Yamaha Aerox Version S Launched in India: ఆటోమొబైల్ మార్కెట్ రోజు రోజుకి మూడు పువ్వులు.. ఆరు కాయలుగా అభివృద్ధి చెందుతున్న తరుణంలో గ్లోబల్ మార్కెట్లో ప్రతి రోజు ఏదో ఒక మూల ఓ కొత్త వెహికల్ లాంచ్ అవుతూనే ఉంది. ఇందులో భాగంగానే ఇప్పుడు భారతీయ విఫణిలో జపనీస్ కంపెనీ ఓ సరికొత్త స్కూటర్ లాంచ్ చేసింది. దీని గురించి మరిన్ని వివరాలు వివరంగా ఈ కథనంలో తెలుసుకుందాం.
ఇండియన్ మార్కెట్లో అత్యంత ప్రజాదరణ పొందిన జపాన్ బ్రాండ్ ‘యమహా’ (Yamaha) ఎట్టకేలకు ”ఏరోక్స్” (Aerox) కొత్త వేరియంట్ లాంచ్ చేసింది. కంపెనీ లాంచ్ చేసిన ఈ కొత్త వేరియంట్ పేరు ‘ఏరోక్స్ వెర్షన్ ఎస్’ (Aerox Version S). ఇది చూడటానికి దాని మునుపటి మోడల్ మాదిరిగా ఉన్నప్పటికీ.. కాస్మొటిక్ అప్డేట్స్ గమనించవచ్చు.
ధర (Yamaha Aerox Version S Price)
దేశీయ విఫణిలో లాంచ్ అయిన కొత్త ‘యమహా ఏరోక్స్ వెర్షన్ ఎస్’ ధర రూ. 150600 (ఎక్స్ షోరూమ్). ఈ కొత్త వెర్షన్ ధర దాని స్టాండర్డ్ మోడల్ కంటే కూడా రూ. 3000 ఎక్కువని తెలుస్తోంది. అయితే ఈ స్కూటర్ కీలెస్ ఇగ్నిషన్‌ను పొందుతుంది. ఇది చెప్పుకోదగ్గ అప్డేట్.
కీలెస్ ఇగ్నిషన్ (Keyless Ignition)
యమహా ఏరోక్స్ వెర్షన్ ఎస్ అనేది ప్రస్తుతం దేశీయ మార్కెట్లో కీలెస్ ఇగ్నిషన్ పొందుతున్న అతి కొన్ని స్కూటర్లలో ఒకటి. ఈ ఫీచర్ వల్ల మీరు స్కూటర్ దగ్గరగా ఉన్నప్పుడు స్టార్ట్ లేదా స్టాప్ చేయవచ్చు. ఇమ్మొబిలైజర్ ఫీచర్ కూడా పొందుతుంది. ఈ స్కూటర్ యమహా ఆర్15 మరియు MT 15 బైకులు రూపొందించబడిన అదే ప్లాట్‌ఫారమ్ ఆధారంగా తయారైంది. ఇప్పటికే హోండా మోటార్‌సైకిల్ కంపెనీ హెచ్ స్మార్ట్ వేరియంట్ లాంచ్ చేసింది.
కలర్ ఆప్షన్స్ (Yamaha Aerox Version S Colour Option)
కొత్త యమహా ఏరోక్స్ వెర్షన్ ఎస్ స్కూటర్ కేవలం రెండు కలర్ ఆప్షన్లలో మాత్రమే లభిస్తుంది. అవి సిల్వర్ కలర్ మరియు రేసింగ్ బ్లూ కలర్ ఆప్షన్స్. ఇవి రెండూ చూడటానికి చాలా ఆకర్షణీయంగా ఉంటాయి. ఈ స్కూటర్ మీద యమహా, ఏరోక్స్ బ్యాడ్జింగ్స్ కూడా గమనించవచ్చు. ఈ స్కూటర్ దాని మోటోజీపీ కలర్ స్కీమ్ స్కూటర్ కంటే ఎక్కువ కావడం గమనార్హం.
డిజైన్ మరియు ఫీచర్స్ (Yamaha Aerox Version S Design & Features)
డిజైన్ పరంగా కొత్త యమహా ఏరోక్స్ వెర్షన్ ఎస్ చూడటానికి దాని మునుపటి మోడల్ మాదిరిగానే ఉంటుంది. హెడ్‌లాంప్, టెయిల్ లాంప్, సింగిల్ పీస్ స్టెప్ అప్ సీటు, గ్రాబ్ రైల్, ముందు భాగంలో షార్ప్ నోస్ మరియు ఇండికేటర్స్ అన్నీ కూడా మునుపటి మోడల్ మాదిరిగానే ఉండటం చూడవచ్చు.
ఫీచర్స్ పరంగా కూడా స్టాండర్డ్ మోడల్‌కు సమానంగా ఉంటుంది. కాబట్టి కొత్త యమహా ఏరోక్స్ స్కూటర్ కూడా అదే ఫీచర్స్ పొందుతుంది. ఇవన్నీ స్కూటర్ రైడర్లకు చాలా అనుకూలంగా, రైడింగ్ సమయంలో బైక్ గురించి చాలా సమాచారం అందిస్తుంది. కాబట్టి ఇందులో కొత్త ఫీచర్స్ లేవని స్పష్టంగా తెలుస్తోంది.
ఇంజిన్ (Yamaha Aerox Version S Engine)
ఇక ఇంజిన్ విషయానికి వస్తే.. యమహా ఏరోక్స్ వెర్షన్ ఎస్ స్కూటర్ అదే 155 సీసీ సింగిల్ సిలిండర్ లిక్విడ్ కూల్డ్ ఇంజిన్ పొందుతుంది. ఇది 8000 rpm వద్ద 14.75 Bhp పవర్ మరియు 6500 rpm వద్ద 13.9 న్యూటన్ మీటర్ టార్క్ ప్రొడ్యూస్ చేస్తుంది. మొత్తానికి ఈ స్కూటర్ యాంత్రికంగా కూడా ఎలాంటి అప్డేట్స్ పొందలేదని తెలుస్తోంది. ఈ స్కూటర్ 50.3 కిమీ/లీ (సిటీ) మరియు 57.2 కిమీ/లీ (హైవే) మైలేజ్ అందిస్తుందని సమాచారం.
Don’t Miss: భారత్‌లో మొబైల్ నెంబర్ ముందు +91 ఎందుకు ఉంటుందంటే..
దేశీయ విఫణిలో ఇప్పటికే విడుదలైన యమహా ఏరోక్స్ 155 స్కూటర్ మంచి అమ్మకాలను పొందుతూ ముందుకు దూసుకెళ్తోంది. ఈ స్కూటర్ దాని మునుపటి మోడల్స్ కంటే చాలా భిన్నంగా ఉంటుంది. కాబట్టి ఎక్కువమంది యువ కస్టమర్లను ఈ స్కూటర్ ఆకర్శించగలిగింది. కాబట్టి ఇప్పుడు మరో వేరియంట్ రూపంలో లాంచ్ అయిన ఏరోక్స్ తప్పకుండా మంచి అమ్మకాలు పొందుతుందని భావిస్తున్నాము. అయితే ఈ బైక్ ఎలాంటి అమ్మకాలు పొందుతుందనేది తెలియాల్సి ఉంది.