Next Kumbh Mela Date and Place Details: భారతీయులు ఎంతో పవిత్రంగా భావించే మహా కుంభమేళా 144 ఏళ్లకు ఒకసారి వస్తుందనే విషయం అందరికీ తెలిసిందే. 2025 జనవరి 13న ప్రారంభమలైన ప్రయాగ్‌రాజ్ కుంభమేళా మహా శివరాత్రి పర్వ దినాన (ఫిబ్రవరి 26) నిర్విఘ్నంగా పూర్తయింది. సుమారు 60 కోట్లమంది ప్రజలు త్రివేణి సంగమంలో (గంగా, యమునా, సరస్వతి) పవిత్ర స్నానాలు చేసి తరించారు. ఈ కుంభమేళాకు ఒక్క భారతీయులు మాత్రమే కాకుండా.. ప్రపంచ నలుమూలల నుంచి ఎంతోమంది జనం పెద్ద ఎత్తున తరలి వచ్చారు.
మొత్తానికి 45 రోజులు జరిగిన కుంభమేళా.. మళ్ళీ ఎప్పుడు వస్తుందనేది ఇప్పుడు ప్రశ్న. మళ్ళీ ప్రయాగ్‌రాజ్ మహా కుంభమేళా రావడానికి చాలా సమయం ఉన్నప్పటికీ.. ఆ మధ్యలోనే హరిద్వార్ కుంభమేళా, నాసిక్ కుంభమేళా మరియు ఉజ్జయినీ కుంభమేళా వంటివి జరగనున్నాయి. ఇవి ఎప్పుడు జరిగే అవకాశం ఉందంటే..
నాసిక్ కుంభమేళా (Nashik Kumbh Mela)
ప్రయాగ్‌రాజ్ కుంభమేళా పూర్తయినప్పటికీ.. 2027లో నాసిక్ కుంభమేళా జరగనుంది. ఈ కుంభమేళా కోసం ఇప్పటికే ఏర్పాట్లన్నీ పూర్తయ్యాయి. ఇప్పటికి ఉన్న సమాచారం ప్రకారం.. 2027 జులై 17న మొదలైన, ఆగష్టు 17న ముగుస్తుందని తెలుస్తోంది. 2015 నిరవహించబడిన ఈ కుంభమేళా 12 ఏళ్లకు మళ్ళీ జరగనుంచి. గోదావరి నది ఒడ్డున ఉన్న నాసిక్ నుంచి సుమారు 38 కిమీ దూరంలో ఉన్న త్రయంబకేశ్వరంలో ఈ కార్యక్రమం జరగనుంది. ఇక్కడికి కూడా పెద్ద ఎత్తున భక్తులు రానున్నారు.
హరిద్వార్ కుంభమేళా (Haridwar Kumbh Mela)
2027లోనే హరిద్వార్ కుంభమేళా కూడా ప్రారభం కానుంది. అయితే ఇది ఎప్పుడు నిర్వహించబడుతుందనే తేదీ అధికారికంగా వెలువడలేదు. కానీ హిందూ జ్యోతిష్య శాస్త్రం ప్రకారం.. బృహస్పతి కుంభరాశిలో ఉన్నప్పుడు.. సూర్యుడు మేషరాశిలోకి ప్రవేశించినప్పుడు.. ఈ కుంభమేళా జరుగుతుందని సమాచారం. ఇక్కడ ఆరు సంవత్సరాలకు ఒకసారి అర్ద కుంభమేళా, 12 ఏళ్లకు ఒకసారి కుంభమేళా జరుగుతుంది. కాబట్టి అర్ధ కుంభమేళా 2021లోనే జరిగింది. ఇక 2027లో కుంభమేళా జరగనుంది.
ఉజ్జయినీ కుంభమేళా (Ujjain Kumbh Mela)
ఇతర కుంభమేళాల మాదిరిగా కాకుండా.. ఉజ్జయినిలో ప్రతి 12 సంవత్సరాలకు ఒకసారి శిప్రా నది ఒడ్డున సింహస్థ కుంభమేళా నిర్వహించబడుతుంది. అయితే 2028లో ఈ కుంభమేళా జరగనుంది. ఈ కుంభమేళా కార్యక్రమానికి సన్నాహాలు సిద్ధం చేస్తున్నట్లు.. మధ్యప్రదేశ్ ముఖ్యమంత్రి మోహన్ యాదవ్ పేర్కొన్నారు. ఈ కార్యక్రమం కోసం ఏకంగా 3300 హెక్టార్ల విస్తీరణంలో ఒక ప్రత్యేకమైన ఆధ్యాత్మిక నగరాన్ని ఏర్పాటు చేయనున్నట్లు చెబుతున్నారు. ఈ కుంభమేళాకు కూడా పెద్ద ఎత్తున ప్రజలు రానున్నట్లు సమాచారం.
ప్రయాగ్‌రాజ్ అర్ధ కుంభమేళా (Prayagraj Ardh Kumbh Mela)
ఇటీవల మహా కుంభమేళా జరిగిన ప్రయాగ్‌రాజ్‌లోనే 2030న అర్థ కుంభమేళా జరగనుంది. హరిద్వార్ మాదిరిగానే.. కుంభమేళా మరియు అర్ధ కుంభమేళా రెండూ ప్రయాగ్‌రాజ్‌లోనూ జరుగుతాయి. అయితే మహా కుంభమేళాకు ఉన్నంత ప్రాధాన్యత ఈ కుంభమేళాలకు ఉండకపోవచ్చు కానీ.. ప్రజలు మాత్రం భారీగా తరలి వస్తారు.
మహా కుంభమేళా 2025 విశేషాలు (Maha Kumbh Mela 2025)
2025 జనవరి 13న ప్రారంభమైన మహా కుంభమేళా ఫిబ్రవరి 26కు సమాప్తమైంది. ప్రపంచాన్నే తనవైపు తిప్పుకున్న మహా కుంభమేళాకు సాధారణ ప్రజలు, సెలబ్రిటీలు.. పారిశ్రామికవేత్తలు సైతం విచ్చేశారు. పుణ్యస్నానాలు చేసి తరించారు. ఇందులో ప్రధాన ఆకర్షణగా నరేంద్ర మోదీ, ముకేశ్ అంబానీ ఫ్యామిలీ నిలిచింది.
Also Read: మహా కుంభమేళా 2025: సోషల్ మీడియాను షేక్ చేస్తున్న 5 ఘటనలు ఇవే..
గంగా, యమునా, సరస్వతి సంగమమైన త్రివేణి సంగమంలో ఎంతోమంది పుణ్య స్నానాలు చేసి తరించారు. హిందువులు ఎంతో పవిత్రంగా భావించే మహా కుంభమేళా కార్యక్రమం విజయవంతం కావడానికి ప్రభుత్వం కూడా సహకరించింది. 45 రోజులు జరిగిన మహా కుంభమేళా కార్యక్రమం ద్వారా వచ్చిన ఆదాయం ఏకంగా రూ. 3 లక్షల కోట్లు అని తెలుస్తోంది. కాగా ఈ కార్యక్రమం కోసం రాష్ట్ర ప్రభుత్వం రూ. 7,000 కోట్ల వరకు ఖర్చు చేసినట్లు తెలుస్తోంది.
మహా కుంభమేళా కార్యక్రమంలో ఎంతోమంది పాపులర్ అయ్యారు. ఇందులో తేనెకళ్ల సుందరి మోనాలిసా, ఐఐటీ బాబా, గర్ల్ ఫ్రెండ్ ఇచ్చిన ఐడియాతో వేప పుల్లలు విక్రయిస్తూ ఫేమస్ అయిన వ్యక్తి.. చాయ్ వాలే బాబా ఐఏఎస్ కోచింగ్ స్టీవ్ జాబ్స్ సతీమణి మొదలైనవారు ఉన్నారు. మొత్తానికి మహా కుంభమేళా పూర్తయింది. ఇక వచ్చే కుంభమేళా కోసం అందరూ వేయికళ్లతో ఎదురు చూడాల్సిందే!.