ఇవి కదా బెనిఫీట్స్ అంటే!.. హ్యుందాయ్ కార్ల కొనుగోలుపై భారీ డిస్కౌంట్స్!

Up To Rs.70000 Discounts on Hyundai in This Month: భారతీయ మార్కెట్లో వాహన వినియోగం భారీగా పెరుగుతోంది. కొంతమంది ఎప్పటికప్పుడు కొత్త కార్లను కొనుగోలు చేస్తే.. మరికొందరు ఆఫర్స్ వచ్చినప్పుడు లేదా డిస్కౌంట్స్ వచ్చినప్పుడు కొనుగోలు చేయాలని ఎదురు చూస్తారు. అలాంటివారికి హ్యుందాయ్ కంపెనీ గుడ్ న్యూస్ చెప్పింది. ఈ నెలలో కొన్ని ఎంపిక చేసిన కార్ల మీద సంస్థ అద్భుతమైన డిస్కౌంట్స్ అందిస్తోంది. కంపెనీ ఏ కార్ల మీద డిస్కౌంట్స్ అందిస్తోంది? ఈ డిస్కౌంట్స్ ఎప్పటి వరకు ఉంటాయి? ఇందులో ఎలాంటి బెనిఫీట్స్ ఉన్నాయనే వివరాలు వివరంగా ఈ కథనంలో తెలుసుకుందాం.

హ్యుందాయ్ కంపెనీ ఈ నెలలో తన ఆల్కజార్, గ్రాండ్ ఐ10 నియోస్, టక్సన్, వెన్యూ, వెన్యూ ఎన్ లైన్, ఐ20, ఆరా, వెర్నా మరియు ఎక్స్‌టర్ కార్ల మీద ఆకర్షణీయమైన తగ్గింపులు అందిస్తోంది. ఇందులో క్యాష్ డిస్కౌంట్, ఎక్స్చేంజ్ బోనస్ లేదా కార్పొరేట్ బోనస్ మరియు స్క్రాపింగ్ బోనస్ వంటివి ఉంటాయి.

హ్యుందాయ్ అల్కాజార్

కంపెనీ ఈ నెలలో అల్కజార్ కొనుగోలు మీద కస్టమర్లకు రూ. 70000 వరకు ప్రయోజనాలను అందిస్తోంది. ఈ బెనిఫీట్స్ పెట్రోల్ మరియు డీజిల్ వేరియంట్ల కొనుగోలుపైన లభిస్తాయి. టాటా సఫారీ మరియు ఎంజీ హెక్టర్ ప్లస్ వంటి వాటికి ప్రధాన ప్రత్యర్థిగా ఉన్న ఆల్కజార్ మంచి డిజైన్ మరియు ఫీచర్స్ పొందుతుంది.

ఆల్కజార్ 1.5 లీటర్ టర్బో పెట్రోల్ మరియు 1.5 లీటర్ డీజిల్ ఇంజిన్ ఆప్షన్స్ పొందుతుంది. ఈ SUV సిక్స్ సీటర్ మరియు మరియు సెవెన్ సీటర్ ఆప్షన్లలో అందుబాటులో ఉంది. ప్రారంభం నుంచి మంచి అమ్మకాలు పొందుతున్న అల్కాజర్ ఇప్పటికి కూడా మంచి ఆదారాన్ పొందుతుంది. ఈ నెలలో అల్కాజార్ కొనుగోలుపైన కస్టమర్లు రూ. 70000 తగ్గింపు పొందవచ్చు.

హ్యుందాయ్ గ్రాండ్ ఐ10 నియోస్

ఈ నెలలో గ్రాండ్ ఐ10 నియోస్ కొనుగోలుపైన కొనుగోలుదారు రూ. 53000 వరకు తగ్గింపు పొందవచ్చు. ఈ డిస్కౌంట్ (రూ. 53000) CNG వేరియంట్ కొనుగోలుపైన మాత్రమే లభిస్తుంది. పెట్రోల్ మాన్యువల్ గేర్‌బాక్స్‌ ఆప్షన్ కలిగిన వేరియంట్ కొనుగోలుపైన రూ. 43000 తగ్గింపు పొందవచ్చు. అదే సమయంలో పెట్రోల్ ఆటోమాటిక్ వేరియంట్ కొనుగోలుపైన రూ. 33000 తగ్గింపు లభిస్తుంది.

గ్రాండ్ ఐ10 నియోస్ 83 హార్స్ పవర్ మరియు 113 న్యూటన్ మీటర్ టార్క్ అందించే CNG ఆప్షన్లో కూడా లభిస్తుంది. దేశీయ విఫణిలో హ్యుందాయ్ గ్రాండ్ ఐ10 నియోస్.. ఇప్పటికే అమ్మకానికి ఉన్న మారుతి స్విఫ్ట్ మరియు టాటా టియాగో వంటి వాటికి ప్రత్యర్థిగా ఉంటుంది. ఈ కారు మంచి డిజైన్, అంతకు మించిన ఫీచర్స్ పొందుతుంది. పనితీరు పరంగా చాలా అద్భుతంగా ఉంటుంది.

హ్యుందాయ్ టక్సన్

టక్సన్ కొనుగోలుపైన హ్యుందాయ్ ఇప్పుడు గరిష్టంగా రూ. 50000 తగ్గింపు అందిస్తోంది. ఈ డిస్కౌంట్ టక్సన్ డీజిల్ వేరియంట్ కొనుగోలుపైన మాత్రమే లభిస్తుంది. కాగా టక్సన్ పెట్రోల్ వేరియంట్ మీద రూ. 25000 తగ్గింపు లభిస్తుంది. ఈ కారు 156 హార్స్ పవర్ అందించే 2.0 లీటర్ పెట్రోల్ ఇంజిన్ మరియు 186 హార్స్ పవర్ అందించే 2.0 లీటర్ డీజిల్ ఇంజిన్ పొందుతుంది. ఈ రెండు ఇంజిన్లు 6 స్పీడ్ ఆటోమాటిక్ గేర్‌బాక్స్‌ ఆప్షన్ పొందుతాయి. టక్సన్ దేశీయ మార్కెట్లో ఇప్పటికే విక్రయానికి ఫోక్స్‌వ్యాగన్ టిగువాన్ మరియు జీప్ మెరిడియన్ వంటి వాటికి ప్రధాన ప్రత్యర్థిగా ఉంటుంది.

హ్యుందాయ్ వెన్యూ, వెన్యూ ఎన్ లైన్

వెన్యూ మరియు వెన్యూ ఎన్ లైన్ కొనుగోలుపైన కంపెనీ గరిష్టంగా రూ. 50000 విలువైన ప్రయోజనాలను అందిస్తోంది. వెన్యూ డ్యూయెల్ క్లచ్ వేరియంట్ మీద రూ. 45000 మరియు 1.2 లీటర్ పెట్రోల్ ఇంజిన్ కలిగిన వేరియంట్ మీద రూ. 40000 విలువైన బెనిఫీట్స్ లభిస్తాయి. అదే సమయంలో వెన్యూ ఎన్ లైన్ కొనుగోలు మీద రూ. 45000 విలువైన ప్రయోజనాలు లభిస్తాయి. ఈ నెలలో డీజిల్ వేరియంట్ కొనుగోలుపైన ఎటువంటి తగ్గింపులు లేదు.

హ్యుందాయ్ ఐ 20

2024 జూన్ నెలలో హ్యుందాయ్ ఐ20 కొనుగోలుపైన కస్టమర్లు రూ. 50000 వరకు ప్రయోజనాలను పొందవచ్చు. ఐ20 సీవీటీ వేరియంట్‌లపై రూ. 35000 మరియు మాన్యువల్ వేరియంట్ కొనుగోలుపైన రూ. 50000 తగ్గింపు లభిస్తుంది. హ్యుందాయ్ ఐ20 మోడల్ 1.2 లీటర్ పెట్రోల్ ఇంజిన్ పొందుతుంది. ఇది 83 హార్స్ పవర్ ప్రొడ్యూస్ చేస్తుంది. ఈ కారు మారుతి సుజుకి బాలెనొ, టాటా ఆల్ట్రోజ్ మరియు టయోటా గ్లాంజా వంటి వాటికి ప్రధాన ప్రత్యర్థిగా ఉంటుంది.

హ్యుందాయ్ ఆరా

ఈ నెలలో హ్యుందాయ్ ఆరా కొనుగోలు చేసే కస్టమర్లు రూ. 48000 వరకు ప్రయోజనాలను పొందవచ్చు. ఈ కాంపాక్ట్ సెడాన్ యొక్క CNG వేరియంట్ కొనుగోలుపైన రూ. 48000 తగ్గింపు మరియు పెట్రోల్ వేరియంట్స్ కొనుగోలుపైన రూ. 28000 తగ్గింపు పొందవచ్చు. మంచి డిజైన్, అంతకు మించిన ఫీచర్స్ కలిగిన ఈ సెడాన్ మార్కెట్లో ఇప్పటికే అమ్మకానికి ఉన్న మారుతి డిజైర్, హోండా అమేజ్ వంటి వాటికి ప్రధాన ప్రత్యర్థిగా ఉంటుంది.

హ్యుందాయ్ వెర్నా

వెర్నా కొనుగోలుపైన రూ. 40000 వరకు తగ్గింపు లభిస్తుంది. హ్యుందాయ్ వెర్నా యొక్క అన్ని వేరియంట్ల కొనుగోలు మీద ఈ డిస్కౌంట్ లభిస్తుంది. ఈ నెలలో కొనుగోలు చేసిన వారికి మాత్రమే లభిస్తుంది. ఇది 6 స్పీడ్ మాన్యువల్ ఆప్షన్ కలిగిన 1.5 లీటర్ పెట్రోల్ (115 హార్స్ పవర్ మరియు 143 న్యూటన్ మీటర్ టార్క్) ఇంజిన్ మరియు 7 స్పీడ్ డ్యూయెల్ క్లచ్ ఆటోమాటిక్ ఆప్షన్ కలిగిన 1.5 లీటర్ టర్బో పెట్రోల్ (160 హార్స్ పవర్ మరియు 253 న్యూటన్ మీటర్ టార్క్) ఇంజిన్ పొందుతుంది. ఈ సెడాన్ మారుతి సుజుకి సియాజ్, స్కోడా స్లావియా, ఫోక్స్‌వ్యాగన్ వర్టస్ మరియు హోండా సిటీ వంటి వాటికి ప్రత్యర్థిగా ఉంటుంది.

హ్యుందాయ్ ఎక్స్‌టర్

ఇక చివరగా హ్యుందాయ్ కంపెనీ ఈ నెలలో తన ఎక్స్‌టర్ కొనుగోలుపైన కేవలం రూ. 10000 తగ్గింపు అందిస్తుంది. ఇది పూర్తిగా క్యాష్ డిస్కౌంట్. ఈ ఆఫర్ ఈఎక్స్ మరియు ఈఎక్స్ (ఓ) ట్రిమ్ కొనుగోలుపైన లభించదు. మంచి డిజైన్ మరియు ఫీచర్స్ కలిగిన ఈ కారు 1.2 లీటర్ పెట్రోల్ ఇంజిన్ పొందుతుంది. ఇది 83 హార్స్ పవర్ ప్రొడ్యూస్ చేస్తుంది. ఇది టాటా పంచ్ మరియు సిట్రోయెన్ సీ3 వంటి వాటికి ప్రధాన ప్రత్యర్థిగా ఉంటుంది.

Don’t Miss: 73 కిమీ మైలేజ్ అందించే బైక్.. కేవలం రూ.82911 మాత్రమే..

గమనిక: హ్యుందాయ్ కంపెనీ అందించే ఈ డిస్కౌంట్స్ / బెనిఫీట్స్ ఒక నగరం నుంచి మరో నగరానికి మారుతూ ఉంటాయి. అంతే కాకుండా డీలర్‌ వద్ద ఉన్న స్టాక్ మీద ఆధారపడి కూడా డిస్కౌంట్స్ ఉంటాయి. కాబట్టి కస్టమర్ హ్యుందాయ్ కార్లను కొనుగోలు చేయాలి అనుకున్నప్పుడు ఖచ్చితమైన డిస్కౌంట్స్ గురించి తెలుసుకోవడానికి స్థానిక డీలర్‌ను సంప్రదించాలి. ఈ డిస్కౌంట్స్ ఈ నెల చివరి (జూన్ 30) వరకు మాత్రమే అందుబాటులో ఉంటుంది. ఆ తరువాత బహుశా ఈ ఆఫర్స్ అందుబాటులో ఉండకపోవచ్చు.