దశాబ్దాల చరిత్రకు పూర్వవైభవం!.. బీఎస్ఏ గోల్డ్ స్టార్ 650 వచ్చేస్తోంది – ధర ఎంతంటే?

Upcoming Bikes in India Know the BSA Gold Star 650: భారత స్వాతంత్య్ర దినోత్సవం ఎప్పుడెప్పుడు వస్తుందా అని చాలామంది వాహన ప్రియులు వేయి కళ్ళతో ఎదురు చూస్తున్నారు. ఎందుకంటే ఈ నెల 15న (ఆగష్టు 15) భారతీయ విఫణిలో కొన్ని కంపెనీలు తమ కొత్త వాహనాలను లాంచ్ చేయడానికి, మరికొన్ని కంపెనీలు పరిచయం చేయడానికి సిద్ధంగా ఉన్నాయి. ఈ జాబితాలో ‘బీఎస్ఏ మోటార్‌సైకిల్’ (BSA Motorcycle) బ్రాండ్ యొక్క ‘గోల్డ్ స్టార్ 650’ (గోల్డ్ Star 650) కూడా ఉంది.

లాంచ్ డేట్ & డెలివరీ

బీఎస్ఏ మోటార్‌సైకిల్ కంపెనీ ఆగష్టు 15 గురువారం తన గోల్డ్ స్టార్ 650 బైకును అధికారికంగా దేశీయ మార్కెట్లో లాంచ్ చేస్తుంది. అయితే కంపెనీ ఈ బైకును మార్కెట్లో అధికారికంగా లాంచ్ చేసిన తరువాత డెలివరీలు 2024 చివరలో లేదా 2025 ప్రారంభంలో ఉంటాయని తెలుస్తోంది.

డిజైన్ & ఫీచర్స్

త్వరలో లాంచ్ కానున్న కొత్త బీఎస్ఏ గోల్డ్ స్టార్ 650 బైక్ 1960 నాటి క్లాసిక్ బీఎస్ఏ గోల్డ్ స్టార్‌ని గుర్తుకు తెస్తుంది. మొదటి చూపుతోనే పాత, కొత్త బైకులకు సారూప్యతను కనుగొనటం కొంత కష్టమే! అయినప్పటికీ ఇందులో కాస్మొటిక్ అప్డేట్స్ ద్వారా ఇది లేటెస్ట్ బైక్ అని చెప్పకనే చెప్పేస్తుంది.

బీఎస్ఏ గోల్డ్ స్టార్ 650 బైక్ టియర్ డ్రాప్ ఫ్యూయెల్ ట్యాంక్, వైర్ స్పోక్ వీల్స్, రౌండ్ హెడ్‌లైట్‌ విత్ డీఆర్ఎల్ (డేటైమ్ రన్నింగ్ లైట్) అన్నీ పాత మోడల్ బైకును జ్ఞప్తికి తెస్తాయి. రీడింగ్‌లతో కూడిన అనలాగ్ డయల్స్ రిట్రో టచ్‌ను పొందుతాయి. బీఎస్ఏ లోగోస్, ఎగ్జాస్ట్ ఆధునిక క్లాసిక్ రూపానికి సరిపోయేలా ఉన్నాయి. మొత్తం మీద ఇది ఒక్క చూపుతోనే ఇట్టే కట్టిపడేస్తుందని ఫోటోలు చూడగానే అర్థమైపోతోంది.

గోల్డ్ స్టార్ 650 బైక్ యొక్క ఇంజిన్ ట్యూబులర్ స్టీల్ ఫ్రేమ్ మీద అమర్చబడి ఉంటుంది. ఇది బైక్‌కు క్లాసిక్ డిజైన్ అందించడమే కాకుండా మంచి పనితీరును కూడా అందించేలా సహాయపడుతుంది. అయితే ఇదెలా పనిచేస్తుందో తెలియాలంటే ఇంకా కొన్ని రోజులు వేచి చూడకతప్పదు. సుమారు 213.5 కేజిల బరువు కలిగిన ఈ బైక్ అత్యద్భుతమైన రైడింగ్ అనుభూతిని అందిస్తుందని మాత్రం ఖచ్చితంగా చెప్పవచ్చు.

బీఎస్ఏ గోల్డ్ స్టార్ 650 బైక్ 5 స్టెప్స్ అడ్జస్టబుల్ 120 మిమీ ట్రావెల్ మరియు రియర్ ట్విన్ షాక్‌లతో ముందు భాగంలో టెలిస్కోపిక్ ఫోర్క్ కలిగి ఉంటుంది. అయితే భారతీయ విఫణిలో లాంచ్ కానున్న ఈ కొత్త బైక్.. ఇప్పటికే యూకేలో అమ్ముడవుతున్న మోడల్ మాదిరిగానే ట్యూబ్‌లెస్ టైర్లను పొందుతుందా? లేదా? అనేది తెలియాల్సిన ప్రశ్నగా మారింది.

ఈ కొత్త బైక్ 320 మిమీ ఫ్రంట్ డిస్క్ మరియు 255 మిమీ రియర్ డిస్క్ బ్రేక్స్ పొందుతుంది. ఇందులో డ్యూయెల్ ఛానల్ ఏబీఎస్ ఉంటుంది. అంతే కాకుండా ఈ బైక్ యొక్క ముందు భాగంలో 18 ఇంచెస్ వీల్స్, వెనుక 17 ఇంచెస్ వీల్స్ ఉంటాయి. రెండూ కూడా స్పోక్డ్ రిమ్స్ పొందుతాయి. సీటు ఎత్తు 782 మీమీ వరకు ఉంటుంది. మొత్తం మీద ఇది అన్ని విధాలా చాలా అనుకూలంగా ఉంటుందని మాత్రం ఖచ్చితంగా చెప్పవచ్చు.

ఇంజిన్

కొత్త బీఎస్ఏ గోల్డ్ స్టార్ 650 బైకులో తప్పకుండా తెలుసుకోవలసిన అంశం ఇంజిన్. కాబట్టి ఇంజిన్ విషయానికి వస్తే.. ఇది పెరుగు తగ్గట్టుగానే 650 సీసీ సింగిల్ సిలిండర్ 4 వాల్వ్ ఇంజిన్ పొందుతుంది. ఇది 6000 rpm వద్ద 45 Bhp పవర్ మరియు 4000 rpm వద్ద 55 Nm టార్క్ ప్రొడ్యూస్ చేస్తుంది. పర్ఫామెన్స్ ఎలా ఉంటుందనేది తెలియాల్సి ఉంది.

అంచనా ధర & ప్రత్యర్థులు

బీఎస్ఏ గోల్డ్ స్టార్ 650 బైక్ ధర రూ. 3 లక్షలు ఉంటుందని అంచనా. అయితే కంపెనీ ఇప్పటి వరకు అధికారిక ధరలు వెల్లడించలేదు. ఆగష్టు 15న సంస్థ అధికారికంగా వెల్లడించనుంది. దేశీయ విఫణిలో అడుగుపెట్టనున్న ఈ బైక్ ఇప్పటికే మార్కెట్లో అమ్మకానికి ఉన్న రాయల్ ఎన్‌ఫీల్డ్ ఇంటర్‌సెప్టర్ 650కు ప్రధాన ప్రత్యర్థిగా ఉంటుంది.

Don’t Miss: భారత్‌లో సరికొత్త సిట్రోయెన్ బసాల్ట్ లాంచ్.. ధర ఎంతో తెలుసా?

నిజానికి బీఎస్ఏ మోటార్‌సైకిల్ కంపెనీ ఒకప్పటి నుంచి గ్లోబల్ మార్కెట్లో విపరీతమైన క్రేజును సంపాదించుకుంది. అలంటి కంపెనీ ఇప్పుడు మళ్ళీ భారతీయ విఫణిలో పూర్వవైభవాన్ని పొందటానికి సన్నద్ధమవుతోంది. తప్పకుండా కంపెనీ లాంచ్ చేయనున్న బైక్ వాహనప్రియులను ఆకర్షిస్తుందని, అత్యుత్తమ అమ్మకాలను పొందుతుందని భావిస్తున్నాము.