ప్రియమైనవారికి గిఫ్ట్ ఇవ్వడంలో లభించే ఆనందమే వేరు. ఈ కారణంగానే చాలామంది భర్తలు వారి భార్యలకు, భార్యలు తమ భర్తలకు అప్పుడప్పుడు సర్‌ప్రైజ్ గిఫ్ట్స్ ఇస్తూ ఉంటారు. ఇలాంటి ఘటనే ఇటీవల ఒకటి వెలుగులోకి వచ్చింది. ఇందులో ఒక మహిళ తన భర్తకోసం ఐదేళ్లు కష్టపడి పోగుచేసిన డబ్బుతో కారు కొనిచ్చింది.
సొంతంగా కారు కొనాలని
”చిన్నప్పటి నుంచి.. ఇప్పటి వరకు నేను కోరుకున్న ప్రతిదీ చాలా సులభంగానే వచ్చింది. కానీ కారును మాత్రం సొంతంగా కొనాలనుకున్నాను. కారు కావాలని అమ్మానాన్నలను అడిగితే.. ఎప్పుడో కొనిచ్చే వారు. కానీ అలా వద్దనుకున్నాను. దీనికోసం డబ్బు పోగుచేయాలని, ఒక లక్ష రూపాయలతో సెకండ్ హ్యాండ్ కారు కొనాలని అనుకున్నాను. లక్ష రూపాయలు కూడబెట్టిన తరువాత.. రూ. రెండు లక్షలు, రూ. మూడు లక్షలు పోగు చేయాలనుకున్నాను.
డబ్బు కూడబెట్టే క్రమంలో సెకండ్ హ్యాండ్ కారును ఎందుకు కొనాలి?, కొత్తదే కొనేస్తే బాగుంటుందని నిర్ణయించుకున్నాను. దీనికోసం ఐదేళ్లు చిన్న చిన్న వస్తువులను, ఇష్టాలను త్యాగం చేసాను. మొత్తానికి రూ. 7 లక్షలు పోగుచేసాను. నేను సన్‌రూఫ్ ఉన్న కారును కొనాలి అనుకున్నాను. ఇంకా కొంత డబ్బు యాడ్.. కియా సిరోస్ కారును కొనేశాను. ఈ కారు కేవలం నా కల మాత్రమే కాదు. ఇది ఒక భావోద్వేగం. అయితే.. నా భర్త మొదటి నుంచి నా కలల కంటే ఎక్కువ ప్రేమను ఇచ్చారు. కాబట్టి నేను కొన్న కారును ప్రేమ లేఖగా.. మా మొదటి వివాహ వార్షికోత్సవం సందర్భంగా గిఫ్ట్ ఇస్తున్నా” అంటూ తన ఇన్‌స్టా ఖాతాలో పేర్కొంది.
కియా సిరోస్ డెలివరీ
ఐదేళ్లు పోగు చేసిన డబ్బుతో.. మహిళ కియా సిరోస్ కొనుగోలు చేసింది. దీనికి సంబంధించిన ఒక చిన్న వీడియో క్లిప్ కూడా షేర్ చేసింది. ఇందులో డాక్యుమెంట్ వర్క్ పూర్తి చేయడం, కారు డెలివరీ తీసుకోవడం, కేక్ కట్ చేయడం వంటివి కనిపిస్తాయి. కష్టపడి పోగుచేసిన డబ్బుతో.. తన భర్తకు గిఫ్ట్ ఇవ్వడంతో ఆమె ఆనందానికి అవధులు లేకుండా పోయింది.
కియా సిరోస్ గురించి
దేశీయ మార్కెట్లోని సరసమైన కార్ల జాబితాలో.. కియా కంపెనీకి చెందిన సిరోస్ ఒకటి. దీని ధర రూ. 9.50 లక్షల నుంచి రూ. 17.80 లక్షల (ఎక్స్ షోరూమ్) మధ్య ఉంది. సింపుల్ డిజైన్, అత్యాధునిక ఫీచర్స్ కలిగిన ఈ కారు.. మంచి మైలేజ్ కూడా అందిస్తుంది.
పెద్ద పనోరమిక్ సన్‌రూఫ్, 30 ఇంచెస్ ట్రినిటీ డిస్‌ప్లే, స్టార్ట్/స్టాప్ బటన్, వివిధ ఫంక్షన్స్ కోడం కావలసిన కంట్రోల్స్ కలిగిం టూ స్పోక్ స్టీరింగ్ వీల్, ఎలక్ట్రానిక్ పార్కింగ్ బ్రేక్, వైర్‌లెస్ ఛార్జర్, ఫ్రంట్ వెంటిలేటెడ్ సీట్లు, పవర్డ్ డ్రైవర్ సీటు వంటి ఫీచర్స్ సిరోస్ కారులో ఉంటాయి. అంతే కాకుండా.. 360 డిగ్రీ కెమెరా, లెవెల్ 2 ఏడీఏఎస్, ఏబీఎస్ విత్ ఈబీడీ, టైర్ ప్రెజర్ మానిటరింగ్ సిస్టం కూడా ఉన్నాయి. ఇవన్నీ వాహన వినియోగదారులకు మంచి డ్రైవింగ్ అనుభూతిని అందిస్తుంది.