకువడానికి కృషి చేస్తూనే ఉంటామని ఆయన అన్నారు. మొత్తం మీద కొత్త అదనపు ఫీచర్స్ కోరుకునే వారికి ఇది బెస్ట్ ఆప్షన్ అని తెలుస్తోంది.