విలక్షణ నటుడు మక్కల్ సెల్వన్ విజయ్ సేతుపతి కుమారుడు సూర్య సేతుపతి.. ఫీనిక్స్ అనే చిత్రంతో సినిమా ఇండస్ట్రీలోకి అడుగు పెట్టాడు. ఇప్పటికే ఈ సినిమా తమిళంలో విడుదలై మంచి పాజిటివ్ టాక్ తెచ్చుకునింది. ఇప్పుడు దీనిని విజయ్ సేతుపతికి ఉన్న ఫాలోయింగ్ వల్ల.. తెలుగులో కూడా రిలీజ్ చేయడానికి సిద్ధమాయ్యారు. 2025 నవంబర్ 07న ఈ సినిమాని ప్రేక్షకుల ముందుకు తీసుకురానున్నారు.
యాక్షన్ సినిమాలో సూర్య సేతుపతి
ఫీనిక్స్ సినిమాకు సంబంధించిన తెలుగు ట్రైలర్, పాటలకి సోషల్ మీడియాలో ఇప్పటికే మంచి స్పందన లభిస్తోంది. అంతేకాక మూవీ టీమ్ హైదరాబాద్‌లో ప్రీ-రిలీజ్ కార్యక్రమాన్ని కూడా నిర్వహించడం జరిగింది. ఇందుకు ముఖ్య అతిధిగా విజయ్ సేతుపతి పాల్గొన్నాడు. తెలుగు ప్రేక్షకులంతా తన కుమారున్ని ఆదరించాలని ఆయన కోరాడు. సూర్య సేతుపతికి యాక్షన్ మరియు మాస్ చిత్రాలంటే బాగా ఇష్టమట. అందుకే ఇలాంటి సబ్జెక్టు ఎంచుకున్నాడని చెప్పుకొచ్చాడు.
అలాగే ఈ సినిమాలో నటించిన వరలక్ష్మి శరత్ కుమార్ ఈవెంట్‌లో భాగమయ్యారు. ఆమె మాట్లాడుతూ తెలుగు వాళ్లు ఒక్కసారి అభిమానిస్తే ఎప్పటికి వదులుకోరు అని, ఆ విషయం తనకి తెలుసునని అన్నారు. సూర్య సేతుపతికి మంచి భవిష్యత్తు ఉండాలని ఆశీర్వదించారు. ఇందులో చాలా మంది పాపులర్ తెలుగు.. తమిళ నటులు నటించడం జరిగింది. అందుకని తెలుగులో కూడా ఎక్కువ మందికి చేరువ అవుతుంది అనడంలో సందేహం లేదు.
దుమ్మురేపుతున్న ట్రైలర్
తెలుగులో ఒక వీడియో సాంగ్ అయితే రిలీజ్ అయింది. ఒక బస్తీలో పేద జనం మధ్య ఆ పాట మొత్తం జరుగుతుంది. కష్టం చేసుకుని బతికే వీధుల్లో అక్కడ నివసిస్తున్న వారి జీవనాన్ని దర్శకుడు బాగా చూపించాడు. పాటలో చాలా లోతైన అర్థం దాగి ఉంది. మాస్ ప్రేక్షకులకు ఈ పాట ఒక ఊపు తెప్పిస్తుంది. వారే టార్గెట్‌గా సినిమా తీసినట్టుగా అనిపిస్తుంది.
ట్రైలర్ రచ్చలేపుతోంది, ఫైట్ సీన్లు, చేజింగ్స్, యాక్షన్ సీన్లు అన్నీ కూడా.. ఒక్క సినిమాకే అదరగోట్టేసాడు. తనకు నచ్చిన జోనర్ మాస్ యాక్షన్ సినిమాలు.. కాబట్టి అందుకు తగినట్టే కథ ఎంచుకున్నాడు. ఇది తనకి మొదటి చిత్రం అయినా.. ఎక్కడ కూడా అలాంటి భావన అయితే కలగడం లేదు. బాగా అనుభవం కలిగిన నటుడు చేసిన విధంగానే సూర్య సేతుపతి చేశాడు. విజయ్ సేతుపతి అంత అయితే మనం ఊహించలేము.
కథ ఇలా..
ఒక రాజకీయ నాయకున్ని చంపిన కేసులో పదహారు, పదిహేడేళ్ల కుర్రాడు బాల నేరస్తుల శిబిరంలో ఉంటాడు. ఇందులో ఒక స్పోర్ట్స్ డ్రామా కూడా కలగలిసి ఉంది. హీరో జీవితం ఆ గేమ్ ఆధారంగానే నిర్ణయించబడుతుంది. అందులో గెలిస్తేనే వారికి జీవితం ఉంటుంది. ఒకటి ఆట, రెండోది చదువు.. వీటిలో మాత్రమే ఎదగగలరు, లేకపోతే లేదు. అయితే ఆ తరువాత ఏమైంది అనే దానికి మనం సినిమా చూడాల్సిందే.
సూర్య సేతుపతిని చూసి కాకుండా కేవలం విజయ్ సేతుపతి కొడుకుగా చూడటానికే ప్రేక్షకులు థియేటర్లకు వచ్చే అవకాశం ఉంటుంది. తెలుగులో అతని అరంగేట్రం ఏ మేరకు విజయం సాధిస్తుందో చూడాలి. ఈ సినిమా రిలీజ్ రోజే.. తెలుగు స్ట్రెయిట్ మూవీలు సుధీర్ బాబు జటాధార, తిరువీర్.. ది గ్రేట్ ప్రీ- వెడ్డింగ్ షో, రష్మిక మందన.. ది గర్ల్ ఫ్రెండ్, ప్రియదర్శి.. ప్రేమంటే ఇలాంటి సినిమాలు పోటాపోటీగా దిగుతున్నాయి. మరి వాటి ముందు ఫీనిక్స్ తట్టుకుని నిలబడుతుందా.