Venkatesh Devi Putrudu Child Artist Vega Tamotia Latest Look: ఫ్యామిలీ స్టార్.. విక్టరీ వెంకటేష్ నటించిన అద్భుతమైన సినిమాల్లో ఒకటి దేవీ పుత్రుడు. దివంగత డైరెక్టర్ కోరి రామకృష్ణ రూపొందించిన ఈ సినిమాలో సౌందర్య, అంజలీ జవేరి కూడా నటించారు. శ్రీకృష్ణుడి ద్వారకా సముద్రం అడుగున ఉండనే నేపథ్యంలో తెరకెక్కిన ఈ సినిమా అప్పట్లో సంచలనం సృష్టించింది. ఈ సినిమాకు మణిశర్మ అందించిన మ్యూజిక్ వేరే లెవెల్ అనే చెప్పాలి. ఎందరెలా ఉన్నా.. కెరటాల అడుగున, కనుచూపు మరుగున నిదుర పోతున్నది ద్వారకా అనే పాటలో కనిపించిన చిన్న పాప ఎంతోమంది హృదయాలను కొల్లగొట్టింది.
2001లో రిలీజ్ అయిన ఈ సినిమాలో కనిపించిన ఈ చిన్న పాపకు ఓ సపరేట్ ఫ్యాన్స్ పాలోయింగ్ కూడా ఉంది. దేవీ పుత్రుడు సినిమా తరువాత ఈ అమ్మడు కనిపించలేదు. ఈ చైల్డ్ ఆర్టిస్ట్ పేరు ‘వేగా తమోటియా’ (Vega Tamotia).
వేగా తమోటియా
చిన్నప్పుడే తన నటనతో పాపులర్ చైల్డ్ ఆర్టిస్ట్ పేరు సంపాదించుకున్న వేగా తమోటియా.. 1985లో ఛత్తీస్‌గఢ్‌లో జన్మించింది. పుట్టింది ఇండియాలో అయినా.. ఈమె ఆస్ట్రేలియాలోని సిడ్నీలో పెరిగింది. న్యూ సౌత్ వేల్స్ యూనివర్సిటీ నుంచి ఎకానమీ పూర్తి చేసి.. ఆ తరువాత ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ మేనేజ్‌మెంట్ బెంగళూరులో చేరింది.
బాల్యం నుంచే నటనపై ఆసక్తి పెంచుకున్న వేగాకు.. నాటకం మరియు నటన వంటి వాటి మీద ఆసక్తి కొంత ఎక్కువ. ఈ కారణంగానే పాఠశాలలో చదివే రోజుల్లోనే నాటకాల్లో పాల్గొనేది. చదువు పూర్తయిన తరువాత ముంబైలోని ప్రొఫెషనల్ థియేటర్ పూర్తి చేసింది. ఆ సమయంలోనే స్వానంద్ కిర్కిరే ఆమెను కలిసి హిందీ సంగీత నాటకంలో ఆవో సాథి సప్నా దేఖెయిన్‌లో ప్రధాన మహిళా పాత్రను పోషించడానికి ఆహ్వానించాడు. దీనికి ఆమె మెటా (మహీంద్రా ఎక్సలెన్స్ ఇన్ థియేటర్ అవార్డు సొంతం చేసుకుంది.
వేగా తమోటియా కేవలం నటి మాత్రమే కాదు. నిర్మాత కూడా. ఈమె తెలుగు, తమిళం, హిందీ, ఇంగ్లీష్ వంటి భాషల్లోని సినిమాల్లో కూడా నటించింది. తమిళంలో సరోజ సినిమాతో మంచి పేరు సంపాదించుకుంది. తెలుగు సినిమాల్లో నటించి పెద్దగా పేరు సంపాదించలేకపోయినా.. తమిళం మరియు హిందీలో కొంత సక్సెస్ సాధించగలిగింది. ఆ తరువాత కాలంలో సినిమా అవకాశాలు బాగా తగ్గిపోయాయి. ఆఫర్స్ తగ్గిపోవడంతో.. ప్రస్తుతం సోషల్ మీడియాలో యాక్టివ్‌గా ఉంటూ ఎన్నో ఆసక్తికరమైన విషయాలను షేర్ చేస్తూ ఉంటుంది. దేవీ పుత్రుడు సినిమాలో బొద్దుగా కనిపించిన వేగా తమోటియా.. ఇప్పుడు ముద్దుగా ఎంతోమందిని ఆకట్టుకుంటోంది.
Also Read: మనసులో మాట చెప్పిన అనసూయ.. వారు కమిట్మెంట్ అడిగారు: ఎంతో కోల్పోయా..
నిజానికి.. ఒకప్పుడు బాగా పాపులర్ అయి తరువాత ఆఫర్స్ లేకుండా కనుమరుగైన హీరోయిన్స్ సినీరంగంలో చాలామందే ఉన్నారు. ఈ కోవకు చెందిన వారిలో వేగా తమోటియా మాత్రమే కాకుండా.. ఇంకా ఎంతోమంది ఉన్నారు. ఇందులో వెండితెర నుంచి బుల్లితెరకు వచ్చి అక్కడ నటిస్తున్న వారి సంఖ్య కూడా ఎక్కువగానే ఉంది. మరికొందరు బుల్లితెర నుంచి వెండితెరకు ఎదిగినవారు కూడా ఉన్నారు. దీన్ని బట్టి చూస్తే.. సినీ రంగంలో హీరోయిన్లకు అవకాశాలు అంతంత మాత్రమే ఉంటాయని స్పష్టమవుతోంది.