వెట్రిమారన్ ఎట్టకేలకు తన కొత్త సినిమా అప్డేట్ ఇచ్చేశాడు. శిలంబరసన్ (శింబు)తో చేస్తున్న తమిళంలో అరసన్ సినిమా ప్రోమో వీడియోని తెలుగులో సామ్రాజ్యం పేరుతో వడా చెన్నై గురించి చెప్పని కథ అని సోషల్ మీడియాలో విడుదల చేశారు. దీంతో తమిళ, తెలుగు రాష్ట్రాల్లో ఉన్న వెట్రి & శింబు అభిమానులు దీపావళి పండుగకు ఇచ్చిన బహుమతిగా భావిస్తూ మొత్తం సంతోషంలో మునిగి తేలుతున్నారు. దీనికి సంబంధించిన మరికొన్ని విషయాలు ఇక్కడ తెలుసుకుందాం..
సినిమా రిలీజ్ ఎప్పుడంటే?
వీ క్రియేషన్స్ పతాకంపై కలైపులి ఎస్ థాను ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. విభిన్న సినిమాల దర్శకుడైన వెట్రిమారన్.. స్టోరీ, డైరెక్షన్ బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. పాపులర్ మ్యూజిక్ డైరెక్టర్ అనిరుద్ రవిచంద్రన్ సినిమాకు సంగీతం అందిస్తున్నారు. ఇందులో హీరోగా శిలంబరసన్ టి. ఆర్ (శింబు) అద్భుతమైన మాస్ క్యారెక్టర్‌లో నటిస్తున్నారు. కిషోర్ కుమార్. జి, సముద్రఖని, ఆండ్రియా తదితరులు కీలకపాత్రలు పోషిస్తున్నారు. 2025లోనే ఈ మూవీని విడుదల చేయడానికి ప్లాన్ చేస్తున్నట్టుగా సోషల్ మీడియా కొన్ని వార్తలు వస్తున్నప్పటికీ.. ఇది 2026లో రిలీజ్ అయ్యే అవకాశం ఉంది.
కథ ఏంటంటే?
తమిళనాడులోని.. నార్త్ చెన్నైలో కొన్ని గ్రూపుల మధ్య జరిగే గ్యాంగ్ వార్లు, పవర్ కోసం వాళ్ళు చేసే రాజకీయాలు మరియు ప్రాంతంపై అధిపత్యం చేలాయించడానికి వారు చేసే హత్యలు, అన్నీ సామాజిక, రాజకీయ, ఆర్థిక, మాస్ యాక్షన్ డ్రామా ఉండనున్నట్టు బయట వినబడుతున్నది. వెట్రి మారన్ ఇంతకు ముందు వడా చెన్నై పేరుతో హీరో ధనుష్తో ఒక సినిమా చేశారు. ఆ సినిమా సృష్టించిన సంచలనం అంతా ఇంతా కాదు. ఒక ప్రభంజనం సృట్టించిందనే చెప్పాలి. ఆ మూవీకి ధనుష్ స్టైల్‌లో యాక్టింగ్, వెట్రి మారన్ దర్శకత్వం, మ్యూజిక్ అన్నీ కూడా బాగా కుదిరాయి.
ఇప్పుడు అదే నార్త్ చెన్నై బ్యాక్‌డ్రాప్‌లో వస్తున్న కారణంగా.. ఊహాగానాలు పెరిగిపోయాయి అని తెలుస్తోంది. కానీ ఇది వడా చెన్నైకి సీక్వెల్ కాదని ఇప్పటికే వెట్రి మారన్ ప్రకటించారు. శింబుతో తీస్తున్నది వేరే కథ అని.. ధనుష్‌తో పార్ట్-2 కథ వేరే ఉందని చెప్పారు. అదేంటో తెలియాలి అంటే రిలీజ్ వరకు ఆగాల్సిందే. ఇది వెట్రి మార్క్ మూవీ అనే చెప్పాలి.
టీజర్ గురించి..
శింబు రక్తంతో తడిసిన బట్టలతో, చేతిలో కత్తిపట్టుకుని వచ్చే సీన్ హైలెట్‌గా ఉంది. దానికి అనిరుద్ మ్యూజిక్ మరింత హైప్ క్రియేట్ చేసింది. వీడియో మొదటిలోనే ‘ఇది వాస్తవ సంఘటనల ఆధారంగా తీస్తున్న కథ అని దీంతో కొంత మంది జైలుకు వెళ్లే అవకాశం కూడా ఉంటుంది’ అని చెప్పి కానీ దానికి డిస్‌క్లైమర్ వేసుకోమని ముందే హీరోతో చెప్పించాడు డైరెక్టర్. కానీ అది నిజజీవిత ఆధారమే అయినా డైరెక్టర్‌కు అది చెప్పడం ఇష్టం లేదు అని అర్థం అవుతున్నది. దీనికి అతని కారణాలు అతనికి ఉండొచ్చు కానీ ఇది ఎవరి గురించి అనేది ఆసక్తిగా మారింది. కోర్ట్ సీన్లు కూడా బాగున్నాయి.