ఫోక్స్‌వ్యాగన్ ‘ఓనం ఎడిషన్’ కార్లు: కేవలం 100 మందికే..

Volkswagen Taigun and Virtus Onam Edition Launched in India: జర్మనీ కార్ల తయారీ సంస్థ ‘ఫోక్స్‌వ్యాగన్’ (Volkswagen) ఇప్పటికే భారతీయ విఫణిలో వర్టస్ మరియు టైగన్ కార్లను విక్రయిస్తోంది. కాగా ఇప్పుడు ఈ కార్లను ‘ఓనం ఎడిషన్’ (Onam Edition) రూపంలో మార్కెట్లో అధికారికంగా లాంచ్ చేసింది. అయితే ఈ కార్లు ఒక్క రాష్ట్రానికి మాత్రమే పరిమితమై ఉంటాయని తెలుస్తోంది. త్వరలోనే ఓనం పండుగ రానున్న సందర్భంగా కంపెనీ ఈ కార్లను విడుదల చేసింది.

ధర

ఫోక్స్‌వ్యాగన్ లాంచ్ చేసిన టైగన్ ఓనం ఎడిషన్ ధరలు రూ. 14.08 లక్షల నుంచి రూ. 15.63 లక్షలు. కాగా వర్టస్ ఓనం ఎడిషన్ ధరలు రూ. 13.57 లక్షల నుంచి రూ. 14.87 లక్షల మధ్య ఉన్నాయి. ఓనం ఎడిషన్స్ కేవలం కేరళ రాష్ట్రంలో మాత్రమే అందుబాటులో ఉండనున్నట్లు సమాచారం. అంటే దేశంలో ఇతర రాష్ట్రాల్లో ఈ కారు విక్రయానికి ఉండవని తెలుస్తోంది.

100 మందికి మాత్రమే

కేరళ రాష్ట్రంలో విక్రయానికి రానున్న కొత్త ఫోక్స్‌వ్యాగన్ ఓనం ఎడిషన్స్ కేవలం 100 యూనిట్లకు మాత్రమే పరిమితం చేశారు. అంటే వీటిని వంద మంది మాత్రమే కొనుగోలు చేయడానికి అవకాశం ఉంటుంది. ఇవి పూర్తిగా బ్లాక్ కలర్ ఆప్షన్‌లో మాత్రమే అందుబాటులో ఉన్నాయి.

ఫోక్స్‌వ్యాగన్ రాబోయే ఓనం పండుగను పురస్కరించుకుని ఈ కార్లను లాంచ్ చేయడమే కాకుండా.. కేరళ రాష్ట్రంలో కొత్తగా ఆరు టచ్ టచ్‌పాయింట్‌లను ప్రారంభించింది. దీనికి సంబంధించిన ప్రారంభోత్సవాన్ని కూడా కంపెనీ జరుపుకుంది.

ఓనం ఎడిషన్లు కేరళలో మాత్రమే అందుబాటులో ఉంటాయి మరియు ఉత్పత్తి ఒక్కొక్కటి 100 యూనిట్లకు పరిమితం చేయబడుతుంది. రెండు మోడల్‌లు పూర్తిగా నలుపు రంగులో ఉంటాయి మరియు ఫ్రంట్ పార్కింగ్ సెన్సార్‌లు, డ్యూయల్-టోన్ హార్న్ మరియు పుడిల్ ల్యాంప్స్ వంటి అదనపు ఫీచర్‌లను పొందుతాయి.

ఫోక్స్‌వ్యాగన్ యొక్క టైగన్ ఓనం ఎడిషన్.. టైగన్ జీటీ వేరియంట్ ఆధారంగా, వర్టస్ ఓనం ఎడిషన్.. వర్టస్ హైలైన్ ఆధారంగా రూపొందించబడినట్లు స్పష్టమవుతోంది. కాబట్టి డిజైన్ మరియు ఫీచర్స్ పరంగా చెప్పుకోదగ్గ అప్డేట్స్ లేదు. ధరల్లో కూడా ఎటువంటి మార్పులు లేకపోవడం గమనార్హం.

ఇప్పటికే చెప్పుకున్నట్లు ఫోక్స్‌వ్యాగన్ ఓనం ఎడిషన్స్ ఒక్కొక్కటి 100 యూనిట్లకు మాత్రమే పరిమితమయ్యాయి. ఈ రెండు ఎడిషన్స్ యొక్క గ్రిల్ క్రోమ్ బిట్ పొందుతుంది. మిగిలిన భాగం మొత్తం నలుపు రంగులోనే ఉంది. ఫ్రంట్ పార్కింగ్ సెన్సార్లు, డ్యూయెల్ టోన్ హార్న్ వంటివి ఉన్నాయి. ఫ్రంట్ ఫెండర్‌లో టీఎస్ఐ బ్యాడ్జ్ రూపంలో అదనపు ఫీచర్స్ కూడా ఉన్నాయి.

డిజైన్ మరియు ఫీచర్స్

టైగన్ ఓనం ఎడిషన్ 17 ఇంచెస్ క్యాసినో అల్లాయ్ వీల్స్, 8 ఇంచెస్ డిజిటల్ డ్రైవర్ డిస్‌ప్లే, 10 ఇంచెస్ టచ్‌స్క్రీన్ ఇన్ఫోటైన్‌మెంట్ సిస్టం, సన్‌రూఫ్, వెంటిలేటెడ్ ఫ్రంట్ సీట్లు, ఆటోమాటిక్ క్లైమేట్ కంట్రోల్ మొదలైనవి ఉన్నాయి. ఇవన్నీ కూడా దాదాపు నలుపు రంగులోనే ఉంటాయి.

ఇక ఫోక్స్‌వ్యాగన్ వర్టస్ ఓనం ఎడిషన్ విషయానికి వస్తే.. టైగన్ ఓనం ఎడిషన్‌లోని దాదాపు అన్ని ఫీచర్స్ పొందుతుంది. అయితే ఇందులో సన్‌రూఫ్ లేదని తెలుస్తోంది. ఈ ఎడిషన్ డిజైన్ మరియు ఫీచర్స్ అన్నీ కూడా నలుపు రంగులోనే ఉంటాయు. ఈ రెండు ఎడిషన్స్ తప్పకుండా వాహన ప్రేమికులను ఆకర్షిస్తుందని భావిస్తున్నాము.

ఇంజిన్

ఫోక్స్‌వ్యాగన్ ఓనం ఎడిషన్స్ కేవలం 1.0 లీటర్ టర్బో పెట్రోల్ ఇంజన్‌తో మాత్రమే అందుబాటులో ఉంటాయి. ఈ ఇంజిన్ 113 బీహెచ్‌పీ పవర్, 178 న్యూటన్ మీటర్ టార్క్ అందిస్తుంది. ఇది 6 స్పీడ్ మాన్యువల్ లేదా 6 స్పీడ్ ఆటోమాటిక్ గేర్‌బాక్స్ ఆప్షన్స్ పొందుతుంది. కాబట్టి పర్ఫామెన్స్ కూడా దాదాపు స్టాండర్డ్ మోడల్స్ మాదిరిగానే ఉంటాయని భావిస్తున్నాము.

Don’t Miss: రూ. లక్షల ఆఫర్స్.. కొత్త కారు కొనుగోలుకు ఇదే మంచి సమయం

ఫోక్స్‌వ్యాగన్ ఆగష్టు డిస్కౌంట్స్

కంపెనీ ఈ నెలలో తన టైగన్, వర్టస్ మరియు టిగువాన్ కార్ల మీద అద్భుతమైన ప్రయోజనాలను అందిస్తోంది. ఈ ప్రయోజనాలను పొందాలనుకుంటే ఈ కార్లను ఈ నెల చివరిలోపే కొనుగోలు చేయాలి. అంటే సంస్థ అందించే ఆఫర్స్ కేవలం ఆగష్టు 31 వరకు మాత్రమే అందుబాటులో ఉంటాయి. ఫోక్స్‌వ్యాగన్ అందించే ఆఫర్స్ లేదా బెనిఫీట్స్ గురించి ఖచ్చితమైన వివరాలు తెలుసుకోవడానికి సమీపంలోని డీలర్షిప్ సందర్శించి తెలుసుకోవచ్చు.