Why Celebrities Buy Used Cars: యానిమల్ (Animal) సినిమా ఎంత సక్సెస్ సాధించిందో అందరికి తెలుసు. యానిమల్ సినిమా అంటే రణబీర్ కపూర్, రష్మిక మందన్న మాత్రమే కాకుండా నటి త్రిప్తి డిమ్రీ కూడా అందరికి గుర్తొస్తుంది. అంతలా ఫేమస్ అయిన ఈమె గతంలో ‘రెనాల్ట్ డస్టర్’ (Renault Duster) కారును ఉపయోగించేది. అయితే ఇప్పుడు ఈమె ఖరీదైన రేంజ్ రోవర్ ఉపయోగిస్తోంది. అయితే ఇది కొత్త కారు కాదని తెలుస్తోంది.
ఇంతకీ ప్రముఖ సినీతారలు కొత్త కార్లను కాకూండా పాత కార్లను లేదా సెకండ్ హ్యాండ్ కార్లను ఎందుకు ఉపయోగిస్తారు. త్రిప్తి డిమ్రీ కాకుండా ఇప్పటికే ఈ సెకండ్ హ్యాండ్ కార్లను కొనుగోలు చేసి ఉపయోగిస్తున్న సెలబ్రిటీలు ఎవరు అనేది ఇక్కడా వివరంగా చూసేద్దాం..
త్రిప్తి డిమ్రీ రేంజ్ రోవర్
ఒకప్పుడు మార్కెట్లో కొంత సరసమైన ధరకు లభించే రెనాల్ట్ డస్టర్ కారును ఉపయోగించే నటి త్రిప్తి డిమ్రీ.. కొంత కాలం తరువాత ఎక్కువమంది సెలబ్రిటీలకు ఇష్టమైన రేంజ్ రోవర్ కొనుగోలు చేసింది. ఈమె ఉపయోగించిన డస్టర్ కారు.. బ్రాంజ్ కలర్ పొంది ఉంది. ఇది డస్టర్ యొక్క ఫేస్‌లిఫ్ట్ వెర్షన్ అని తెలుస్తోంది. కాగా ప్రస్తుతం త్రిప్తి డిమ్రీ ఉపయోగిస్తున్న కారు రేంజ్ రోవర్ స్పోర్ట్స్.
రేంజ్ రోవర్ స్పోర్ట్స్
శాటిన్ బ్లాక్ కలర్ ఆప్షన్లో ఉన్న త్రిప్తి డిమ్రీ రేంజ్ రోవర్ కారు 2018 నాటికి చెందినదని తెలుస్తోంది. ఇది గ్రే కలర్ ఇంటీరియర్ పొందింది. ఎల్ఈడీ మ్యాట్రిక్స్ హెడ్‌ల్యాంప్, 4 జోన్ క్లైమేట్ కంట్రోల్, ఎగ్జిక్యూటివ్ క్లాస్ సీటింగ్, స్టీరింగ్ మౌంటెడ్ కంట్రోల్స్ మొదలైనవన్నీ పొందుతుంది. కాబట్టి ఇది ఉత్తమ డ్రైవింగ్ అనుభూతిని అందిస్తుంది.
రేంజ్ రోవర్ స్పోర్ట్స్ కారు 3.0 లీటర్ వీ6 డీజిల్ ఇంజిన్ పొందుతుంది. ఇది 255 బ్రేక్ హార్స్ పవర్ (Bhp) ప్రొడ్యూస్ చేస్తుంది. కాగా కంపెనీ 5.0 లీటర్ వీ8 పెట్రోల్ ఇంజిన్ ఎంపికలో కూడా అందిస్తోంది. ఇది 518 Bhp పవర్ అందిస్తుంది. ఇంజిన్ 8 స్పీడ్ ఆటోమాటిక్ ట్రాన్స్‌మిషన్‌తో జతచేయబడి ఉంటుంది. మొత్తం మీద ఇది మంచి పనితీరును అందిస్తుందని సమాచారం.
సెకండ్ హ్యాండ్ కార్లను ఎంచుకున్న సెలబ్రిటీలు
ప్రారంభంలో చెప్పుకున్నట్లుగానే త్రిప్తి డిమ్రీ మాత్రమే కాకుండా.. ఇతర సెలబ్రిటీలు కూడా వాడిన లగ్జరీ కార్లను ఎంచుకున్నారు. ఈ జాబితాలో శిల్పాశెట్టి, హానీ సింగ్, బాద్షా మరియు క్రికెటర్ విరాట్ కోహ్లీ, దినేష్ కార్తిక్ మొదలైనవారు ఉన్నారు.
వాడిన కార్లను ఎంచుకోవడానికి ప్రధాన కారణం ఏమిటంటే?
నిజానికి కొత్త కార్లకంటే కూడా వాడిన లేదా సెకండ్ హ్యాండ్ కార్ల ధరలు కొంత తక్కువగానే ఉంటాయి. ఈ కారణంగానే చాలామంది ప్రజలు ఈ మార్గం ద్వారానే కార్లను ఎంచుకుంటారు. ఇందులో సెలబ్రిటీలు కూడా ఉన్నారు. ఒక కారును కొన్ని రోజులు ఉపయోగించిన తరువాత దాని విలువ గణనీయంగా తగ్గిపోతుంది. కొన్ని సార్లు కొత్త కారు ధర కంటే పాత కారు ధర దాదాపు 50 శాతం తక్కువ ఉంటుంది. కాబట్టి సెలబ్రిటీలకు డబ్బు ఉన్నప్పటికీ.. అనవసరంగా డబ్బు వృధా చేయడం ఇష్టం లేకుండా.. వాడిన కార్లను కొనుగోలు చేయడానికి ఇష్టపడుతున్నారు.
వాడిన కార్లను కొనుగోలు చేయడానికి మరో ప్రధాన కారణం తక్కువ దూరం ప్రయాణించిన కార్లు, తక్కువ ధరకు లభించడమనే తెలుస్తోంది. కొంతమంది లగ్జరీ కార్లను రోజువారీ వినియోగానికి అస్సలు ఉపయోగించే అవకాశం లేదు. కాబట్టి వారు ఇలాంటి కార్లను అరుదుగా ఉపయోగిస్తారు. కాబట్టి అవి మంచి కండిషన్‌లోనే ఉంటాయి. అలాంటి కార్ల ధర తక్కువగా ఉంటుంది. కాబట్టి వాటిని నిరభ్యంతరంగా కొనుగోలు చేయవచ్చు.
ఇండియన్ క్రికెటర్ విరాట్ కోహ్లీ కూడా వాడిన కారును వినియోగించారు. ఈయన రెండు ఖరీదైన బెంట్లీ కాంటినెంటల్ జీటీ కార్లను కలిగి ఉన్నట్లు సమాచారం. ఇందులో ఒకటి ఢిల్లీలో ఉంది, మరొకటి ముంబైలో ఉంది. 2018లో కోహ్లీ తెల్ల రంగు బెంట్లీ కారును కొంగులు చేశారు. కొత్త కారు కొనుగోలు చేస్తే రూ. 3.5 కోట్లు ఖర్చు అవుతుంది. కాబట్టి వాడిన కారును కొనుగోలు చేయాలని నిర్ణయించుకున్నారు.
Don’t Miss: కల నిజమైన వేళ.. లక్షల ఖరీదైన ‘భవికా శర్మ’ కొత్త కారు (ఫోటోలు)
నటి శిల్పాశెట్టి కూడా 2018లో ఒక వాడిన రేంజ్ రోవర్ వోగ్ కారును కొనుగోలు చేసింది. అంతే కాకుండా బెంట్లీ ఫ్లయింగ్ స్పర్ కూడా కొనుగోలు చేసింది. క్రికెటర్ దినేష్ కార్తిక్ కూడా పోర్స్చే టర్బో ఎస్ మోడల్ కొనుగోలు చేశారు. హానీ సింగ్ ఆడి ఆర్8 కొనుగోలు చేశారు. దీన్ని బట్టి చూస్తే.. పలువురు ప్రముఖులు కొత్త ఖరీదైన కార్లను కొనుగోలు చేయడం కంటే కూడా వాడిన కార్లను కొనుగోలు చేయడానికే ఎక్కువ ఆసక్తి చూపుతున్నట్లు అర్థమవుతోంది.